weightlifting championship
-
ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు మీరాబాయి దూరం.. కారణం?
Asian Weightlifting Championships: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో తాష్కెంట్లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఆమె దూరం కానుంది. అక్టోబర్‌లో జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల సందర్భంగా మీరాబాయి తుంటికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆమె మరే టోర్నీ బరిలోనూ దిగలేకపోయింది. ఇక ప్రపంచ మాజీ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన మీరాబాయి మార్చిలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. థాయ్‌లాండ్‌లో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో భాగమైన ప్రపంచకప్ టోర్నీతో.. ఆమె పునరాగమనం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వారియర్స్ ఘనవిజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 60–42తో గెలిచింది. వారియర్స్ తరఫున కెపె్టన్ మణీందర్ సింగ్ 15 పాయింట్లు, నితిన్ 14 పాయింట్లు స్కోరు చేశారు. ఈ గెలుపుతో వారియర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్; బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
Asian Weightlifting Championship: భారత్ ఖాతాలో రెండో పతకం, జెరెమికు రజతం
జిన్జూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమి లాల్రినుంగా స్నాచ్ ఈవెంట్లో 141 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. అయితే మిజోరం రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల జెరెమి క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో తడబడి మొత్తం బరువును నమోదు చేయడంలో విఫలమయ్యాడు. మూడు క్లీన్ అండ్ జెర్క్ అవకాశాల్లోనూ జెరెమి నిర్ధారిత బరువును ఎత్తలేకపోయాడు. శనివారం జరిగిన మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి భారత్‌కు రజత పతకం అందించిన సంగతి తెలిసిందే. -
Asian Weightlifting Championships 2023: బింద్యారాణికి రజతం
జింజు (దక్షిణ కొరియా): మహిళల ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన బింద్యారాణి దేవి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన 55 కేజీల విభాగం పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఆమె రజతపతకాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కూడా రజతం నెగ్గిన మణిపూర్ లిఫ్టర్ బింద్యా ఈ పోరులో క్లీన్ అండ్ జర్క్, స్నాచ్లలో కలిపి మొత్తం 194 కేజీల (83 కేజీలు + 111 కేజీ) బరువెత్తింది. చెన్ గ్వాన్ లింగ్ (చైనీస్ తైపీ –204 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా, వో తి క్యూ ను (వియత్నాం – 192 కేజీలు) కాంస్యం గెలుచుకుంది. -
మీరాబాయి చాను విఫలం.. ఆరో స్థానానికి పరిమితం
జింజూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను నిరాశపరిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్ శుక్రవారం జరిగిన 49 కేజీల విభాగంలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మీరాబాయి మొత్తం 194 కేజీలు బరువెత్తింది. ఆమె స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు బరువెత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయి చివరి రెండు ప్రయత్నాల నుంచి వైదొలిగింది. మీరాబాయి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 207 కేజీలుకాగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె 13 కేజీలు తక్కువ ఎత్తింది. జియాంగ్ హుయిహువా (చైనా; 207 కేజీలు) స్వర్ణం... హు జిహుయ్ (చైనా; 204 కేజీలు) రజతం... సెరోద్ చనా (థాయ్‌లాండ్; 200 కేజీలు) కాంస్య పతకం సాధించారు. సౌరవ్ శుభారంభం షికాగో: ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో సౌరవ్ 5–11, 11–6, 11–13, 11–6, 11–3తో యాయా ఎల్నావాస్నీ (ఈజిప్ట్)పై గెలిచాడు. -
మణికట్టు గాయం బాధిస్తున్నా..‘రజతం’తో మెరిసి! మీరాబాయి అరుదైన ఘనత
World Weightlifting Championship- 2022- బొగోటా (కొలంబియా): మణికట్టు గాయం బాధిస్తున్నా... భారత స్టార్ మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వెనక్కి తగ్గలేదు. ప్రయత్నిస్తే పతకం రాకపోదా అని ఆశాభావంతో మొండి పట్టుదలగా బరిలోకి దిగిన ఈ మణిపూర్ తార అనుకున్నది సాధించింది. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. 28 ఏళ్ల మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీలు కలిపి మొత్తం 200 కేజీలు బరువెత్తింది. జియాంగ్ హుయ్‌హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించగా... జిహువా (చైనా; 198 కేజీలు) కాంస్యం దక్కించుకుంది. రెండో పతకం ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మీరాబాయికిది రెండో పతకం. 2017లో ఆమె 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ‘మణికట్టు గాయం వేధిస్తున్నా దేశానికి పతకం అందించాలనే పట్టుదలతో ప్రయత్నించి సఫలమయ్యాను. వచ్చే ఏడాది ఆసియా క్రీడల్లో, ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తా’ అని మీరాబాయి తెలిపింది. మీరాబాయి అరుదైన ఘనత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన నాలుగో భారత మహిళా లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది. గతంలో కుంజరాణి దేవి (7 రజత పతకాలు), కరణం మల్లీశ్వరి (2 స్వర్ణాలు, 2 కాంస్యాలు), నీలంశెట్టి లక్ష్మీ (1 రజతం, 1 కాంస్యం) ఈ ఘనత సాధించారు. ఈ నేపథ్యంలో మీరాబాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు View this post on Instagram A post shared by Vijay Sharma (@sharma1970vijay) Despite her wrist injury, she still won a silver medal at the WC with a total lift of 200kg Congratulations @mirabai_chanu on winning silver in women's 49kg at the WWC. She beats Olympic champ Hou Zhihua 198kg from China. 2017 WC🥇 2020 Olympics🥈 2022 WC🥈 Proud of you 👍 pic.twitter.com/cK8hq1W0Go — Anurag Thakur (@ianuragthakur) December 7, 2022 -
వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు కంఠెవరం బాలిక
సాక్షి, తెనాలి: అనతికాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకుని అందరి ప్రశంసలూ అందుకుంటుంది కంఠెవరం బాలిక నాగం జ్ఞాన దివ్య. త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ మెరవనుంది. ఫిట్నెస్ కోసమని సాధన ప్రారంభించిన ఏడాదిలోనే టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరగనున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ విభాగంలో సత్తా చాటనుంది. కుటుంబ నేపథ్యం ఇదీ.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరంలోని కేబుల్ ఆఫీసులో పనిచేసే నాగం వెంకటేశ్వరరావు, సుధారాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పూజిత బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. రెండో కుమార్తె జ్ఞానదివ్య గత మార్చిలో ఇంటర్ పూర్తిచేసింది. దివ్య ఫిట్నెస్ కోసమని గ్రామంలోని మాతృశ్రీ వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీలో ఏడాది కిందట చేరింది. నిత్యం సాధన చేసింది. ఆమె ఆసక్తిని గమనించిన ఫవర్ లిఫ్టర్ కొల్లిపర నాగశిరీష దివ్యను ప్రోత్సహించారు. పవర్‌లిఫ్టింగ్‌లో మెళకువలు నేర్పారు. నందివెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నాగశిరీష పవర్‌లిఫ్టింగ్‌లో నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్. తనలాగే జ్ఞాన దివ్య కూడా జాతీయస్థాయిలో సత్తా చాటాలనే ఉద్దేశంతో చక్కని తర్ఫీదునిచ్చారు. నాగశిరీష, ఆళ్ల వెంకటరెడ్డి, సోమిశెట్టి కోటేశ్వరరావు, సుభాన్‌వలి తదితర లిఫ్టర్ల సలహాలతో దివ్య అనేక పతకాలు సాధించింది. దివ్య విజయాలు ఇవీ.. ► 2021 నవంబరు 21, 22 తేదీల్లో జగ్గయ్యపేటలో జరిగిన స్టేట్‌మీట్ క్లాసిక్ కేటగిరీలో బంగారు పతకం. ► కేరళలోని అలప్పుజలో జరిగిన జాతీయస్థాయి 84 ప్లస్ కేటగిరీలో బంగారు పతకం. ► అనకాపల్లిలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో ఎక్విప్డ్ విభాగంలో రజతం. ► మంగళగిరిలో గత జూన్ 9న జరిగిన స్టేట్‌మీట్ ఎక్విప్డ్‌లో 84 ప్లస్ విభాగం స్క్వాడ్‌లో 187.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 160 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 55 కిలోల బరువులనెత్తి బంగారు పతకాలు కైవసం. ► హైదరాబాద్‌లో ఈనెల 5న జరిగిన నేషనల్ సెలక్షన్స్‌లో స్క్వాడ్‌లో బంగారు, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో రజత పతకాలు. ► ఈనెల 16న విశాఖపట్టణంలో జరిగిన 9వ రాష్ట్రస్థాయి క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం. ► ఆగస్టు 12, 13, 14 తేదీల్లో కేరళలో జరగనున్న నేషనల్స్‌కు అర్హత. ► ఆగస్టు ఆఖరు నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక. (క్లిక్: సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!) -
యూత్ వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్షదకు స్వర్ణం
తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన హర్షద గరుడ్ బంగారు పతకం సాధించింది. మహిళల 45 కేజీల కేటగిరీలో 18 ఏళ్ల భారత లిఫ్టర్ 157 కేజీల (స్నాచ్‌లో 69+ క్లీన్ అండ్ జెర్క్‌లో 88) బరువెత్తి విజేతగా నిలిచింది. మరో భారత లిఫ్టర్ సౌమ్య దాల్వి 145 కేజీల (63+82)తో కాంస్యం గెలుచుకుంది. పురుషుల 49కేజీల యూత్ ఈవెంట్లో ధనుశ్ (స్నాచ్‌లో 85 కేజీలు) కాంస్యం గెలిచాడు. చదవండి: Babar Azam: కోహ్లిని తలపిస్తున్న పాక్ కెప్టెన్.. ఖాతాలో మరో మైలురాయి Harshada Garud (45kg) #TOPSAthlete won 🥇 with a total lift of 157 kg (Snatch 69kg and Clean & Jerk 88kg) in 2022 Asian Youth and Junior #Weightlifting championship at Tashkent, Uzbekistan 🏋️♀️ Many congratulations and Keep it Up🤩 💯#IndianSports pic.twitter.com/HYah6lyPdB — SAI Media (@Media_SAI) July 18, 2022 -
స్వర్ణంతో కామన్వెల్త్ గేమ్స్‌కు మీరాబాయి చాను అర్హత
సింగపూర్: భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (55 కేజీలు) సింగపూర్ అంతర్జాతీయ టోర్నీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 105) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్హమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు సింగపూర్ టోర్నీకి క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మీరాబాయి స్వర్ణపతక ప్రదర్శనతో కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. భారత్‌కే చెందిన సంకేత్ సాగర్ (పురుషుల 55 కేజీలు–స్వర్ణం), రిషికాంత సింగ్ (55 కేజీలు–రజతం), బింద్యారాణి దేవి (మహిళల 59 కేజీలు–స్వర్ణం) కూడా కామన్వెల్త్ గేమ్స్ బెర్త్‌లను సాధించారు. -
మీరాబాయి ప్రపంచ రికార్డు
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను (49 కేజీలు) రెండు పతకాలను సొంతం చేసుకుంది. శనివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో మీరాబాయి క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో స్వర్ణం... ఓవరాల్‌గా కాంస్య పతకం సాధించింది. క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో మీరాబాయి 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 118 కేజీలతో హుయ్‌హువా జియాంగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మీరాబాయి బద్దలు కొట్టింది. స్నాచ్‌లో మీరాబాయి 86 కేజీలు బరువెత్తి ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా మీరాబాయి (86+119) 205 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 213 కేజీలతో (స్నాచ్‌లో 96+క్లీన్ అండ్ జెర్క్‌లో 117) జిహుయ్ హౌ (చైనా) స్వర్ణం... 207 కేజీలతో (స్నాచ్‌లో 89+క్లీన్ అండ్ జెర్క్‌లో 118) హుయ్‌హువా జియాంగ్ రజతం సాధించారు. ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా ఒక పతకం ఇవ్వకుండా... స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, టోటల్ విభాగాలకు వేర్వేరు పతకాలు అందజేస్తున్నారు. -
అధిక బరువెత్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
-
అధిక బరువెత్తి ప్రాణం మీదకు..
మాస్కో : వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఓ రష్యన్ పవర్ లిఫ్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వందలు, మూడు వందలు కాదు.. ఏకంగా 400 కిలోల బరువెత్తే ప్రయత్నంలో విఫలమై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మాస్కోలో వేదికగా జరిగిన ఈ వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ సెడిఖ్ స్క్వాట్‌లో అంత భారీ మొత్తాన్ని కాళ్లు వణుకుతుండగా అతికష్టమ్మీద భుజాల వరకు ఎత్తాడు. ఆపై బరువును తట్టుకోలేక కుప్పకూలాడు. అదృష్టవశాత్తు బారెల్ వెనక్కి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో సెడిఖ్ రెండు మోకాళ్లతో పాటు తొడ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు దాదాపు 6 గంటల పాటు శ్రమించి విరిగిపోయిన రెండు కాళ్ల ఎముకలను, కండరాలను ఆపరేషన్ చేసి అతికించారు. ఈ ప్రమాదంతో అలెగ్జాండర్ రెండు నెలలపాటు మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యాలో 2019లో వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల రడోస్కేవిచ్ మూడో ప్రయత్నంలో 250 కేజీల బరువెత్తబోయి గాయపడి కెరీర్‌కు స్వస్తిపలకాల్సి వచ్చింది. -
‘రజత’ పావని
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కె.వి.ఎల్. పావని కుమారి రెండు రజత పతకాలు సాధించింది. 45 కేజీల విభాగంలో పోటీపడిన విశాఖపట్నం జిల్లా లిఫ్టర్ పావని యూత్, జూనియర్ కేటగిరీల్లో మొత్తం 145 కేజీలు (స్నాచ్‌లో 66+క్లీన్ అండ్ జెర్క్‌లో 79) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం పావని హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్‌ఎస్)లో కోచ్ మాణిక్యాల రావు వద్ద శిక్షణ తీసుకుంటోంది. 45 కేజీల విభాగంలోనే భారత్‌కే చెందిన హర్షద గరుడ్ యూత్, జూనియర్ కేటగిరీల్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. హర్షద మొత్తం (స్నాచ్‌లో 62+క్లీన్ అండ్ జెర్క్‌లో 77) 139 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం 20 దేశాల నుంచి 197 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. -
మీరాబాయికి నాలుగో స్థానం
పట్టాయా (థాయ్‌లాండ్): మాజీ చాంపియన్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పతకానికి దూరమైంది. మహిళల 49 కేజీల ఈవెంట్లో గురువారం పోటీపడిన ఆమె 201 కేజీల బరువెత్తింది. వ్యక్తిగతంగా ఇది అత్యుత్తమ ప్రదర్శనే కానీ పతకాన్ని మాత్రం తెచి్చపెట్టలేకపోయింది. ఈ ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 25 ఏళ్ల మీర స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు, మొత్తం కలిపి 199 కేజీల బరువెత్తింది. ఇక్కడ 87 కేజీలు+114 కేజీలు కలిపి మొత్తంగా 201 కేజీలు ఎత్తినా నాలుగో స్థానంతోనే తృప్తిపడింది. చైనా లిఫ్టర్ జియాంగ్ హుయిహువా 212 (94+118) కేజీలతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తమ దేశానికే చెందిన హౌ జిహుయి (210 కేజీలు) రికార్డును చెరిపేసింది. హౌ జిహుయి 211 (94+117) కేజీల బరువెత్తి రజతం నెగ్గగా, నార్త్ కొరియా లిఫ్టర్ రి సంగ్ గమ్ 204 (89+115) కేజీలతో కాంస్యం గెలుచుకుంది. -
బరువు నా బాధ్యత
సామాన్య కుటుంబంలో జననం... అసామాన్య రీతిలో గమనం. సాధారణ పల్లెలో సాధన.. అసాధారణ స్థాయిలో పతకాల సాధన. సిక్కోలు ఆశా కిరణం గార లలితారాణి గమ్యం వైపు దూసుకువెళ్తోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉత్తరాంధ్రకు ఉన్న గొప్ప పేరును కాపాడుతూనే.. చరిత్ర పుటల్లో తన పేరునూ లిఖించేలా రాణిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ద్వితీయస్థానం సాధించి ప్రతిభ చాటింది. కామన్వెల్త్లో రాణిస్తానని నమ్మకంగా చెబుతోంది ఈ పాలకొండ యువతి. పతకం సాధించి తిరిగి వచ్చిన లలితారాణికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ఇలా మాట కలిపారు.– పాలకొండ రూరల్ సాక్షి: జాతీయ స్థాయి పతకం సాధించడం ఎలాంటి అనుభూతి నిచ్చింది..? రాణి: ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు తిరుపతిరావు, చిన్నమ్మడుల ప్రోత్సాహం, కుటుంబసభ్యుల సహకారంతో చిన్నతనం నుండి క్రీడలపై ఆసక్తి కనబర్చాను. తొలి రోజుల్లో ఆడపిల్లలకు బరువులెత్తే ఆటలేంటని ప్రశ్నించిన వారే ఇప్పుడు శభాష్ అంటున్నారు. కుటుంబసభ్యులు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రతిభ కారణంగా ఇతర దేశాల్లో జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలకు కూడా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సాక్షి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రయాణం ఎలా సాగింది? రాణి: గత ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించిన జూనియర్ నేషనల్స్‌లో దేశస్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారిణులు ప్రతిభ కనబర్చారు. నాతో సహా 17 మంది ఈ పోటీల్లో తలపడ్డారు. అందులో రాణించిన వారిని ఖేలో ఇం డియా యూత్ గేమ్స్‌కు పంపించారు. అప్పటి నుంచే కఠోరంగా శ్రమించాను. సాక్షి: జూనియర్ నేషనల్స్ ఎలా ఉపయోగపడింది? రాణి: విశాఖ జూనియర్ నేషనల్స్‌లో నేను పడిన కష్టం వృధా పోలేదు. నాకు బంగారు పతకంతోపాటు మంచి పేరు, దేశస్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం కలిగింది. సాక్షి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలు ఎలా సాగాయి..? రాణి: ఈ ఏడాది జనవరి 9 నుంచి 15 వరకు మహరాష్ట్ర పూణేలో నిర్వహించిన ఈ క్రీడలకు దేశస్థాయిలో ప్రతిభ గల 21 మంది వెయిట్‌లిఫ్టర్స్‌తో పోటీల్లో తలపడ్డాను. వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారిణులు, వారి శిక్షకులు అనుసరించే విధానాలను దగ్గరగా చూశాను. వారు శ్రమిస్తున్న తీరు నాలో మరింత శక్తి, ఆసక్తి నింపింది. సాక్షి: బంగారు పతకం చేజార్చుకున్నానన్న బాధ ఉందా..? రాణి: నాతోపాటు ఈ క్రీడల్లో పోటీ పడిన వారు అందరూ చివరి వరకు తమ ప్రతిభను కనబరిచారు. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగా లేదు. జ్వరంతో బాధపడుతున్నా. కేవలం ఒక్క అడుగు దూరంలో బంగారు పథకం దూరమైంది. ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయా. మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణికి పథకం వచ్చింది. సాక్షి: 2018 ఎలాంటి జ్ఞాపకాలు మిగిల్చింది..? రాణి: 2018 నాకు ఎంతో కలిసి వచ్చిన ఏడాది. ఈ ఏడాదిలో మూడు బం గారు పథకాలతోపాటు బెస్ట్ లిఫ్టర్‌గా గుర్తింపు లభించింది. ఆల్ ఇండియా స్థాయిలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ క్రీడల్లో, నాగపూర్‌లో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో, గుంటూరులో జరిగిన సీఎం కప్‌లో బంగారు పథకాలు సాధించా. సాక్షి: మీ విజయాల్లో ఎవరి సహకారం ఉంది? రాణి: నా తొలి గురువు నా తండ్రి తిరుపతిరావు. అటుపై నా శిక్షకులు ఎస్ఏ.సింగ్, పి.మాణిక్యాలరావు, ఎం.రామకృష్ణలు ఎంతగానో ప్రోత్సహించి శిక్షణ అందించారు. ప్రస్తుతం నాకు కాకినాడకు చెందిన ఎన్సీ.మోహన్ శిక్షణ అందిస్తున్నారు. అలాగే మా బావగారు రామకృష్ణ సహకారం మరిచిపోలేనిది. సాక్షి: మీ భవిష్యత్ లక్ష్యాలు..? రాణి: నా కుటుంబంలో నాతోపాటు మా అక్కలు అరుణరాణి, ఉషారాణిలుకూడా వెయిట్‌లిఫ్టర్లు కావటంతో వారి సహకారం ఉంది. ఉన్నత చదువులతోపాటు రానున్న కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటాలనేది నా లక్ష్యం. నా తల్లిదండ్రులు నాపై ఉంచిన నమ్మకం వృధా కానివ్వను. సాక్షి: ప్రస్తుతం క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది? రాణి: సౌకర్యాలు లేకున్నా కష్టపడి లక్ష్య సాధనవైపు దూసుకువేళ్లే క్రీడాకారులకు జిల్లాలో కొదువ లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. ముఖ్యం గా క్రీడాకారులకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిలో నేను కూడా ఉన్నా. మధ్య తరగతి కుటుంబం మాది. అధికారుల సహకారం అవసరముంది. సాక్షి: నేటితరం క్రీడాకారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాణి: ఆసక్తి ఉన్న క్రీడాకారులు ముందుకురావాలి. నిరుత్సాహం విడనాడాలి. వారికి కుటుంబ సభ్యులతోపాటు అందరూ సహకరించాలి. నచ్చిన రంగంలో ఉన్నత స్థానం దక్కించుకునేందుకు నిరంతరం కృషి చేయాలి. -
తెలంగాణ లిఫ్టర్లకు 4 పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్‌గేమ్స్ అండర్–19 వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో స్వర్ణం, రజతం, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 4 పతకాలను సాధించింది. బాలుర 69 కేజీల విభాగంలో ఆర్ఎస్ఎల్ సాయి (తెలంగాణ) చాంపియన్‌గా నిలిచాడు. అతను ఫైనల్లో 235 కేజీలు (102 స్నాచ్+133 క్లీన్ అండ్ జర్క్) బరువునెత్తి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. 62 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బి. కృష్ణ (222 కేజీలు) రజతాన్ని, ఏవీ యశ్వంత్ (తెలంగాణ, 205 కేజీలు) కాంస్యాన్ని సాధించారు. 77 కేజీల విభాగంలో ఎంహెచ్ నిహాల్ రాజ్ (తెలంగాణ, 256 కేజీలు), ఎ.శివరామకృష్ణ (ఆంధ్రప్రదేశ్, 254 కేజీలు) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించగా... బాలికల 63 కేజీల విభాగంలో వేముల సాహితి (123 కేజీలు) కాంస్యాన్ని దక్కించుకుంది. -
48 కేజీల బంగారం
సరిగ్గా 22 ఏళ్ల క్రితం తెలుగు తేజం కరణం మల్లేశ్వరి ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. రెండు దశాబ్దాలు దాటినా ఆ స్థాయి ప్రదర్శన ఇంకెవరూ కనబర్చలేకపోయారు. తాజాగా మీరాబాయి చాను ఆ లోటు తీర్చింది. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో రెండు బంగారు పతకాలు సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచ స్ధాయిలో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. న్యూఢిల్లీ: భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సయిఖోమ్ మీరాబాయి చాను జాతి గర్వించే విజయాన్ని సాధించింది. అమెరికాలోని అనహెమ్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలతో చరిత్ర సృష్టించింది. 48 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఈ మణిపూర్ లిఫ్టర్ మొత్తం 194 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఆమె స్నాచ్‌లో 85 కేజీల బరువెత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలతో మరో స్వర్ణం గెలిచింది. ఈ క్రమంలో మీరా కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన మల్లేశ్వరి 1994, 1995 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌ల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెలిచింది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత మీరాబాయి భారత వెయిట్‌లిఫ్టింగ్‌ను పసిడి పతకంతో మురిపించింది. ఈ ఈవెంట్లో 193 కేజీల బరువెత్తిన సుక్చరొన్ తున్యా (థాయ్‌లాండ్) రజతం గెలుపొందగా, సెగురా అనా (182 కేజీలు; ఐర్లాండ్) కాంస్య పతకం దక్కించుకుంది. డోపింగ్ మరకలతో రష్యా, చైనా, కజకిస్తాన్, ఉక్రెయిన్, అజర్‌బైజాన్‌లకు చెందిన మేటి లిఫ్టర్లు ఇందులో పాల్గొనే అవకాశం కోల్పోయారు. డీఎన్‌ఎఫ్ నుంచి స్వర్ణం దాకా... గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ (2014)లో రజతం నెగ్గిన 23 ఏళ్ల మీరాబాయి చాను... ఇక ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా సాధన చేసింది. మొత్తానికి గతేడాది రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించి.. కోటి ఆశలతో బరిలోకి దిగింది. కానీ పోటీ ముగిశాక చూస్తే...ఆమె పేరుపక్కన బ్రాకెట్లలో కేజీలు ఉండాల్సిన చోట డీఎన్‌ఎఫ్ (డిడ్ నాట్ ఫినిష్–పోటీ పూర్తి చేయలేదు) అనే ముద్రపడింది. రియోలో 12 మంది బరిలోకి దిగగా ఆమె తన మూడు ప్రయత్నాల్లో ఒక్కసారైన బరువెత్తలేక చతికిలబడింది. 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11వ స్థానంలో నిలిచిన చాను... ఆ మరుసటి ఏడాది జరిగిన మెగాఈవెంట్లో తొమ్మిదో స్థానంతో టాప్–10లో నిలిచింది. రెండేళ్లు తిరిగేసరికి ఇప్పుడు రెండు బంగారు పతకాలను చేజిక్కించుకుంది. ప్రశంసల వర్షం ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో చాంపియన్‌గా నిలిచిన మణిపూర్ లిఫ్టర్ మీరాబాయిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘స్వర్ణం గెలిచిన మీరాబాయికి అభినందనలు. యావత్ భారతం మీ ప్రదర్శన చూసి గర్వపడు తోంది. మరో చాంపియన్‌ను అందించిన మణిపూర్ రాష్ట్రానికి శుభాకాంక్షలు’ – రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి ‘చాను... నిన్ను చూసి జాతి గర్విస్తోంది. మీ స్వర్ణసాకారానికి అభినందనలు. భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ – నరేంద్ర మోదీ, ప్రధాని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మహిళా చాంపియన్ బాక్సర్ మేరీకోమ్, ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ తదితరులు మీరా ఘనతను కొనియాడారు. నా కోచే లేకుంటే ఈ ప్రదర్శనే లేదు. స్వర్ణం లేదు. కోచ్ విజయ్ శర్మ నన్ను అనుక్షణం ముందుండి నడిపించారు. వెన్నంటి ప్రోత్సహించారు. రియోలో తీవ్ర నిరాశకు గురయ్యా. ఏడాదికాలంగా వేధిస్తున్న చేదు అనుభవం ఈ స్వర్ణంతో కనుమరుగైంది. ఇక్కడితో ఆగిపోను. నా బలహీనతలను అధిగమించేందుకే అధిక ప్రాధాన్యమిస్తా. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించేందుకు కృషి చేస్తా. – మీరాబాయి చాను -
22 ఏళ్ల తర్వాత రెండో భారత క్రీడాకారిణిగా..
కాలిఫోర్నియా: వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో భారత్‌కు స్వర్ణం లభించింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిష్‌లో భారత్‌కు చెందిన మీరాబాయ్ చాను స్వర్ణ పతకం సాధించారు. 48 కేజీల విభాగంలో పాల్గొన్న చాను మొత్తం 194 కేజీలు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నారు. స్నాచ్ లో 85 కేజీల ఎత్తిన మీరాబాయ్.. క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు ఎత్తి సరికొత్త రికార్డుతో పసిడిని కైవసం చేసుకున్నారు. ఫలితంగా 22 ఏళ్ల తరువాత ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణిగా చాను గుర్తింపు సాధించింది. 1995లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో కరణం మల్లీశ్వరి తొలిసారి స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంత కాలానికి చాను మళ్లీ పసిడిని ఒడిసి పట్టుకుని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఈ సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో స్వర్ణ పతకం గెలిచిన చాను వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు. -
మత్స సంతోషికి స్వర్ణం
జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ మత్స సంతోషి స్వర్ణ పతకాన్ని సాధించింది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో సంతోషి మహిళల 53 కేజీల విభాగంలో 186 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచింది. పురుషుల 56 కేజీల విభాగంలో కోరాడ రమణ 237 కేజీలు బరువెత్తి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. అంతర్ రాష్ట్ర విభాగంలో తెలంగాణ లిఫ్టర్ వై.శివ కుమార్ 56 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని నెగ్గాడు -
21 మంది లిఫ్టర్లపై వేటు
న్యూఢిల్లీ : డోపింగ్ పరీక్షలో విఫలమైన 21 మంది భారత వెయిట్‌లిఫ్టర్లపై తాత్కాలికంగా సస్పెన్షన్ విధించారు. జనవరిలో జరిగిన జాతీయ యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఎక్కువ మంది దొరికినట్టు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య తెలిపింది. ‘21 మంది లిఫ్టర్లు డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. వారి ‘బి’ శాంపిల్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఘటనగా చెబుతున్నా యూనివర్శిటీ, పోలీస్ గేమ్స్, రైల్వేస్ ఇలాంటి పోటీల్లోనూ కొందరు పట్టుబడిన విషయం గుర్తుంచుకోవాలి. సదరు ఆటగాళ్ల ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలితే తొలిసారి శిక్ష కింద నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఐడబ్ల్యుఎఫ్ ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్ తెలిపారు. ఆటగాళ్ల కోచ్‌లపై కూడా నిషేధంతో పాటు జరిమానా విధించారు. -
‘బంగారు’ ఉష
జాతీయ సీ॥వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణాలు జైపూర్: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయనగరం జిల్లా లిఫ్టర్లు బంగారు ఉష, గౌరిబాబు రాణించారు. ఉష రెండు స్వర్ణ పతకాల్ని సొంతం చేసుకోగా, గౌరి బాబు కాంస్యం దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన 48 కేజీల విభాగంలో ఉష స్నాచ్‌లో 73 కేజీలు ఎత్తి రజతం సంపాదించగా... క్లీన్ అండ్ జెర్క్‌లో (96 కేజీలు), ఓవరాల్ (169 కేజీలు) విభాగాల్లో ఉషకు పసిడి పతకాలు లభించాయి. పురుషుల 62 కేజీల విభాగంలో కె.గౌరిబాబు ఓవరాల్‌గా 253 కేజీల బరువెత్తి కాంస్య పతకం సాధించాడు. -
చాంప్ భవాన్స్ కాలేజి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సైనిక్‌పురికి చెందిన భవాన్స్ కాలేజి జట్టు చేజిక్కించుకుంది. ఏవీ కాలేజి జట్టుకు రెండో స్థానం లభించగా... నిజామ్ కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఈ పోటీలు జరిగాయి. ఫైనల్స్ ఫలితాలు: 56 కేజీలు : 1. ఎం. సంపత్‌కుమార్, (వివి కాలేజి) 62 కేజీలు: 1.జి.వెంకటేశ్ (ఏవీ కాలేజి), 2.ఆదిత్య యాదవ్ (భవాన్స్ కాలేజి), 3.డి.ఆదిత్య యాదవ్ (లయోలా అకాడమీ). 69 కేజీలు: 1.జి.సందీప్ (నిజామ్ కాలేజి), 2.ఎ.అనిల్ రెడ్డి (భవాన్స్ కాలేజి), 3.ప్రదీప్ మణి (సిగ్నోడియా కాలేజి). 77 కేజీలు: 1.వై.ఆర్. సాగర్ (జి.పుల్లారెడ్డి కాలేజి), 2.ఎం.డి.రహ్మత్ (భవాన్స్ కాలేజి), 3.అరుణ్ లాల్ (వి.వి. కాలేజి). 85 కేజీలు: 1.ప్రమోద్ (ఏవీ కాలేజి), 2. ఎం.డి.అబ్దుల్లా (భవాన్స్ కాలేజి), 3.డి.కార్తిక్ రాజ్ (పీజీ కాలేజి, సికింద్రాబాద్). 94 కేజీలు: 1.టి.నవీన్ కుమార్ (నిజామ్ కాలేజి), 2.ఎం.హరీష్ (ఏవీ కాలేజి), 3.డి.నితిన్ (సుప్రభాత్ కాలేజి). 105 కేజీలు: 1.ఎం.ఆర్.చైతన్య (భవాన్స్ కాలేజి), 2.ఆర్.గణేష్ యాదవ్ (సుప్రభాత్ కాలేజి), 3.అజయ్ సింగ్ (భవాన్స్ కాలేజి). 105+ కేజీలు: 1. ఆర్. దర్శన్ (సుప్రభాత్ కాలేజి). -
రాహుల్‌కు 3 స్వర్ణాలు
గువహటి: జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు ఆరు పతకాలు లభించాయి. రాగాల వెంకట రాహుల్ 3 స్వర్ణాలు సాధించగా... ఊహాసాయి ఒక రజత పతకం, 2 కాంస్యాలు సొంతం చేసుకుంది. బాలుర 77 కేజీల విభాగంలో రాహుల్ స్నాచ్‌లో 135 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 152 కిలోల బరువు ఎత్తి 2 స్వర్ణాలు గెలిచాడు. ఓవరాల్‌గా 287 కేజీల బరువుతో మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాలికల 69 కేజీల విభాగంలో స్నాచ్‌లో ఊహకు కాంస్యం...క్లీన్ అండ్ జర్క్‌లో రజతం దక్కింది. ఓవరాల్‌గా 141 కిలోల బరువు ఎత్తడంతో ఊహాసాయికి మరో రజత పతకం లభించింది.