Director Teja Signed Two Projects In Bollywood, Deets Inside - Sakshi
Sakshi News home page

Director Teja: హిందీలో రెండు ప్రాజెక్టులకు సైన్‌ చేసిన డైరెక్టర్‌ తేజ!

Published Sun, Apr 10 2022 11:13 AM | Last Updated on Sun, Apr 10 2022 1:01 PM

Director Teja Signed Two Projects In Bollywood - Sakshi

టాలీవుడ్‌ దర్శకుల్లో తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న డైరెక్టర్లలతో తేజ కూడా ఒకరు. చిత్రం​ సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తిన తేజ తొలి సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ హ్యాట్రిక్‌ హిట్టు సాధించాడు. కానీ కొంతకాలంగా ఆయనకు సాలిడ్‌ హిట్టు మాత్రం దొరకడం లేదు.  గ‌త ప‌దిహేనేళ్ల‌లో ‘నేనే రాజు నేనే మంత్రి’ త‌ప్పితే మ‌రో హిట్టు లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న రానా త‌మ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచ‌యం చేస్తూ ‘అహింస’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తేజ బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సైన్‌ చేసినట్లు సమాచారం. ‘జఖ్మీ’ అనే సినిమాతో పాటు,‘త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కరి’ అనే  వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. టైమ్ ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.హెచ్. స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ సంస్థలు వీటిని నిర్మించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement