భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అవికా గోర్‌ సినిమా | Avika Gor And Vikram Bhatt Bloody Isshq Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Bloody Isshq In OTT: భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అవికా గోర్‌ సినిమా

Published Tue, Jul 16 2024 4:12 PM | Last Updated on Tue, Jul 16 2024 4:38 PM

Avika Gor And Vikram Bhatt Movie Bloody Isshq OTT Release

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన అవికా గోర్‌ కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన  హారర్ థ్రిల్లర్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్‌లో నటించిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల. అందులో ఆమె నటనకు గాను ఉత్తమ  నటిగా సైమా అవార్డ్‌ దక్కింది. గతేడాదిలో నిర్మాతగా పాప్‌కార్న్ అనే చిన్న సినిమాను ఆమె నిర్మించింది. కానీ, ఆ సినిమా నష్టాలను మిగిల్చింది.  

అవికా గోర్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ నటించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో 'బ్లడీ ఇష్క్‌' అనే హారర్‌ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని విక్రమ్‌ భట్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌లో '1920, రాజ్‌ వంటి హారర్‌ సినిమాలతో ఆయన సూపర్‌ హిట్‌ అందుకున్నారు. తాజాగా ఆయన మరోసారి అదే కాన్సెప్ట్‌తోనే 'బ్లడీ ఇష్క్‌' చిత్రాన్ని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఓటీటీలో ఎప్పుడు విడుదల
బ్లడీ ఇష్క్ సినిమా జులై 26న ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు  హాట్‍స్టార్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హిందీలో ట్రైలర్‌ను కూడా తాజాగా విడుదల చేసింది. అయితే, ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అవికా గోర్‌కు తెలుగు మార్కెట్‌ ఎక్కువని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement