మల్లేశ్వరి బయోపిక్‌ షురూ | Karnam Malleswari biopic announced on her birthday | Sakshi
Sakshi News home page

మల్లేశ్వరి బయోపిక్‌ షురూ

Published Tue, Jun 2 2020 4:10 AM | Last Updated on Tue, Jun 2 2020 4:10 AM

Karnam Malleswari biopic announced on her birthday - Sakshi

ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి బయోపిక్‌ తెరకెక్కనుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించారు మల్లేశ్వరి. ఆమె జీవితం ఆధారంగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి సినిమా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకాలపై ఎం.వి.వి సత్యనారాయణ, కోన వెంకట్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. కరణం మల్లేశ్వరి జన్మ దినం (జూన్‌ 1) సందర్భంగా సోమవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ బయోపిక్‌కు కోన వెంకట్‌ ఒక నిర్మాతగా ఉండటంతో పాటు రచయిత కూడా. ‘‘ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement