బొద్దుగుమ్మకు భలే చాన్స్..! | Zareen Khan signed for Vikram Bhatt next movie | Sakshi
Sakshi News home page

బొద్దుగుమ్మకు భలే చాన్స్..!

Published Tue, Jun 14 2016 3:13 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

బొద్దుగుమ్మకు భలే చాన్స్..! - Sakshi

బొద్దుగుమ్మకు భలే చాన్స్..!

ముంబై: ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ తీయనున్న హర్రర్ మూవీ '1921'. అయితే ఈ మూవీలో హీరోయిన్ చాన్స్ ఎవరికి వస్తుందనే దానిపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్ అవకాశం బాలీవుడ్ బొద్దుగుమ్మ జరీన్ ఖాన్ ను వరించింది. విక్రమ్ భట్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 2010లో 'వీర్‌' సినిమాతో జరీన్‌ ఖాన్‌ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ అనే విషయం తెలిసిందే. నటనకు అవకాశం ఉన్న మూవీ జరీన్ కు దక్కిందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హర్రర్ మూవీ ప్రాజెక్టుకు జరీన్ ఒప్పుకుని అగ్రిమెంట్ పై సంతకం చేసిందని విక్రమ్ భట్ వెల్లడించారు.

యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొనే పరిణామాలపై మూవీ కథాంశం ఉంటుంది. ఈ మూవీలో జరీన్ కీలకపాత్ర పోషించనుందని, వియన్నా, యార్క్ షైర్, ఇటలీ, స్కాట్లాండ్ దేశాలలో షూటింగ్ స్పాట్స్ కన్ఫామ్ చేసుకున్నామని చెప్పారు. ఫెవరెట్ డైరెక్టర్ లలో ఒకరైన విక్రమ్ భట్ తో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని జరీన్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని, ఈ నవంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పింది. రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్ ఈ మూవీలో భాగస్వామిగా ఉందని, ఇది తనకు ఐదవ మూవీ అని డైరెక్టర్ విక్రమ్ భట్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement