గుమ్మడికాయ కొట్టేశారు | Kangana Ranaut Poses with the Team,Manikarnika | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టేశారు

Published Fri, Mar 30 2018 1:32 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Kangana Ranaut Poses with the Team,Manikarnika - Sakshi

కంగనా రనౌత్‌

ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు టీమ్‌ అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటారు. లాస్ట్‌డే షూటింగ్‌ అంటే హ్యాపీగా సినిమా పూర్తయినందుకు ఒక్క పక్క ఆనందం, యూనిట్‌ని మిస్‌ అవుతున్నందుకు మరో పక్క బాధ. ప్రస్తుతం ఈ పరిస్థితులనే ఫేస్‌ చేస్తున్నారు ‘మణికర్ణిక’ టీమ్‌. కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌లో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’.

ఈ సినిమా షూటింగ్‌ జోథ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారంతో ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారట. ఆగస్టులో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెంటల్‌ హై క్యా’ చిత్రం కంగనా రనౌత్‌ నెక్ట్స్‌ మూవీ. ఆల్మోస్ట్‌ నాలుగేళ్ల తర్వాత రాజ్‌కుమార్‌ రావ్‌తో కలసి ఈ సినిమాలో నటిస్తున్నారు కంగనా. 2014లో వచ్చిన ‘క్వీన్‌’ మూవీలో కంగనా, రాజ్‌కుమార్‌ రావ్‌ జంటగా నటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement