
పిచ్చి పిచ్చిగా నటిస్తూ పిక్చర్‌పై అంచనాలను పెంచుతున్నారు కంగనా రనౌత్ అండ్ రాజ్‌కుమార్ రావ్. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మెంటల్ హై క్యా’. ఇందులో కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్, అమైరా దస్తూర్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఏక్తా కపూర్, శోభా కపూర్, శైలేష్ ఆర్. సింగ్ నిర్మిస్తున్నారు.
నెల రోజులుగా లండన్‌లో జరుగుతోన్న ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. ‘లండన్‌లో షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కంగనా, రాజ్ ఇలా పోజ్ ఇచ్చారు’ అని పైన ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు ఏక్తా కపూర్. ‘క్వీన్’ సినిమాలో కలిసి నటించిన కంగనా అండ్ రాజ్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు. ‘మెంటల్ హై క్యా’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment