టైటిల్: ఇమ్మాక్యూలేట్
దర్శకత్వం: మైఖేల్ మోహన్
లీడ్ రోల్: సిడ్నీ స్వీని
నిడివి: 90 నిమిషాలు
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ: మార్చి 22, 2024
ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లోనూ ఇటీవల ఆ జోనర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్‌లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.
గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ మొత్తం నన్‌ల చుట్టు తిరుగుతుంది. నన్‌గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్‌కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.
నన్ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించారు. అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్‌లను ట్రీట్ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేస్తాయి. ఒక నన్ జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. హారర్ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ లేకుండానే తెరకెక్కించాడు.
ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment