నా కల నెరవేరింది | Avika Gor makes her Bollywood debut with horror film 1920: Horrors of the Heart | Sakshi
Sakshi News home page

నా కల నెరవేరింది

Published Tue, Jun 20 2023 3:11 AM | Last Updated on Tue, Jun 20 2023 3:11 AM

Avika Gor makes her Bollywood debut with horror film 1920: Horrors of the Heart - Sakshi

‘‘నేను హారర్‌ సినిమాలను భయపడుతూ చూస్తాను. ‘రాజుగారి గది 3’ హారర్‌ కామెడీ. కానీ ‘1920’ సినిమా సీరియస్‌ హారర్‌ ఫిల్మ్‌. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి.. చాలా కొత్త అనుభూతి ఇది. ఈ సినిమా తర్వాత మరిన్ని హారర్‌ కథల కోసం దర్శక–నిర్మాతలు నన్ను సంప్రదిస్తారని భావిస్తున్నాను’’ అని హీరోయిన్‌ అవికా గోర్‌ అన్నారు.

ప్రముఖ దర్శక–నిర్మాత మహేష్‌ భట్‌ రచన, సమర్పణలో రూపొందిన చిత్రం ‘1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’. కృష్ణ భట్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవికా గోర్‌ లీడ్‌ రోల్‌లో నటించారు. విక్రమ్‌ భట్‌ ప్రొడక్షన్‌పై రాకేష్‌ జునేజా, శ్వేతాంబరీ భట్, డా.రాజ్‌కిషోర్‌ ఖవ్రే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా అవికా గోర్‌ మాట్లాడుతూ–‘‘మహేష్‌ భట్, విక్రమ్‌ భట్‌లాంటి లెజెండరీ ఫిల్మ్‌ మేకర్స్‌తో పని చేయడం నా కల. ‘1920’ చిత్రంతో అది ఇంత త్వరగా నెరవేరడం నా అదృష్టం. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. మహేష్‌ భట్, విక్రమ్‌ భట్‌ గార్లతో మాట్లాడుతునప్పుడు సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నాగార్జునగారిలో కూడా ఆ క్వాలిటీ చూశాను.

‘1920’ కథ, కాన్సెప్ట్‌ కొత్తగా ఉంటాయి. ఇందులో కేవలం హారర్‌ మాత్రమే కాకుండా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్‌ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమా షూటింగ్‌ నాకు కొత్త అనుభవం ఇచ్చింది. కొత్త టెక్నాలజీ (అన్‌ రియల్‌ ఇంజిన్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌) వాడాం.. దాని కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశాను. నేను నటించిన ‘ఇందు’అనే వెబ్‌ సిరీస్‌ త్వరలోనే వస్తుంది. ఆది సాయికుమార్‌కి జోడీగా నటించనున్న ‘అమరన్‌’ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement