జింజూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను నిరాశపరిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్ శుక్రవారం జరిగిన 49 కేజీల విభాగంలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మీరాబాయి మొత్తం 194 కేజీలు బరువెత్తింది.
ఆమె స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు బరువెత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయి చివరి రెండు ప్రయత్నాల నుంచి వైదొలిగింది. మీరాబాయి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 207 కేజీలుకాగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె 13 కేజీలు తక్కువ ఎత్తింది. జియాంగ్ హుయిహువా (చైనా; 207 కేజీలు) స్వర్ణం... హు జిహుయ్ (చైనా; 204 కేజీలు) రజతం... సెరోద్ చనా (థాయ్‌లాండ్; 200 కేజీలు) కాంస్య పతకం సాధించారు.
సౌరవ్ శుభారంభం
షికాగో: ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో సౌరవ్ 5–11, 11–6, 11–13, 11–6, 11–3తో యాయా ఎల్నావాస్నీ (ఈజిప్ట్)పై గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment