జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు ఆరు పతకాలు లభించాయి.
గువహటి: జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు ఆరు పతకాలు లభించాయి. రాగాల వెంకట రాహుల్ 3 స్వర్ణాలు సాధించగా... ఊహాసాయి ఒక రజత పతకం, 2 కాంస్యాలు సొంతం చేసుకుంది.
బాలుర 77 కేజీల విభాగంలో రాహుల్ స్నాచ్‌లో 135 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 152 కిలోల బరువు ఎత్తి 2 స్వర్ణాలు గెలిచాడు. ఓవరాల్‌గా 287 కేజీల బరువుతో మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాలికల 69 కేజీల విభాగంలో స్నాచ్‌లో ఊహకు కాంస్యం...క్లీన్ అండ్ జర్క్‌లో రజతం దక్కింది. ఓవరాల్‌గా 141 కిలోల బరువు ఎత్తడంతో ఊహాసాయికి మరో రజత పతకం లభించింది.