
ఈ శుక్రవారం రాజుగాడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రాజ్ తరుణ్. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈసినిమా నానుమ్ రౌడీ దాన్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రాజ్ తరుణ్.
కానీ నానుమ్ రౌడీ దాన్ అప్పట్లో నేను రౌడీనే పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన సినిమా రీమేక్‌తో రాజ్ తరుణ్ ఏమేరకు ఆకట్టుకోగలడో చూడాలి. గతంలో కాటమరాయుడు సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. తెలుగులో వీరుడొక్కడేగా రిలీజ్ అయిన వీరం సినిమాను మళ్లీ కాటమరాయుడు పేరుతో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో పోలీస్‌గా రిలీజ్ అయిన తేరి సినిమాను కూడా రవితేజ హీరోగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment