Vikram Bhatt
-
'ఆ నిర్మాత పారితోషికం ఇవ్వలేదు'.. టాలీవుడ్ హీరోయిన్!
బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ భామ మాల్వీ మల్హోత్రా. ఆ తర్వాత హిందీలో హోటల్ మిలాన్ చిత్రం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హిందీతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది ముద్దుగుమ్మ. పంజాబీ కుటుంబానికి చెందిన మాల్వీ పలు వీడియో ఆల్బమ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మాల్వీ మల్హోత్రా సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ తనను మోసం చేశారని ఆరోపించారు. తాను మాల్వి బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ నే అనే మ్యూజిక్ వీడియోలో పనిచేశానని తెలిపారు. ఈ పాటకు ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. అయితే ఈ ఆల్బమ్‌లో నటించినందుకు విక్రమ్ తనకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని మాల్వీ మల్హోత్రా ఆరోపించింది. పారితోషికం కోసం విక్రమ్‌కు కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించలేదని ఆమె పేర్కొంది. మాల్వీ మాట్లాడుతూ.. 'నేను విక్రమ్ భట్ నిర్మించిన బర్బాద్ కర్ దియా ఆల్బమ్ సాంగ్ కోసం పనిచేశా. అప్పడే నేను దక్షిణాదిలో సినిమా షూట్లతో బిజీగా ఉన్నా. అయినప్పటికీ విక్రమ్ భట్ ఆయన నిర్మాణంలో ఒక పాట చేయమని నన్ను సంప్రదించారు. నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సమయం కేటాయించా. ఎందుకంటే వారిని నేను పూర్తిగా విశ్వసించా. కానీ ఆ తర్వాత నాకు పెండింగ్‌లో డబ్బుల కోసం ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన రాలేదు. కొన్ని నెలల తర్వాత విక్రమ్ భట్ మళ్లీ వారి తన ప్రాజెక్ట్‌లో పని చేయమని నన్ను అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక నటిగా మరే ఇతర ఆర్టిస్ట్ కూడా ఇలా మోసపోకూడదని దీన్ని షేర్ చేస్తున్నా" అని వెల్లడించింది. అయితే ఈ విషయంపై విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ స్పందించింది. ఆ డబ్బులు విషయం గురించి తనకు తెలియదని.. అందుకే దానిపై నేను ఏం మాట్లాడదలచుకోలేదని చెప్పింది. -
ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్
సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. ‘గదర్ 2’. 1971లో ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీషా పటేల్ టాలీవుడ్‌కి కూడా సుపరిచితమే. మహేష్ బాబు,ఎన్టీఆర్,బాలకృష్ణ , పవన్ వంటి స్టార్ హీరోలతో మెప్పించింది ఈ బ్యూటీ. బాలీవుడ్ నిర్మాత,డైరెక్టర్ విక్రమ్ భట్‌తో తన రిలేషన్షిప్ గురించి గతంలో బహిరంగంగా మాట్లాడటం వల్ల తన కెరీర్ ఎలా దెబ్బతిందో తాజాగా తెలిపింది. (ఇదీ చదవండి: కిచ్చా సుదీప్ చేసిన మోసాన్ని బయటపెట్టిన నిర్మాత) తనతో రిలేషన్షిప్ వల్ల కెరీర్ నాశనం అయిందని చెప్పింది. దాని వల్ల ఒక దశాబ్దానికి పైగా పురుషులకు దూరంగానే ఉంటూ వస్తున్నానని ఆమె చెప్పింది. అమీషా,విక్రమ్ విడిపోవడానికి ముందు చాలా సంవత్సరాలు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. విక్రమ్‌తో అమీషా పటేల్ సంబంధం బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో ప్రేమాయణం నడిపాడు విక్రమ్. ఆమెతో విడిపోయిన వెంటనే అమీషా పటేల్‌తో డేటింగ్ ప్రారంభించాడు. వారిద్దరూ Ankahee (2006)లో వచ్చిన సినిమా సమయంలో డేటింగ్ ప్రారంభించారు. కానీ తదుపరి చిత్రం 1920 (2008) విడుదలకు ముందే వారు విడిపోయినట్లు సమాచారం. అమీషా కెరీర్‌పై ప్రభావం విక్రమ్‌తో ఉన్న సంబంధం వల్ల తన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో అమీషా ఇలా తెలిపింది. 'ఈ పరిశ్రమలో, నిజాయితీకి విలువ లేదు. నేను చాలా నిజాయితీగానే ఉన్నాను. కానీ నేను ఎవరినైతే హృదయానికి దగ్గరకు చేర్చుకున్నానో అదే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అయింది. ఒకరకంగా అలాంటి గుణం ఉండటం అతిపెద్ద లోపమని కూడా భావిస్తున్నాను. పబ్లిక్‌గా మరో వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండటం వల్లే నా కెరీర్ దెబ్బతింది. దీని వల్ల 12-13 ఏళ్ల వరకు పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇలాగే ఉన్నాను. దీంతో నా జీవితంలోకి మరో పురుషుడికి చోటు ఇవ్వలేదు. శాంతి మాత్రమే నాతో ఉంది. నా జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు' అని పేర్కొంది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) అమీషాపై విక్రమ్ గతంలో అమీషాతో ఉన్న బంధం గురించి విక్రమ్ పలు కామెంట్లు చేశాడు. ఆమెను వివాహం చేసుకోవాలని ఎప్పుడూ కోరుకోలేదని ఆయన ఓపెన్‌గానే చెప్పాడు. అమీషా పటేల్ వంటి వారు ఆలోచించకుండా తమ మనసులోని మాటను పబ్లిక్‌గా బయటపెట్టేస్తారు. అలాంటి వారు అపరిపక్వంగానే ఆలోచిస్తారు. కాబట్టి ఆమెలాంటి వారు తమ మనసులోని మాటను బయటపెట్టడానికి భయపడరు అని చెప్పాడు. View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) -
నా కల నెరవేరింది
‘‘నేను హారర్ సినిమాలను భయపడుతూ చూస్తాను. ‘రాజుగారి గది 3’ హారర్ కామెడీ. కానీ ‘1920’ సినిమా సీరియస్ హారర్ ఫిల్మ్. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి.. చాలా కొత్త అనుభూతి ఇది. ఈ సినిమా తర్వాత మరిన్ని హారర్ కథల కోసం దర్శక–నిర్మాతలు నన్ను సంప్రదిస్తారని భావిస్తున్నాను’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. ప్రముఖ దర్శక–నిర్మాత మహేష్ భట్ రచన, సమర్పణలో రూపొందిన చిత్రం ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’. కృష్ణ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవికా గోర్ లీడ్ రోల్లో నటించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్‌పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్, డా.రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘మహేష్ భట్, విక్రమ్ భట్‌లాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో పని చేయడం నా కల. ‘1920’ చిత్రంతో అది ఇంత త్వరగా నెరవేరడం నా అదృష్టం. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. మహేష్ భట్, విక్రమ్ భట్ గార్లతో మాట్లాడుతునప్పుడు సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నాగార్జునగారిలో కూడా ఆ క్వాలిటీ చూశాను. ‘1920’ కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంటాయి. ఇందులో కేవలం హారర్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ నాకు కొత్త అనుభవం ఇచ్చింది. కొత్త టెక్నాలజీ (అన్ రియల్ ఇంజిన్ ఎల్ఈడీ స్క్రీన్) వాడాం.. దాని కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను నటించిన ‘ఇందు’అనే వెబ్ సిరీస్ త్వరలోనే వస్తుంది. ఆది సాయికుమార్‌కి జోడీగా నటించనున్న ‘అమరన్’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!
ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ పెళ్లి పీటలెక్కనుంది. తన ప్రియుడు వేదాంత్ సర్దాను ఈ నెలలోనే వివాహాం చేసుకోనుంది. ఈ ప్రేమజంట పెళ్లి జూన్ 11న ముంబైలో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని విక్రమ్ భట్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన కుమార్తె కృష్ణ భట్‌కు.. గతేడాది డిసెంబర్లో వేదాంత్ సర్దాతో నిశ్చితార్థం అయినట్లు తెలిపారు. (ఇది చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో) కాగా కృష్ణ భట్ నిర్మాతగా '1920 - హారర్స్ ఆఫ్ ది హార్ట్' అనే సినిమాతో ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ భట్, ఆనంద్ పండిట్ సమర్పణలో రాజ్ కిషోర్ ఖవారెతో కలిసి విక్రమ్ భట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 23న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: స్నేహం పేరుతో నమ్మించి.. బాలికపై అత్యాచారం.. సింగర్ అరెస్ట్) View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) -
ప్రముఖ దర్శకుడి కుమార్తె నిశ్చితార్థం.. భావోద్వేగానికి గురైన తండ్రి
ప్రముఖ చిత్రనిర్మాత, బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ కుమార్తె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇటీవల జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను విక్రమ్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆయన కూతురు కృష్ణ భట్‌కు వేదాంత్ సర్దా అనే అబ్బాయితో నిశ్చితార్థం నిర్వహించారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. విక్రమ్ భట్ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. నేను చేతులపై మోసిన చిన్నారి నా కూతురేనా అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె తలపై ఒక ముద్దు పెట్టి కుమార్తెపై ప్రేమను చాటుకున్నారు విక్రమ్ భట్. ఫోటోలు చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటులు సైతం జంటపై క్రేజీ కామెంట్స్ చేశారు. సుస్మితా సేన్, నటుడు రాహుల్ దేవ్, బిపాసా బసు, ఈషా గుప్తా ఇరువురి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు ఇతర సెలబ్రెటీలు కూడా ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) -
బాలీవుడ్‌ను భయపెట్టనున్న అవికా గోర్..
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్‌ను లీడ్ రోల్‌కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్‌లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్ View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భార్యకు విడాకులు, ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం!
‘ఒక అమ్మాయి కలలు కనే ప్రేమికుడిని కాను.. కోరుకునే భర్తను అంతకన్నా కాను. ప్రయత్నించాను కాని వల్ల కాలేదు. అనుబంధం అవగాహనను, రాజీపడడాన్ని ఆశిస్తుంది. ఆ రెండూ నాకు లేవు. అందుకే ప్రేమ, పెళ్లి రెండిట్లో ఫెయిల్ అయ్యాను. తోడు కన్నా ఏకాంతాన్నే ఎక్కువ కోరుకుంటుంది నా మనసు’ అంటూ తనను తాను విశ్లేషించుకుంటాడు బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్. సుష్మితా సేన్ ఆయన జీవన వైఫల్య చిత్రమే ఇది... విశ్వసుందరి సుష్మితా సేన్ మొదటి సినిమా ‘దస్తక్’. దానికి దర్శకుడు విక్రమ్ భట్. అప్పుడు సుష్మితకు 20 ఏళ్లు. విక్రమ్‌కు 27. ఈ ప్రస్తావన ఎందుకంటే ఆ లవ్ ఫెయిల్యూర్‌కి విక్రమ్ తమ వయసునే కారణంగా చూపాడు కాబట్టి. ‘దస్తక్’ సినిమా సెట్స్‌లో విక్రమ్‌ను బాగా పరిశీలించింది సుష్మిత. పని పట్ల అతనికున్న నిబద్ధత ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అతణ్ణి సమ్మోహనపరిచింది. ప్రేమ మొదలవడానికి ఈ ప్రారంభం చాలు కదా! ఒకరికోసం ఒకరన్నట్టుగా అయిపోయారు. బాలీవుడ్లో గుసగుసలు పత్రికల్లో గాసిప్స్ కాలమ్‌ను నింపేశాయి. దస్తక్ షూటింగ్ కోసం యూనిట్ అమెరికా వెళ్లింది. అక్కడ స్వేచ్ఛను ఆస్వాదించిందీ జంట. ఆ కబురును ఇక్కడ అందుకుంది అదితి భట్. భార్య అదితితో విక్రమ్ సహించలేదు.. క్షమించలేదు విక్రమ్ భార్య అదితి.. బచ్పన్ కీ దోస్త్.. ఫస్ట్ క్రష్. సుష్మితా సేన్‌తో అతను ప్రేమలో పడేనాటికే రెండేళ్ల వైవాహిక బంధం వాళ్లది. ఒక కూతురు కూడా. ఎన్నో ఆశలతో విక్రమ్ జీవిత భాగస్వామిగా అత్తింట్లోకి అడుగుపెట్టింది అదితి. అత్త, మామలు ఆమెను ఆహ్వానించిన తీరుకు నివ్వెరపోయింది. తన పట్ల వాళ్ల ప్రవర్తనకు నిర్ఘాంతపోయింది. తల్లిదండ్రుల పద్ధతిని విక్రమ్ విమర్శించకపోయినా తనకే అండగా ఉన్నాడు.. ఉంటాడు అన్న భరోసాతో ఆ ఇబ్బందులను భరించింది. బిడ్డ కోసం భర్త నిర్లక్ష్యాన్నీ క్షమించింది. కానీ ఎప్పుడైతే సుష్మితా సేన్‌తో అతని వ్యవహారం తెలిసిందో అప్పుడు సహించలేక ప్రశ్నించింది. ఆమెతో రాజీపడే ప్రయత్నం అతనూ చేయలేదు. దాంతో విడాకులతో వేరైంది ఆ జంట. ప్రేమికుడిగానూ ఓడిపోయాడు ఇటు సుష్మితా సేన్ మీద ప్రేమనూ గెలిపించుకోలేకపోయాడు విక్రమ్. ఆ లవ్ స్టోరీ ఎంత వేగంగా మొదలయిందో అంతే వేగంగా ముగిసిపోయింది. ఎవరికోసం భార్య, బిడ్డను వదులుకున్నాడో ఆ తోడునూ నిలుపుకోలేకపోయాడు. ఒంటరివాడయ్యాడు. నిరాశ పట్టుకొని పీడించసాగింది. నిస్పృహతో తనుండే ఆరవ అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుంచి దూకేయాలనుకున్నాడు. విచక్షణ ఒళ్లు విరుచుకోకపోతే దూకేసేవాడే. సుష్మితాను మరచిపోయి బతుకు మీద ప్రీతి కలగాలంటే పనిమీద దృష్టి పెట్టాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అమీషా పటేల్ ఆంఖే... ఆ సమయంలోనే ‘ఆంఖే’ సినిమాకు సిద్ధమయ్యాడు. కథానాయికగా అమీషా పటేల్ సైన్ చేసింది. సెట్స్‌లో ఇద్దరూ స్నేహితులయ్యారు. అతని గుండెలో గూడుకట్టుకున్న దిగులుకు ఆమె సాంత్వన అయింది. ఆమె కెరీర్ సమస్యలకు అతను శ్రోతలా మారాడు. నెమ్మదినెమ్మదిగా అమీషా పటేల్ నవ్వు విక్రమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపసాగింది. మనసు ఎంత చెడ్డదంటే.. కాస్త ఆప్యాయంగా పలకరించే మనిషి కనపడితే చాలు అల్లుకుపోదామని చూస్తుంది.. మునుపటి అనుభవాల చేదు ఇంకా వీడకున్నా సరే! విక్రమ్.. అమీషాను ప్రేమించసాగాడు. అమీషా కూడా విక్రమ్‌ను ఇష్టపడింది. ఆ ప్రేమ అయిదేళ్ల కాలాన్ని ఇట్టే చుట్టేసింది. ఆ ఇద్దరూ పెళ్లాడతారనే అనుకున్నారు బాలీవుడ్లో అంతా! కానీ వాళ్లిద్దరూ తమ ప్రేమను బ్రేక్ చేసుకున్నారు. అమీషా, విక్రమ్ దీనికి కారణం.. అమీషా తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడి కావచ్చు అంటారు ఆ ఇద్దరికీ సంబంధించిన సన్నిహితులు. విక్రమ్ భట్ మాత్రం ‘ఆమె తన కెరీర్ కోసం తపన పడింది.. నేను తన కోసం తపన పడ్డాను. ఆమె కోసమే ఉన్నాను. ఇంతకన్నా ఏం చేయాలి? అల్రెడీ ఒక రిలేషన్‌ను మనసు మీదకు తీసుకుని కోలుకోలేనంతగా దెబ్బతిన్నాను. ఇప్పుడు మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లదలచుకోలేదు’ అంటాడు. సుస్మితాసేన్ విషయంలో ‘తప్పు మా ఇద్దరిదీ కాదు. మా వయసులది. పరిపక్వతలేని మా మనస్తత్వాలది’ అని చెప్తాడు. భార్య, కూతురికి తను మిగిల్చిన బాధ గురించి ‘జీవితంలో నాకున్న రిగ్రెటల్లా అదొక్కటే. వాళ్లనలా వదిలేయాల్సింది కాదు. ధైర్యం లేని వాడే జిత్తులు పన్నుతాడు. నేను అలాంటి పిరికివాడినే. అదితిని వదిలేసి నేనెంత తప్పు చేశానో, ఎంత వేదనను అనుభవించానో ఆమెతో చెప్పే ధైర్యం నాకు లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ పాఠాలే నాకు’ అంటాడు విక్రమ్ భట్. ప్రస్తుతం అతని కూతురు కృష్ణ.. తండ్రికి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. కూతురికి ప్రొడక్షన్ మెళకువలు నేర్పిస్తూ ఆమె కెరీర్‌ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు విక్రమ్ భట్. - ఎస్సార్ చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ నా మాజీ భర్త వల్లే సినిమాలకు దూరం: నటి -
నేను భయాన్ని క్యాష్ చేసుకుంటా
సాక్షి, ముంబయి : స్నేహం, లవ్.. ఇలా డబ్బుతో అన్నీ అమ్ముడవుతున్న రోజుల్లో తాను భయాన్ని అమ్ముతున్నానని ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ చెప్పుకొచ్చారు. ‘ప్రేమ, స్నేహం, హాస్యం, ఆశ, చివరికి కన్నీళ్లు సైతం డబ్బుతో తయారవుతున్న నేటి ప్రపంచంలో నేను భయాన్ని అమ్ముతున్నా’ అంటూ విక్రమ్ భట్ తన ఫేస్బుక్ పేజ్‌లో రాసుకొచ్చారు. భట్ తన తదుపరి హారర్ ఫిల్మ్ ‘1921’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. లండన్‌లో చిత్రీకరించిన ఈ మూవీ ప్రధాన తారాగణం జరీన్ ఖాన్, కరణ్ కుంద్రాల చుట్టూ తిరుగుతుంది. చావు బతుకుల మధ్య ఓ జంట పడే స్ట్రగుల్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. -
డైవర్స్ తర్వాత చనిపోవాలనుకున్నా..విక్రమ్ భట్
ముంబై : ప్రముఖ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్ తన జీవితంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన పెళ్లి, విడాకులు, ఇతరులతో కొనసాగించి అఫైర్స్‌పై తనదైన శైలిలో ప్రస్తావించాడు. ఏదో ఒక సింగిల్ రిలేషన్ షిప్ తనను శిథిలం చేయలేదని పేర్కొన్నాడు. తన జీవితమే శిథిలాల సమూహం కంటే పెద్దదిగా అభివర్ణించాడు. తన చిన్ననాటి నుంచి ఎంతగానో ఇష్టపడ్డ అధితిని ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు విక్రమ్ భట్. కానీ, నటి సుస్మితా సేన్‌తో కొనసాగించిన వివాహేతర సంబంధం అధితిని అతని నుంచి దూరం చేసింది. తన భార్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత విక్రమ్ భట్ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్టు తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, కూతురును వదిలేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. 'అదంతా సుస్మితా సేన్ వల్ల జరగలేదు. నా జీవితంలో నాకు నేనుగా చేసుకున్న అతిపెద్ద తప్పులు అవి. నేను డైవర్స్ తీసుకున్నా, అప్పుడే నా చిత్రం గులాం విడుదలైంది. నేను కేవలం సుస్మితా సేన్ బోయ్ ఫ్రెండ్‌ని మాత్రమే. అధితితో డైవర్స్ తర్వాత నేను చాలా బాధపడ్డాను. నా కూతురుని మిస్సయ్యాను. నా జీవితాన్ని గందరగోళంగా చేసుకున్నాను. నా తప్పిదాలతో వాళ్లు ఎంతగానో బాధ అనుభవించారు' అంటూ తను చేసిన తప్పులపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు విక్రమ్ భట్. నీకు ధైర్యం లేకపోతేనే, మోసగాడిగా మారుతావని బలంగా నమ్మేవాడిని నేను. నేనెలా బాధపడ్డానో అధితికి చెప్పడానికి ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదు. గజిబిజిగా జరిగిన పరిణామాలు మా ఇద్దరిని దూరం చేశాయి. ఆ సమయంలో నేను చాలా వీక్‌గా ఉన్నందుకు చింతిస్తున్నా. ప్రస్తుతం పరిణామాలు చాలా మారాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో చేసిన ప్రతి తప్పు ఓ గుణ పాఠాన్ని నేర్పించిందని విక్రమ్ భట్ చెప్పారు. విక్రమ్ భట్ విడుదల చేసిన 'ఏ హ్యాండ్‌ఫుల్ సన్ షైన్' నవల వీర్, మీరా అనే క్యారెక్టర్ల చుట్టు తిరుగుతుంది. ఇద్దరూ ఎంతగా ఇష్టపడి ప్రేమించుకున్న వ్యక్తులు ఓ కారణంతో విడిపోతారు. అయితే అతని నిజజీవితానికి దగ్గరగా ఉన్న ఈ నవలలో సుస్మితా సేన్, అమీషా పటేల్ గురించి ఏమీలేదన్నారు. సుస్మితాసేన్, అమిషాపటేల్లతో కొనసాగించిన ప్రేమయాణంపై పెదవి విప్పాడు. వాళ్లు నాతో రిలేషన్షిప్లో ఉన్న సంగతి అందరికీ బాగా తెలిసిన విషయం కావొచ్చు. కానీ, వాళ్లు కేవలం తాత్కాలికం మాత్రమే. వాళ్లను ఏరోజు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని విక్రమ్ భట్ వ్యాఖ్యానించారు. -
బొద్దుగుమ్మకు భలే చాన్స్..!
ముంబై: ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ తీయనున్న హర్రర్ మూవీ '1921'. అయితే ఈ మూవీలో హీరోయిన్ చాన్స్ ఎవరికి వస్తుందనే దానిపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్ అవకాశం బాలీవుడ్ బొద్దుగుమ్మ జరీన్ ఖాన్ ను వరించింది. విక్రమ్ భట్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 2010లో 'వీర్' సినిమాతో జరీన్ ఖాన్ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ అనే విషయం తెలిసిందే. నటనకు అవకాశం ఉన్న మూవీ జరీన్ కు దక్కిందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హర్రర్ మూవీ ప్రాజెక్టుకు జరీన్ ఒప్పుకుని అగ్రిమెంట్ పై సంతకం చేసిందని విక్రమ్ భట్ వెల్లడించారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొనే పరిణామాలపై మూవీ కథాంశం ఉంటుంది. ఈ మూవీలో జరీన్ కీలకపాత్ర పోషించనుందని, వియన్నా, యార్క్ షైర్, ఇటలీ, స్కాట్లాండ్ దేశాలలో షూటింగ్ స్పాట్స్ కన్ఫామ్ చేసుకున్నామని చెప్పారు. ఫెవరెట్ డైరెక్టర్ లలో ఒకరైన విక్రమ్ భట్ తో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని జరీన్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని, ఈ నవంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పింది. రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్ ఈ మూవీలో భాగస్వామిగా ఉందని, ఇది తనకు ఐదవ మూవీ అని డైరెక్టర్ విక్రమ్ భట్ చెప్పుకొచ్చాడు. -
నేనూ నా దెయ్యాలు!
పుస్తకోత్సాహం ఎన్నో ప్రసిద్ధ నవలలు సినిమాలుగా వచ్చి హిట్ సాధించాయి. ‘సినిమాలను నవలలుగా మలిస్తే ఆ నవలలు ఎందుకు హిట్ అవ్వవు?’ అనుకున్నాడో ఏమో బాలీవుడ్ డెరైక్టర్ విక్రమ్‌భట్ తన రాబోవు చిత్రం ‘కామోషియన్’తో సహా గత చిత్రాలు ‘1920’ ‘1920-ఈవిల్ రిటర్న్స్’ చిత్రాలను నవలుగా మలుస్తున్నారు. ఈ నవలలలో గతంలో ఎవరూ చూడని ఫోటోలు, గతంలో ఎవరికీ చెప్పని విషయాలను ఇస్తున్నారు. ‘‘యువ పాఠకుల నుంచి నా పుస్తకాలకు ఆదరణ లభిస్తుంది అని ఆశిస్తున్నాను’’ అన్నారు విక్రమ్. ‘‘ఇలా పుస్తకాలను అచ్చేయడం నాకు బొత్తిగా కొత్త’’ అంటున్నారు ఆయన. సినిమాలను నవలలుగా చదువుకోవడం కూడా ఈ తరానికి ఎంతో కొంత కొత్తే కదా! ఇది సరేగానీ, హారర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వారు, ఆ ట్రాన్స్‌లో కొన్ని చిత్ర విచిత్రమైన మానసిక భ్రమలకు గురవుతుంటారు. అలాంటి విషయాలను అడపాదడపా ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. తనకు ఎదురైన హారర్ అనుభవాలను విక్రమ్‌భట్ ఒక పుస్తకంగా రాసి ‘నేనూ నా దెయ్యాలు’ అని పేరు పెడితే... అట్టి పుస్తకం హాట్ హాట్‌గా అమ్ముడవుతుంది అనడంలో అణుమాత్రం సందేహం లేదు! -
మందారం లాంటి బుగ్గలపై...
ఆ రోజు ఎప్పటిలానే బిపాసా బసు షూటింగ్‌కి రెడీ అయ్యారు. ఆ రోజు షూటింగ్ ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తూ, లొకేషన్లోకి అడుగుపెట్టారు. ఎందుకంటే, ఆ రోజు ఆమె పాల్గొనగా క్లిష్టమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి విక్రమ్ భట్ ప్లాన్ చేశారు. ఆయన దర్శకత్వంలో బిపాసా నటించిన చిత్రం ‘క్రియేచర్ త్రీడీ’. ఇదంతా ఊటీ షూటింగ్ ముచ్చట్లు. అక్కడే భారీ పోరాట దృశ్యాలు చిత్రీకరించినప్పుడు బిపాసాకు చాలా దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా బుగ్గ మీద బాగా గీరుకుపోయిందట. ఆ రోజు ఎలాగో షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్నారు ఈ బ్యూటీ. ఆ మర్నాడు ఆమెకు సంబంధించిన క్లోజప్ షాట్స్ తీయాలనుకున్నారట విక్రమ్‌భట్. కానీ, ఆమె మందారం లాంటి బుగ్గలపై ఉన్న గీట్లు కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో మునుపటికన్నా మేకప్ డోస్ పెంచారు బిపాసా. దాంతో ఒక్కసారిగా చర్మం మండిందట. ఈ విషయం గురించి బిపాసా చెబుతూ -‘‘ఫైట్స్ సీన్స్ చేయడానికి నేనెప్పుడూ వెనకాడలేదు. దెబ్బలు తగిలినా ఖాతరు చేయలేదు. సినిమా కోసం నా శరీరాన్ని ఏ స్థాయిలో అయినా కష్టపెట్టడానికి నేను రెడీ’’ అని చెప్పారు. -
క్రీచర్-3డీ హారర్ మూవీ కాదట...
విక్రమ్ భట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘క్రీచర్-3డీ’ హారర్ మూవీగానే ఇప్పటి వరకు ప్రచారం పొందింది. ఇందులో కీలకపాత్ర పోషించిన బిపాసా బసు మాత్రం ఇది హారర్ మూవీ కానే కాదంటోంది. జురాసిక్ పార్క్, అనకొండ మాదిరిగా ఇది కూడా యాక్షన్ ఓరియెంటెడ్ అడ్వంచరస్ మూవీ అని చెబుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘క్రీచర్-3డీ’ వచ్చేనెల 12న విడుదల కానుంది.