Krishna Bhatt
-
'ఆ నిర్మాత పారితోషికం ఇవ్వలేదు'.. టాలీవుడ్ హీరోయిన్!
బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ భామ మాల్వీ మల్హోత్రా. ఆ తర్వాత హిందీలో హోటల్ మిలాన్ చిత్రం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హిందీతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది ముద్దుగుమ్మ. పంజాబీ కుటుంబానికి చెందిన మాల్వీ పలు వీడియో ఆల్బమ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మాల్వీ మల్హోత్రా సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ తనను మోసం చేశారని ఆరోపించారు. తాను మాల్వి బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ నే అనే మ్యూజిక్ వీడియోలో పనిచేశానని తెలిపారు. ఈ పాటకు ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. అయితే ఈ ఆల్బమ్‌లో నటించినందుకు విక్రమ్ తనకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని మాల్వీ మల్హోత్రా ఆరోపించింది. పారితోషికం కోసం విక్రమ్‌కు కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించలేదని ఆమె పేర్కొంది. మాల్వీ మాట్లాడుతూ.. 'నేను విక్రమ్ భట్ నిర్మించిన బర్బాద్ కర్ దియా ఆల్బమ్ సాంగ్ కోసం పనిచేశా. అప్పడే నేను దక్షిణాదిలో సినిమా షూట్లతో బిజీగా ఉన్నా. అయినప్పటికీ విక్రమ్ భట్ ఆయన నిర్మాణంలో ఒక పాట చేయమని నన్ను సంప్రదించారు. నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సమయం కేటాయించా. ఎందుకంటే వారిని నేను పూర్తిగా విశ్వసించా. కానీ ఆ తర్వాత నాకు పెండింగ్‌లో డబ్బుల కోసం ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన రాలేదు. కొన్ని నెలల తర్వాత విక్రమ్ భట్ మళ్లీ వారి తన ప్రాజెక్ట్‌లో పని చేయమని నన్ను అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక నటిగా మరే ఇతర ఆర్టిస్ట్ కూడా ఇలా మోసపోకూడదని దీన్ని షేర్ చేస్తున్నా" అని వెల్లడించింది. అయితే ఈ విషయంపై విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ స్పందించింది. ఆ డబ్బులు విషయం గురించి తనకు తెలియదని.. అందుకే దానిపై నేను ఏం మాట్లాడదలచుకోలేదని చెప్పింది. -
పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!
ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ పెళ్లి పీటలెక్కనుంది. తన ప్రియుడు వేదాంత్ సర్దాను ఈ నెలలోనే వివాహాం చేసుకోనుంది. ఈ ప్రేమజంట పెళ్లి జూన్ 11న ముంబైలో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని విక్రమ్ భట్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన కుమార్తె కృష్ణ భట్‌కు.. గతేడాది డిసెంబర్లో వేదాంత్ సర్దాతో నిశ్చితార్థం అయినట్లు తెలిపారు. (ఇది చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో) కాగా కృష్ణ భట్ నిర్మాతగా '1920 - హారర్స్ ఆఫ్ ది హార్ట్' అనే సినిమాతో ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ భట్, ఆనంద్ పండిట్ సమర్పణలో రాజ్ కిషోర్ ఖవారెతో కలిసి విక్రమ్ భట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 23న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: స్నేహం పేరుతో నమ్మించి.. బాలికపై అత్యాచారం.. సింగర్ అరెస్ట్) View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) -
బాలీవుడ్‌ను భయపెట్టనున్న అవికా గోర్..
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్‌ను లీడ్ రోల్‌కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్‌లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్ View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొలీజియం’ను ప్రశ్నించిన మంత్రి
న్యూఢిల్లీ: కర్ణాటకలోని జిల్లా జడ్జి పి.కృష్ణభట్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు జరగలేదని, విశాఖ కేసులో సుప్రీంకోర్టు పొందుపరిచిన నిబంధనల మేరకు ఆ ఫిర్యాదును విచారించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రాకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై జరుగుతున్న నిష్పాక్షిక విచారణలో ఆ జడ్జి నిర్దోషిగా తేలేవరకూ హైకోర్టు జడ్జిగా నియమించాలన్న సిఫార్సుల్ని సుప్రీంకోర్టు కొలీజియం నిలుపుదల చేయలేదా? అని లేఖలో ప్రశ్నించారు. జడ్జి కృష్ణభట్పై జూనియర్ న్యాయాధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని కర్ణాటక హైకోర్టు తప్పుగా తేల్చిందని.. అయితే కర్ణాటక హైకోర్టు సీజే మళ్లీ విచారణ జరపడాన్ని సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ప్రశ్నించడం తెల్సిందే. లేఖలో న్యాయ శాఖ మంత్రి ప్రసాద్ స్పందిస్తూ.. ‘న్యాయవ్యవస్థ సిఫార్సుల్ని కార్యనిర్వాహక వ్యవస్థ అడ్డుకుంటోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. జడ్జిపై జూనియర్ మహిళా న్యాయాధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సంక్షిప్త విచారణ పలు తీవ్ర సందేహాల్ని రేకెత్తించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో జాగ్రత్తగా విచారణ చేయించడాన్ని కూడా సరైన, తగిన, తిరుగులేని దర్యాప్తుగా పరిగణించాలి’ అని ప్రసాద్ పేర్కొన్నారు. -
మానసిక ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించాలి
రాయచూరు, న్యూస్‌లైన్ : మానసిక ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ ప్రాధికారం అధ్యక్షులు కృష్ణభట్ అన్నారు. ఆయన గురువారం స్థానిక ఐఎంఏ హాల్లో జిల్లా న్యాయసేవ ప్రాధికారం, జిల్లా న్యాయవాదుల సంఘం, భారతీయ వైద్యకీయ సంఘం, ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల మానసిక అస్వస్థుల సంఖ్య పెరుగుతోందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. శారీరక ఆరోగ్య నియంత్రణ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని, దీంతో మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ల పర్యవసానంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. మారిన జీవన శైలి ఒత్తిళ్లు పెరగడానికి కారణమన్నారు.సమాజంలో చక్కటి నాగరికతను అలవాటు చేసుకోవడం ప్రధానమన్నారు. మానసిక అస్వస్థులను హింసించడం, వేధించడం వంటి పనులకు సమాజం స్వస్తి చెప్పాలని కోరారు. అలాంటి వారికి తగిన చికిత్స ఇప్పించేందుకు ఆసక్తి చూపాలన్నారు. అంతకుముందు సైకియాట్రిస్ట్ డాక్టర్ మాలిపాటిల్ మానసిక ఒత్తిళ్ల పరిణామాల గురించి వివరించారు. న్యాయమూర్తి ముజాహిద్, జిల్లాధికారి నాగరాజ్, ఎస్పీ ఎంఎం.నాగరాజ్, నవోదయ కళాశాల డీన్ డాక్టర్ ప్రకాష్, ఐఎంఏ అధ్యక్షుడు కులకర్ణి, విమ్స్ మనోవైద్యుడు రమేష్‌బాబు, మనోహర్ , న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు భా నురాజ్ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షే మ అధికారి డాక్టర్ నారాయణప్ప, వై ద్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.