నేనూ నా దెయ్యాలు!
పుస్తకోత్సాహం
ఎన్నో ప్రసిద్ధ నవలలు సినిమాలుగా వచ్చి హిట్ సాధించాయి. ‘సినిమాలను నవలలుగా మలిస్తే ఆ నవలలు ఎందుకు హిట్ అవ్వవు?’ అనుకున్నాడో ఏమో బాలీవుడ్ డెరైక్టర్ విక్రమ్‌భట్ తన రాబోవు చిత్రం ‘కామోషియన్’తో సహా గత చిత్రాలు ‘1920’ ‘1920-ఈవిల్ రిటర్న్స్’ చిత్రాలను నవలుగా మలుస్తున్నారు. ఈ నవలలలో గతంలో ఎవరూ చూడని ఫోటోలు, గతంలో ఎవరికీ చెప్పని విషయాలను ఇస్తున్నారు. ‘‘యువ పాఠకుల నుంచి నా పుస్తకాలకు ఆదరణ లభిస్తుంది అని ఆశిస్తున్నాను’’ అన్నారు విక్రమ్.
‘‘ఇలా పుస్తకాలను అచ్చేయడం నాకు బొత్తిగా కొత్త’’ అంటున్నారు ఆయన. సినిమాలను నవలలుగా చదువుకోవడం కూడా ఈ తరానికి ఎంతో కొంత కొత్తే కదా! ఇది సరేగానీ, హారర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వారు, ఆ ట్రాన్స్‌లో కొన్ని చిత్ర విచిత్రమైన మానసిక భ్రమలకు గురవుతుంటారు. అలాంటి విషయాలను అడపాదడపా ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. తనకు ఎదురైన హారర్ అనుభవాలను విక్రమ్‌భట్ ఒక పుస్తకంగా రాసి ‘నేనూ నా దెయ్యాలు’ అని పేరు పెడితే... అట్టి పుస్తకం హాట్ హాట్‌గా అమ్ముడవుతుంది అనడంలో అణుమాత్రం సందేహం లేదు!