మందారం లాంటి బుగ్గలపై... | Bipasha Basu starrer 'Creature' wraps up shooting | Sakshi
Sakshi News home page

మందారం లాంటి బుగ్గలపై...

Published Mon, Sep 1 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

మందారం లాంటి బుగ్గలపై...

మందారం లాంటి బుగ్గలపై...

ఆ రోజు ఎప్పటిలానే బిపాసా బసు షూటింగ్‌కి రెడీ అయ్యారు. ఆ రోజు షూటింగ్ ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తూ, లొకేషన్లోకి అడుగుపెట్టారు. ఎందుకంటే, ఆ రోజు ఆమె పాల్గొనగా క్లిష్టమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి విక్రమ్ భట్ ప్లాన్ చేశారు. ఆయన దర్శకత్వంలో బిపాసా నటించిన చిత్రం ‘క్రియేచర్ త్రీడీ’. ఇదంతా ఊటీ షూటింగ్ ముచ్చట్లు. అక్కడే భారీ పోరాట దృశ్యాలు చిత్రీకరించినప్పుడు బిపాసాకు చాలా దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా బుగ్గ మీద బాగా గీరుకుపోయిందట.
 
  ఆ రోజు ఎలాగో షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్నారు ఈ బ్యూటీ. ఆ మర్నాడు ఆమెకు సంబంధించిన క్లోజప్ షాట్స్ తీయాలనుకున్నారట విక్రమ్‌భట్. కానీ, ఆమె మందారం లాంటి బుగ్గలపై ఉన్న గీట్లు కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో మునుపటికన్నా మేకప్ డోస్ పెంచారు బిపాసా. దాంతో ఒక్కసారిగా చర్మం మండిందట. ఈ విషయం గురించి బిపాసా చెబుతూ -‘‘ఫైట్స్ సీన్స్ చేయడానికి నేనెప్పుడూ వెనకాడలేదు. దెబ్బలు తగిలినా ఖాతరు చేయలేదు. సినిమా కోసం నా శరీరాన్ని ఏ స్థాయిలో అయినా కష్టపెట్టడానికి నేను రెడీ’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement