Ameesha Patel Reveals Her Relationship With Vikram Bhatt - Sakshi
Sakshi News home page

Ameesha Patel Relationship: ఆయనతో డేటింగ్‌.. నా జీవితమే నాశనమైంది: టాప్‌ హీరోయిన్‌

Published Tue, Jul 4 2023 1:50 PM | Last Updated on Tue, Jul 4 2023 2:33 PM

Ameesha Patel Reveals Her Relationship With Vikram Bhatt - Sakshi

సన్నీ డియోల్, అమీషా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. ‘గదర్‌ 2’. 1971లో ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీషా పటేల్‌ టాలీవుడ్‌కి కూడా సుపరిచితమే. మహేష్‌ బాబు,ఎన్టీఆర్‌,బాలకృష్ణ , పవన్‌ వంటి స్టార్‌ హీరోలతో మెప్పించింది ఈ బ్యూటీ. బాలీవుడ్‌ నిర్మాత,డైరెక్టర్‌ విక్రమ్ భట్‌తో తన రిలేషన్‌షిప్‌ గురించి గతంలో బహిరంగంగా మాట్లాడటం వల్ల తన కెరీర్‌ ఎలా దెబ్బతిందో తాజాగా తెలిపింది.  

(ఇదీ చదవండి: కిచ్చా సుదీప్‌ చేసిన మోసాన్ని బయటపెట్టిన నిర్మాత)

తనతో రిలేషన్‌షిప్‌ వల్ల కెరీర్‌ నాశనం అయిందని చెప్పింది. దాని వల్ల ఒక దశాబ్దానికి పైగా పురుషులకు దూరంగానే ఉంటూ వస్తున్నానని ఆమె చెప్పింది. అమీషా,విక్రమ్ విడిపోవడానికి ముందు చాలా సంవత్సరాలు డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

విక్రమ్‌తో అమీషా పటేల్ సంబంధం
బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌తో ప్రేమాయణం నడిపాడు విక్రమ్‌. ఆమెతో విడిపోయిన వెంటనే అమీషా పటేల్‌తో  డేటింగ్ ప్రారంభించాడు. వారిద్దరూ Ankahee (2006)లో వచ్చిన సినిమా సమయంలో డేటింగ్ ప్రారంభించారు. కానీ తదుపరి చిత్రం 1920 (2008) విడుదలకు ముందే వారు విడిపోయినట్లు సమాచారం.

అమీషా కెరీర్‌పై ప్రభావం
విక్రమ్‌తో ఉన్న సంబంధం వల్ల తన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో  అమీషా ఇలా తెలిపింది. 'ఈ పరిశ్రమలో, నిజాయితీకి విలువ లేదు.  నేను చాలా నిజాయితీగానే ఉన్నాను. కానీ నేను ఎవరినైతే హృదయానికి దగ్గరకు చేర్చుకున్నానో అదే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అయింది. ఒకరకంగా అలాంటి గుణం ఉండటం అతిపెద్ద లోపమని కూడా భావిస్తున్నాను.  పబ్లిక్‌గా మరో వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండటం వల్లే  నా కెరీర్‌ దెబ్బతింది. దీని వల్ల 12-13 ఏళ్ల వరకు పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇలాగే ఉన్నాను. దీంతో నా జీవితంలోకి మరో  పురుషుడికి చోటు ఇవ్వలేదు. శాంతి మాత్రమే నాతో ఉంది. నా జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు' అని పేర్కొంది.

(ఇదీ  చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి)

అమీషాపై విక్రమ్
గతంలో అమీషాతో ఉన్న బంధం గురించి విక్రమ్‌ పలు కామెంట్లు చేశాడు. ఆమెను వివాహం చేసుకోవాలని ఎప్పుడూ కోరుకోలేదని ఆయన ఓపెన్‌గానే చెప్పాడు. అమీషా పటేల్ వంటి వారు ఆలోచించకుండా తమ మనసులోని మాటను పబ్లిక్‌గా బయటపెట్టేస్తారు. అలాంటి వారు అపరిపక్వంగానే ఆలోచిస్తారు. కాబట్టి ఆమెలాంటి వారు తమ మనసులోని మాటను బయటపెట్టడానికి భయపడరు అని చెప్పాడు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement