
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టనుంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్‌ను లీడ్ రోల్‌కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్‌లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.
చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్
చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్