
కంగనా రనౌత్
మాట్లాడేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. ఏమంటున్నారు బాస్..! ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే కంగనాకు స్పీచ్‌లో ట్రైనింగా అంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. ఆమె కొత్త మాటలు నేర్చుకుంటున్నది సినిమా కోసం. ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్, అమైరా దస్తూర్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మెంటల్ హై క్యా’. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లండన్‌లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు జరుగుతుంది.
ఇందులో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రొఫెషనల్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారట. మాట్లాడటం చేత కాక కాదు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే.. మంచి మాడ్యులేషన్‌తో మాట్లాడాలి కదా. రియల్ లైఫ్‌లో మాటలతో చెడుగుడు ఆడే కంగనా ఈ సినిమాలో భాష రాని వారికి మాట సాయం చేస్తారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment