Vikram Bhatt film
-
భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అవికా గోర్ సినిమా
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన అవికా గోర్ కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్లో నటించిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల. అందులో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డ్ దక్కింది. గతేడాదిలో నిర్మాతగా పాప్‌కార్న్ అనే చిన్న సినిమాను ఆమె నిర్మించింది. కానీ, ఆ సినిమా నష్టాలను మిగిల్చింది. అవికా గోర్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ నటించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో 'బ్లడీ ఇష్క్' అనే హారర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని విక్రమ్ భట్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్లో '1920, రాజ్ వంటి హారర్ సినిమాలతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన మరోసారి అదే కాన్సెప్ట్‌తోనే 'బ్లడీ ఇష్క్' చిత్రాన్ని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఓటీటీలో ఎప్పుడు విడుదలబ్లడీ ఇష్క్ సినిమా జులై 26న ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు హాట్‌స్టార్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హిందీలో ట్రైలర్‌ను కూడా తాజాగా విడుదల చేసింది. అయితే, ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అవికా గోర్‌కు తెలుగు మార్కెట్ ఎక్కువని చెప్పవచ్చు. -
ప్రముఖ దర్శకుడి కుమార్తె నిశ్చితార్థం.. భావోద్వేగానికి గురైన తండ్రి
ప్రముఖ చిత్రనిర్మాత, బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ కుమార్తె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇటీవల జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను విక్రమ్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆయన కూతురు కృష్ణ భట్‌కు వేదాంత్ సర్దా అనే అబ్బాయితో నిశ్చితార్థం నిర్వహించారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. విక్రమ్ భట్ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. నేను చేతులపై మోసిన చిన్నారి నా కూతురేనా అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె తలపై ఒక ముద్దు పెట్టి కుమార్తెపై ప్రేమను చాటుకున్నారు విక్రమ్ భట్. ఫోటోలు చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటులు సైతం జంటపై క్రేజీ కామెంట్స్ చేశారు. సుస్మితా సేన్, నటుడు రాహుల్ దేవ్, బిపాసా బసు, ఈషా గుప్తా ఇరువురి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు ఇతర సెలబ్రెటీలు కూడా ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) -
బాలీవుడ్‌ను భయపెట్టనున్న అవికా గోర్..
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్‌ను లీడ్ రోల్‌కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్‌లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్ View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ సినిమాలో ఎన్ని ముద్దులున్నా బాధలేదు
ముంబై: కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) చైర్మన్ పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్ దర్శక, నిర్మాత విక్రమ్ భట్‌పై విరుచుకుపడ్డారు. బాలీవుడ్లో భట్ క్యాంప్ వారి సినిమాల విడుదలకు ముందు సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడం పబ్లిసిటీ కోసమేనని విమర్శించారు. విక్రమ్ భట్ సినిమాలో ఎన్ని ముద్దు సన్నివేశాలున్నా, లేకున్నా తనకు బాధలేదంటూ నిహలానీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన తాజా హర్రర్ మూవీలో ఎఫ్ పదం వాడటాన్ని 32 నుంచి 16 సార్లుకు తగ్గించాలని సెన్సార్ బోర్డు సూచించిందని ఇటీవల విక్రమ్ భట్ చెప్పాడు. అంతేగాక ఈ సినిమా ట్రైలర్‌కు థియేటర్లలో ప్రదర్శించడానికి యూ/ఏ, టీవీల కోసం ఏ సర్టిఫికెట్ ఇచ్చారని విమర్శించాడు. నిహలానీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ విక్రమ్ భట్ సహా భట్ క్యాంప్ సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ కోసం సెన్సార్ బోర్డును, తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. వాళ్లకు సెన్సార్ బోర్డు మార్కెటింగ్ సాధనంగా మారిందని, ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిలేకపోతే కావాలనే విమర్శలు చేస్తారని మండిపడ్డారు. భట్ క్యాంప్‌నకు కానీ ఇతరులకు కానీ సెన్సార్ బోర్డు ఉచిత పబ్లిసిటీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొదట సెన్సార్ బోర్డుపై విమర్శలు చేసి, తర్వాత మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తారని నిహలానీ విమర్శించారు.