Asian championship
-
భారత షూటర్ల జోరు
చాంగ్వాన్ (కొరియా): ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రైఫిల్ షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్ రజత పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత్‌కు రెండు ఒలింపిక్స్ కోటా బెర్త్‌లు దక్కాయి. ఇప్పటికే భారత షూటర్లు 8 బెర్తులు పొందారు. దీంతో వచ్చే ఏడాది పారిస్‌కు పయనమయ్యే షూటర్ల సంఖ్య పదికి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 24 ఏళ్ల అర్జున్ 251.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఫైనల్లో 15 ఏళ్ల తిలోత్తమ (252.3 పాయింట్లు) త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. కొరియన్ షూటర్ కోన్ ఎంజీ (252.4) 0.1 తేడాతో బంగారం గెలుచుకుంది. ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో అర్జున్, దివ్యాన్‡్ష, హృదయ్ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది. తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యంతో సంతృప్తి చెందింది. సీనియర్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్, దర్శన రాథోడ్ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. -
ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను శుక్రవారం ప్రకటించారు. 10 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల, మహిళల జట్లకు ఆచంట శరత్ కమల్, మనిక బత్రా సారథ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్ జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కూడా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, మహారాష్ట్ర ప్లేయర్ సానిల్ షెట్టి రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ఆసియా టీటీ చాంపియన్‌షిప్ సెపె్టంబర్ 3 నుంచి 10 వరకు దక్షిణ కొరియాలో... ఆసియా క్రీడల టీటీ ఈవెంట్ చైనాలోని హాంగ్జౌలో సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. భారత టీటీ జట్లు: పురుషుల టీమ్ విభాగం: ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుష్ షా. రిజర్వ్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, సానిల్ శెట్టి. మహిళల టీమ్ విభాగం: మనిక బత్రా, ఆకుల శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, అహిక ముఖర్జీ, దియా చిటాలె. రిజర్వ్: అర్చన కామత్, రీత్ రిష్యా. పురుషుల డబుల్స్: శరత్ కమల్–సత్యన్; మానవ్–మనుష్. మహిళల డబుల్స్: సుతీర్థ–అహిక ముఖర్జీ; శ్రీజ–దియా. మిక్స్డ్ డబుల్స్: మనిక– సత్యన్; శ్రీజ–హర్మీత్ దేశాయ్. ఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌధరీ (భారత్) ద్వయం 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్‌టెడ్–మంచాయ సావంగ్కెవ్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సహజ 0–6, 6–1, 6–1తో లీ జాంగ్ సియో (కొరియా)పై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం
ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్ 2023 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. దక్షిణకొరియాలోని బుసాన్ వేదికగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఓడించింది. కాగా భారత్‌కు ఆసియా కప్ టైటిల్ నెగ్గడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. జూన్ 27న ప్రారంభమైన టోర్నీలో మూడురోజుల పాటు ఆరు మ్యాచ్‌లు జరిగాయి. టాప్-2లో నిలచిన భారత్, ఇరాన్‌లు ఫైనల్లో పోటీపడ్డాయి. భారత కెప్టెన్ పవన్ షెహ్రావత్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. ఇక, ఈ మ్యాచ్ తొలి ఐదు నిమిషాల వెనుకబడిన టీమిండియా ఆ తర్వాత సత్తాచాటింది. 10వ నిమిషంలో పవన్, ఇనాందార్ సక్సెస్ఫుల్ రైడ్లతో మ్యాచ్ భారత్ వైపునకు తిరిగింది. అప్పటి నుంటి టీమిండియా చెలరేగింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ 23-11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. ఓ దశలో పాయింట్లు 38-31కు చేరాయి. అయితే, మళ్లీ భారత్ పుంజుకుంది. 42-32 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకొని.. ఆసియన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకుంది. ఇక భారత కబడ్డీ జట్టుకు తదుపరి ఆసియా గేమ్స్ కీలకంగా ఉంది. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జవూ వేదికగా ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. చదవండి: #MajidAli: రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్ -
ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, జ్యోతిక శ్రీ
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ, దండి జ్యోతిక శ్రీ ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. జూలై 12 నుంచి 16 వరకు బ్యాంకాక్‌లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి మొత్తం 54 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్, 200 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజీ... మహిళల 4*400 మీటర్ల రిలే, 4*400 మీటర్ల మిక్స్డ్ రిలేలో జ్యోతిక శ్రీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బోపన్న జోడీ శుభారంభం సించ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లండన్‌లో గురువారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న ద్వయం 7–6 (10/8), 7–6 (7/5)తో జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
Asian Weightlifting Championships 2023: బింద్యారాణికి రజతం
జింజు (దక్షిణ కొరియా): మహిళల ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన బింద్యారాణి దేవి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన 55 కేజీల విభాగం పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఆమె రజతపతకాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కూడా రజతం నెగ్గిన మణిపూర్ లిఫ్టర్ బింద్యా ఈ పోరులో క్లీన్ అండ్ జర్క్, స్నాచ్లలో కలిపి మొత్తం 194 కేజీల (83 కేజీలు + 111 కేజీ) బరువెత్తింది. చెన్ గ్వాన్ లింగ్ (చైనీస్ తైపీ –204 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా, వో తి క్యూ ను (వియత్నాం – 192 కేజీలు) కాంస్యం గెలుచుకుంది. -
మీరాబాయి చాను విఫలం.. ఆరో స్థానానికి పరిమితం
జింజూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను నిరాశపరిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్ శుక్రవారం జరిగిన 49 కేజీల విభాగంలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మీరాబాయి మొత్తం 194 కేజీలు బరువెత్తింది. ఆమె స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు బరువెత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయి చివరి రెండు ప్రయత్నాల నుంచి వైదొలిగింది. మీరాబాయి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 207 కేజీలుకాగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె 13 కేజీలు తక్కువ ఎత్తింది. జియాంగ్ హుయిహువా (చైనా; 207 కేజీలు) స్వర్ణం... హు జిహుయ్ (చైనా; 204 కేజీలు) రజతం... సెరోద్ చనా (థాయ్‌లాండ్; 200 కేజీలు) కాంస్య పతకం సాధించారు. సౌరవ్ శుభారంభం షికాగో: ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో సౌరవ్ 5–11, 11–6, 11–13, 11–6, 11–3తో యాయా ఎల్నావాస్నీ (ఈజిప్ట్)పై గెలిచాడు. -
ఫిట్నెస్ క్వీన్ @ 55
కొంతమంది మధ్యవయసులోనూ కెరీర్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి దూసుకుపోతుంటారు. నిస్రీన్ పారిఖ్ మాత్రం యాభైఏళ్లకు పైబడ్డ వయసులోనూ చక్కటి ఫిట్నెస్తో అబ్బుర పరుస్తోంది. ‘‘ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తే వయసుతో సంబంధం లేకుండా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు’’ అని నిరూపించి చూపిస్తోంది నిస్రీన్ పారిఖ్. ముంబైలో పుట్టిన పెరిగిన నిస్రీన్ పారిఖ్‌కు చిన్నప్పటి నుంచి ఆటలాడడం అంటే ఎంతో ఇష్టం. పదిహేనేళ్లకే కరాటే నేర్చుకుంది. ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్, నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పతకాలను కూడా సాధించింది. నిస్రీన్‌కు 1989లో పెళ్లయి పిల్లలు పుట్టడంతో..వారిని చూసుకోవడంలోనే సమయం గడిచిపోయేది. అయినా రోజువారి ఫిట్నెస్ వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోలేదు. బెస్ట్ పర్సనల్ ట్రెయినర్... ఇంటి బాధ్యతల్లో నిమగ్నమైనప్పటికీ కాస్త వెసులుబాటు చేసుకుని ముంబై యూనివర్సిటీలో సైకాలజీ, సోఫియా కాలేజీలో డైట్ అండ్ న్యూట్రిషన్లో మాస్టర్స్ చేసింది. తరువాత ఎయిర్ ఇండియాలో ఉద్యోగులకు పర్సనల్ ట్రెయినర్‌గా పాఠాలు చెప్పేది. నిస్రీన్ క్లాసులకు మంచి ఆదరణ లభించడంతో 2015లో ఏటీపీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ‘బెస్ట్ పర్సనల్ ట్రెయినర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది. ఈ ఉత్సాహంతో స్కూల్ స్థాయి విద్యార్థులకు ఫిట్నెస్ ట్రెయినర్‌గా చేరింది. పిల్లలిద్దరూ బోర్డింగ్ స్కూల్లో చేరడంతో నిస్రీన్‌కు సమయం దొరికింది. దీంతో యోగాలో పీజీ డిప్లొమా చేస్తూనే ఇంటి దగ్గర సాధన చేస్తుండేది. తర్వాత విద్యార్థులకు, ఫిట్నెస్ ఔత్సాహికులకు యోగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. ఇలా గత పద్దెనిమిదేళ్లుగా యోగా పాఠాలు చెబుతూ ఎంతోమందిని ఫిట్‌గా ఉంచడంతోపాటు తను కూడా ఫిట్‌గా తయారైంది నిస్రీన్. ఆ ఆపరేషన్‌తో బాడీ బిల్డర్‌గా... నిస్రీన్‌కు 48 ఏళ్లు ఉన్నప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బందులు ఏర్పడడంతో గర్భసంచినే తొలగించారు. సర్జరీ సమయం లో కాస్త బలహీన పడిన నిస్రీన్.. తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టింది. రెండేళ్ల తరువాత పూర్తి ఫిట్నెస్ వచ్చిన నిస్రీన్ తన పిల్లల ప్రోత్సాహంతో 50 ఏళ్ల వయసులో తొలిసారిగా 2016లో ‘ముంబై బాడీబిల్డింగ్ కాంపిటీషన్లో పాల్గొంది. అలా పాల్గొన్న ప్రతి పోటీలో మెడల్ గెలుచుకుంటూ లేటు వయసు బాడీబిల్డర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా, ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని ‘మోడల్ ఫిజిక్ అథ్లెట్’గా పాపులారిటీ సంపాదించుకుంది. థాయ్‌లో జరిగిన ‘వరల్డ్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్’లో నాలుగోస్థానంలో నిలిచి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కలలు నిజం చేసుకునేందుకు ద్వారాలెప్పుడూ తెరిచే ఉంటాయి. మనముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగితే కలలను నిజం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఉదయాన్నే ప్రోటీన్ షేక్, తరువాత వర్క్ అవుట్స్‌తో రోజు ప్రారంభం అవుతుంది. అడ్వర్టైజ్మెంట్స్ షూట్స్, బాలీవుడ్ సెలబ్రెటీలను కలుస్తూనే, రోజూ ఫిట్నెస్ తరగతులు నిర్వహిస్తున్నాను. లాక్డౌన్ సమయంలో వర్చువల్ తరగతులను నడిపాను. కొన్ని ఫిట్నెస్ సప్లిమెంట్స్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తూ ఎప్పూడూ బిజీగా ఉంటున్నప్పటికీ, నా కుటుంబ సహకారం వల్లే నేనెప్పుడూ ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా ఉండగలుగుతున్నాను. – నిస్రీన్ -
చేపల్లాంటి పిల్లలు... కడలిని ఈదేస్తున్నారు
జీవితమంటేనే కష్ట సుఖాల కలయిక. కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొందరు. కానీ కొందరు తమ కష్టాలకు ప్రతిభను జోడించి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే జియారాయ్, కావేరి ధీమార్‌లు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనేక సమస్యలను కడలికి ఎదురీదుతూ తమ వయసు కంటే ఎక్కు సంఖ్యలో మెడల్స్‌ను సాధిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఇండియన్ పారా స్విమ్మర్ జియారాయ్ నేవీ అధికారి మదన్ రాయ్, రచన దంపతుల ముద్దుల కూతురు. సొంత ఊరు యూపీ అయినప్పటికీ మదన్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండడంతో జియా అక్కడే పెరిగింది. పుట్టి ఏడాదిన్నర దాటినా జియా చిన్న చిన్న మాటలు కూడా సరిగా పలకలేక పోతోంది. తల్లిదండ్రులు కంగారు పడి డాక్టర్లకు చూపించారు. ఆటిజం అని తెలిసింది. మిగతా పిల్లల్లా ఏదీ సులభంగా నేర్చుకునేది కాదు. ఏదైనా పదేపదే చెబితే కోపం వచ్చేది. నేర్చుకోకపోగా విపరీతంగా అరిచేది. ఒకరోజు మదన్ జియాను స్విమ్మింగ్ పూల్‌లో దించగానే అమె నీళ్లను ఇష్టపడుతూ బాగా ఆడుకుంది. డాక్టర్లు కూడా వాటర్ స్పోర్ట్స్ ఆడిస్తే జియాలో త్వరగా మార్పులు కనిపిస్తాయని సూచించారు. వాటర్ థెరపీలో భాగంగా వాటర్ గేమ్స్ ఆడుతూ జియాకు స్విమ్మింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో స్విమ్మింగ్ సాధన చేయడం ప్రారంభించింది. ఎన్నో సమస్యలున్నా అన్నిటినీ తల్లిదండ్రుల సాయంతో ఎదుర్కొని మంచి స్విమ్మర్‌గా ఎదిగింది జియా. అనేక జాతీయ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని వయసుకంటే ఎక్కువ సంఖ్యలో బంగారు పతకాలను గెలుచుకుంది. అంతేగాక ఇప్పటిదాకా స్విమ్మింగ్‌లో అనేక జాతీయ రికార్డులను బద్దలు కొట్టి, 22 గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. రెండు వందల మీటర్ల ఫ్రీస్టైల్, వంద మీటర్ల బ్యాక్ స్ట్రోక్, బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో అనేక మెడల్స్‌ను సాధించింది. 14 కిలోమీటర్లను మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో ఈది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అంతేగాక 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందుకుంది. తాను సాధించిన అనేక విజయాల రికార్డులను ఆటిజంపై అవగాహన కల్పించడానికి అంకితం చేస్తోంది జియా. కనీసం మాట్లాడడం కూడా రాని జియా ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి సాధన చేసింది. ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి ఐదు గంటల వరకు వ్యాయామం చేస్తుంది. ఎనిమిదింటి నుంచి పదింటి వరకు స్విమ్మింగ్ సాధన చేస్తుంది. తరువాత స్కూలుకు వెళ్తుంది. స్కూలు అయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ స్విమ్మింగ్ సాధన. ఎనిమిదో తరగతి చదువుతోన్న జియా రోజూ ఇదే దిన చర్యను పాటిస్తూ గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జియా విజయాలను పొగడడం విశేషం. తాజాగా శ్రీలంకలోని తలైమన్నార్ సెటిల్మెంట్ నుంచి తమిళ నాడులోని ధనుష్కోటి వరకు ఉన్న 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లో ఈది మరో కొత్త రికార్డును నెలకొల్పింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ‘యంగెస్ట్ స్విమ్మర్’గా నిలిచిన జియాకు అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫిలిప్స్ రోల్ మోడల్. అతని లాగే ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. చేప పిల్ల.. కావేరీ ధీమార్.. 2017 వరకు ఈమెవరో ప్రపంచానికి తెలియదు. ఆమెలోని ప్రతిభ పాటవాలు సుదూర శిఖరాలను అధిరోహించేలా చేసి జాతీయ రికార్డుల్లో తనకంటూ స్థానం సంపాదించుకుని ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. భోపాల్‌లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది. ఏడుగురు అక్కాచెల్లెళ్ళు,ఇద్దరు తమ్ముళ్ల మధ్య ఐదో అమ్మాయి కావేరి ధీమార్. జాలరుల కుటుంబం కావడంతో చేపలను వేటాడితేగానీ వారి కడుపులు నిండని పరిస్థితి. ఇది తప్ప వారికి ఆదాయం వచ్చే మరో మార్గం లేదు. కుటుంబ ఖర్చులతోపాటు తండ్రి అప్పులు కూడా పెరిగాయి. అప్పులు తీర్చడానికి తన అక్కచెల్లెళ ్లతో కలిసి కావేరి కూడా చేపల వేటకు వెళ్లేది. వేటలో ఎంతో చురుకుగా దూసుకుపోయేది కావేరి. ఈ విషయం ఆనోటా ఈ నోటా మధ్యప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్’ అకాడమీకి తెలిసింది. వెంటనే కావేరీని అకాడమీలో చేర్చుకుని పడవలను నడపడడంలో శిక్షణ ఇచ్చారు. దీంతో నీళ్లమీద పడవలను పరిగెత్తిస్తూ ఇండియాలోనే టాప్ కెనోయిర్‌గా నిలిచింది. పొల్గొన్న ప్రతిపోటీలోనూ పతకాన్ని ఖాయం చేసుకొస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ కనోయింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని 12 స్వర్ణపతకాలను గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న జరుగుతున్న ‘ఏషియన్ చాంపియన్‌షిప్స్’ లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ప్రతిభ ఉండి కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగల నేర్పరితనం ఉండాలేగాని పేద, గొప్ప అనే తేడా లేకుండా ఎదగవచ్చనడానికి కావేరి జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. -
బ్యాడ్మింటన్‌పై ‘కరోనా’
న్యూఢిల్లీ: ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరగనున్న ఆసియా చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత మహిళల జట్టు తప్పుకుంది. ఫిలిప్పీన్ దేశంలోనూ ‘కరోనా వైరస్’ వేగంగా వ్యాప్తి చెందుతుండటమే అందుకు కారణం. ఈ నెల 11 నుంచి 16 వరకు టోర్నీ జరగాల్సి ఉంది. ‘కరోనా కారణంగా గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. ఆసియా బ్యాడ్మింటన్ సమాఖ్యతో కూడా దీనిపై చర్చించాం. అనంతరం మన మహిళల జట్టు టోర్నీలో పాల్గొనకుండా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాం’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఇంతకు ముందే ఈ టోర్నీకి దూరం కాగా అస్మిత చలీహా, మాల్విక బన్సోడ్, పుల్లెల గాయత్రి తదితర యువ క్రీడాకారిణులతో కూడిన భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు పురుషుల జట్టు మాత్రం చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని ‘బాయ్’ వెల్లడించడం విశేషం. సాయిప్రణీత్, శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ తదితరులతో పూర్తి స్థాయి పురుషుల జట్టు టోర్నీ బరిలోకి దిగుతోంది. వీరంతా ఈ నెల 9న మనీలా బయల్దేరతారు. -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (ఢిల్లీ) ద్వయం ఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట 159–154తో సో చేవన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–అభిషేక్ క్వార్టర్ ఫైనల్లో 158–155తో ఆదెల్ జెన్‌బినోవా–అక్బర్ అలీ కరబయేవ్ (కజకిస్తాన్)లపై నెగ్గారు. బుధవారం జరిగే స్వర్ణ పతక పోరులో చెన్ యి సువాన్–చెన్ చెయి లున్ (చైనీస్ తైపీ)లతో సురేఖ–అభిషేక్ తలపడతారు. దీపిక–అతాను దాస్ జంటకు కాంస్యం రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భార్యభర్తలైన దీపిక కుమారి–అతాను దాస్ జంట కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో దీపిక–అతాను దాస్ ద్వయం 6–2తో యిచాయ్ జెంగ్–వె షావోజువాన్ (చైనా) జోడీపై గెలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో దీపిక–అతాను దాస్ 3–5తో లె చియెన్ యింగ్–సు యు యాంగ్ (చైనీస్ తైపీ)ల చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం కొనసాగుతుండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు. -
రన్నరప్ యువ భారత్
న్యూఢిల్లీ: తొలిసారి ఆసియా అండర్–23 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవాలని ఆశించిన భారత జట్టు తుది మెట్టుపై తడబడింది. మయన్మార్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 21–25, 20–25, 25–19, 23–25తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. చైనా, న్యూజిలాండ్, కజకిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లపై గెలిచి జపాన్, థాయ్‌లాండ్, చైనీస్ తైపీ జట్ల చేతిలో ఓడింది. ఈ టోర్నీలో విజేత చైనీస్ తైపీ, రన్నరప్ భారత్ జట్లు అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించాయి. -
పంకజ్‌కు కాంస్యం
చండీగఢ్: ఆసియా బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 3–5 (98–100, 102–23, 15–100, 9–100, 101–76, 0–101, 102–3, 11–101) ఫ్రేమ్‌ల తేడాతో ప్రపుర్ట్ చైతానసకున్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. మరో సెమీఫైనల్లో నే త్వా ఓ (మయన్మార్) 5–3తో చిట్ కో కో (మయన్మార్)పై గెలిచి టైటిల్ కోసం ప్రపుర్ట్తో పసిడి పతక పోరుకు సిద్ధమయ్యాడు. -
ఒలింపిక్స్‌కు మరింత పకడ్బందీగా...
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్ షిప్లో బాక్సర్ల అద్భుత ప్రదర్శన (రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలు సహా 13 పతకాలు)తో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నూతనోత్సాహంతో ఉంది. ఈ ఫలితాలతో టోక్యో ఒలింపిక్స్ లక్ష్యంగా సమాఖ్య ప్రణాళికలు వేస్తోంది. చాంపియన్‌షిప్ పతకాల్లో కొన్నింటినైనా వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో నిలబెట్టుకోవాలని భావిస్తోంది. తమ తదుపరి లక్ష్యం ఇదేనని సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రకటించారు. ఇందులో భాగంగా విదేశీ పర్యటనలకు షెడ్యూల్‌కు పది రోజుల ముందే ఆటగాళ్లను పంపనుంది. వాతావరణ మార్పుల కారణంగా ఆహారానికి ఇబ్బంది రాకుండా చెఫ్‌లను పంపించే యోచన చేస్తోంది. సెప్టెంబరులో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌తో ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ‘ప్రతిష్ఠాత్మక క్రీడలకు బాక్సర్లను సర్వసన్నద్ధం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఏ ఒక్క అవకాశాన్నీ వదలం. ఇందులో భాగంగా మార్గదర్శకం, కోచింగ్, పోషకాహారం ఇలా ప్రతి అంశంపై శ్రద్ధ చూపుతాం’ అని మంగళవారం బాక్సర్ల సన్మాన కార్యక్రమంలో అజయ్ సింగ్ అన్నారు. ‘ఆసియా’ ప్రదర్శనకు గాను బాక్సర్లు, కోచ్‌లను ఆయన ప్రశంసించారు. ‘అర్జున’కు అమిత్, గౌరవ్ పేర్లు జకార్తా ఆసియా క్రీడల 49 కేజీల విభాగంలో, ఆసియా చాంపియన్‌షిప్ 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకాల విజేత అమిత్ పంఘాల్.... 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన గౌరవ్ బిధురి పేర్లను బీఎఫ్ఐ మంగళవారం ‘అర్జున అవార్డు’కు ప్రతిపాదించింది. వీరిలో అమిత్ పేరును గతేడాది కూడా పరిశీలనకు పంపారు. 2012లో డోప్ టెస్టులో విఫలమై ఏడాది నిషేధానికి గురైన నేపథ్యంలో అతడికి పురస్కారం దక్కలేదు. ఈ వివాదం సమసిన తర్వాత అమిత్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గాడు. మహిళల సహాయ కోచ్ సంధ్య గురుంగ్, మాజీ చీఫ్ కోచ్ శివ్ సింగ్‌లను ‘ద్రోణాచార్య’ అవార్డులకు ప్రతిపాదించారు. ఇక... ఇండియన్ బాక్సింగ్ లీగ్ దేశంలో క్రికెట్ సహా అనేక క్రీడా లీగ్‌లు విజయవంతమైన నేపథ్యంలో త్వరలో ‘ఇండియన్ బాక్సింగ్ లీగ్’ తెరపైకి రానుంది. రెండేళ్లుగా చర్చలు జరుగుతున్న ఈ లీగ్‌కు కార్యరూపం ఇచ్చి ఈ ఏడాది జులై–ఆగస్టు మధ్య నిర్వహించేలా బీఎఫ్ఐ ప్రణాళికలు వేస్తోంది. భారత మేటి బాక్సర్లు అమిత్ పంఘాల్, శివ థాపా, సరితా దేవి సహా విదేశీయులు కూడా పాల్గొనే లీగ్‌ను పురుషులు, మహిళల విభాగాల్లో మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించనున్నట్లు స్పోర్ట్జ్‌లైవ్ సంస్థ ఎండీ అతుల్ పాండే తెలిపారు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌ను ప్రారంభించిన ఈ సంస్థే... బాక్సింగ్ లీగ్ బాధ్యతలూ చూడనుంది. -
‘బాయ్’పై ప్రణయ్, సాయిప్రణీత్ ధ్వజం
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)కు తమ పేర్లను ప్రతిపాదించకపోవడంపై భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, భమిడిపాటి సాయిప్రణీత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధికార వర్గాలపై వారు విమర్శల దాడికి దిగారు. చైనా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మంగళవారం నుంచి జరుగనుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మలేసియా, ఇండోనేసియా నుంచి తమకంటే తక్కువ ర్యాంకు ఆటగాళ్లు టోర్నీ బరిలో దిగుతుండగా... ‘బాయ్’ ఉదాసీనత కారణంగా తా ను, సాయిప్రణీత్ అవకాశం కోల్పోయినట్లు ప్రణయ్ విమర్శించాడు. దీనిపై ‘బాయ్’ స్పందన మాత్రం వేరుగా ఉంది. బ్యాడ్మింటన్ ఆసియా (బీఏ) కోరిన మేరకు తాజా ర్యాంక్‌ల ప్రకారం పురుషుల, మహి ళల సింగిల్స్‌లో ఇద్దరేసి ఆటగాళ్లను ప్రతిపాదించా మని ‘బాయ్’ చెబుతోంది. మరోవైపు పలు టోర్నీలకు ఆటగాళ్ల ఎంట్రీలను పంపడంలో, వారి ప్రయా ణ వ్యవహారాలను పర్యవేక్షించడంలో ‘బాయ్’ తీరు ఘోరంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. -
ఆసియా చెస్ చాంప్ పద్మిని
మకాటి (ఫిలిప్పీన్స్): అజేయ ప్రదర్శనతో భారత చెస్ అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) క్రీడాకారిణి పద్మిని రౌత్ ఆసియా చాంపియన్‌గా అవతరించింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పద్మిని మొత్తం ఏడు పాయింట్లు సాధించి కియాన్యున్ గాంగ్ (సింగపూర్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా పద్మినికి టైటిల్ లభించింది. కియాన్యున్ గాంగ్ రన్నరప్‌గా నిలిచింది. ఒడిశాకు చెందిన 24 ఏళ్ల పద్మిని ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఓపెన్ విభాగంలో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. సూర్యశేఖర గంగూలీ నాలుగో స్థానంలో నిలువగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. తాజా ఘనతతో పద్మిని... 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో విజేతగా నిలిచిన ఎనిమిదో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో రోహిణి ఖాదిల్కర్ (1981, 1983), అనుపమ గోఖలే (1985, 1987) రెండేసి సార్లు ఈ టైటిల్ నెగ్గగా... భాగ్యశ్రీ థిప్సే (1991), కోనేరు హంపి (2003), తానియా సచ్దేవ్ (2007), ద్రోణవల్లి హారిక (2011), భక్తి కులకర్ణి (2016) ఆసియా చాంపియన్స్‌గా నిలిచారు. -
అంగద్ ‘పసిడి’ గురి
కువైట్ సిటీ: ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత యువ షూటర్ అంగద్ వీర్ సింగ్ బాజ్వా మెరిశాడు. ఈ మెగా ఈవెంట్లో 23 ఏళ్ల అంగద్ పురుషుల స్కీట్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచస్థాయిలో స్కీట్ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ షూటర్‌గా గుర్తింపు పొందాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అంగద్ నిర్ణీత 60 పాయింట్లకుగాను 60 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో 59 పాయింట్లతో బెన్ లెవిలిన్ (బ్రిటన్), రికార్డో ఫ్లిపెల్లి (ఇటలీ), విన్సెంట్ హాన్కాక్ (అమెరికా), ఆడమ్స్ పాల్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అంగద్ తిరగరాశాడు. డి జిన్ (చైనా–58 పాయింట్లు) రజతం, సయీద్ అల్ మక్తూమ్ (యూఏఈ–46 పాయింట్లు) కాంస్యం గెలిచారు. క్వాలిఫయింగ్‌లో 121 పాయింట్లు సాధించిన అంగద్ మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ జూనియర్ ఈవెంట్లో ఇలవెనిల్ వలారివాన్–హృదయ్ హజరికా (భారత్) జోడీ స్వర్ణం... మెహులీ ఘోష్–అర్జున్ బబూటా (భారత్) జంట కాంస్యం సాధించాయి. -
సునీత లక్రాకు మహిళల హాకీ పగ్గాలు
న్యూఢిల్లీ: అనుభవజ్ఞురాలైన డిఫెండర్ సునీత లక్రాను భారత మహిళల హాకీ సారథిగా నియమించారు. ఆమె సారథ్యంలోని జట్టును ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేశారు. ఈ నెల 13 నుంచి దక్షిణకొరియాలోని డాంగే నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్‌కు ఈ టోర్నీలో విశ్రాంతినిచ్చారు. గోల్‌కీపర్ సవితను వైస్ కెప్టెన్‌గా నియమించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఆసియా చాంపియన్స్‌లో భారత్ ఫైనల్లో చైనాను ఓడించి టైటిల్ గెలిచింది. గతేడాది జరిగిన ఆసియా కప్‌లోనూ చైనాపై గెలిచి విజేతగా నిలిచింది. జట్టు: సునీత లక్రా (కెప్టెన్), దీపిక, దీప్గ్రేస్ ఏక్కా, గుర్జీత్ కౌర్, సుమన్ దేవి తౌడమ్, మోనిక, నమిత టొప్పొ, నిక్కి ప్రధాన్, నేహ గోయల్, లిలిమా మింజ్, నవజ్యోత్ కౌర్, ఉదిత, వందన కటారియా, లాల్రెంసియామి, నవనీత్ కౌర్, అనూప బార్ల, సవిత, స్వాతి. -
సింధు, రుత్వికలపైనే ఆశలు
అలోర్ సెటార్ (మలేసియా): స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ గైర్హాజరీ నేపథ్యంలో... ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ చేరుకున్న జట్లు మేలో జరిగే థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తాయి. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం ఆసియా పోటీల నుంచి సైనా వైదొలగగా... గాయం కారణంగా ప్రణయ్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. తొలి రోజు ఫిలిప్పీన్స్‌తో భారత పురుషుల జట్టు... హాంకాంగ్‌తో భారత మహిళల జట్టు తలపడతాయి. భారత పురుషుల జట్టుకు సులువైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘డి’లో భారత్‌తోపాటు ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మాల్దీవులు ఉన్నాయి. మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ పోటీపడతారు. రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు బరిలోకి దిగుతాయి. భారత మహిళల జట్టు ముందంజ వేయాలంటే తొలి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ ‘డబ్ల్యూ’లో భారత్‌తోపాటు జపాన్, హాంకాంగ్ జట్లున్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. సైనా గైర్హాజరీ నేపథ్యంలో... సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, రుత్విక శివాని, శ్రీకృష్ణప్రియ ఆడనున్నారు. డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; ప్రజక్తా సావంత్–సంయోగిత జోడీలు పోటీపడనున్నాయి. -
అభిషేక్ ‘పసిడి’ బాణం
ఢాకా: గురి తప్పని లక్ష్యంతో రాణించిన భారత ఆర్చర్లు అభిషేక్ వర్మ, వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. బుధవారం జరిగిన పోటీల్లో ఢిల్లీకి చెందిన అభిషేక్ వర్మ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌గా అవతరించగా... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా)తో జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో విజయం సాధించాడు. ఇద్దరికీ ఐదు రౌండ్లలో నాలుగు చొప్పున బాణాలు సంధించే అవకాశం ఇచ్చారు. ఐదు రౌండ్ల తర్వాత స్కోరు 147–147తో సమఉజ్జీగా నిలిచింది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో అవకాశం ఇచ్చారు. ఇద్దరూ కొట్టిన షాట్ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లింది. అయితే కిమ్ జాంగ్‌హో సంధించిన బాణంతో పోలిస్తే అభిషేక్ వర్మ సంధించిన బాణం ‘బుల్స్ ఐ’కు అతి సమీపంలో ఉండటంతో భారత ఆర్చర్‌ను విజేతగా ప్రకటించారు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్చర్ గుర్విందర్ సింగ్ 145–148తో సంగ్ హో హాంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో అభిషేక్ 149–146తో సంగ్ హో హాంగ్ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్ ఫైనల్లో 148–141తో అబుల్ ఖాషిమ్ మామున్ (బంగ్లాదేశ్)పై, మూడో రౌండ్లో 146–145తో ఇస్మాయిల్ ఇబాది (ఇరాన్)పై, రెండో రౌండ్లో 149–141తో థు రైన్ జిన్ (మయన్మార్)పై గెలిచాడు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ 146–142తో వు టింగ్ టింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో జ్యోతి సురేఖ 138–144తో చోయ్ బోమిన్ (కొరియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖలకు ఇది రెండో పతకం. ఈ ఇద్దరూ జోడీగా బరిలోకి దిగి మిక్స్డ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచిన సంగతి విదితమే. ఫైనల్లో ధీరజ్ మరోవైపు ఆసియా చాంపియన్‌షిప్‌తోపాటు నిర్వహిస్తున్న యూత్ ఒలింపిక్స్ ఆసియా కాంటినెంటల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన సెమీస్‌లో 16 ఏళ్ల ధీరజ్ 6–2తో సూరజ్ (భారత్)పై గెలిచాడు. చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ (విజయవాడ)కి చెందిన ధీరజ్ గురువారం జరిగే రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం భారత్‌కే చెందిన ఆకాశ్‌తో తలపడతాడు. -
మేరీకోమ్ మెరిసె...
హో చి మిన్ సిటీ (వియత్నాం): మూడు పదుల వయసు దాటినా తన పంచ్‌లో పదును తగ్గలేదని భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ నిరూపించింది. మూడేళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయస్థాయిలో ‘పసిడి’ పంచ్‌ను సంధించింది. బుధవారం ముగిసిన ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 34 ఏళ్ల మేరీకోమ్ చాంపియన్‌గా నిలిచింది. 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 5–0తో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సోనియా లాథెర్ రజత పతకంతో సంతృప్తి పడింది. ఫైనల్లో యిన్ జాన్‌హువా (చైనా) చేతిలో సోనియా ఓడిపోయింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం, ఐదు కాంస్యాలు లభించాయి. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తర్వాత మేరీకోమ్ ఖాతాలో చేరిన మరో స్వర్ణం ఇదే కావడం విశేషం. ఈనెల 25న 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్న మేరీకోమ్ ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన ఐదో స్వర్ణమిది. గతంలో ఆమె 2003లో (46 కేజీలు), 2005లో (46 కేజీలు), 2010లో (51 కేజీలు), 2012లో (51 కేజీలు) స్వర్ణాలు సాధించింది. 2008లో (46 కేజీలు) రజతం దక్కించుకుంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మేరీకోమ్‌కు ఫైనల్లోనూ అంతగా ఇబ్బంది ఎదురుకాలేదు. 15 ఏళ్లుగా అంతర్జాతీయ బాక్సింగ్‌లో కొనసాగుతోన్న ఆమె తన అనుభవాన్నంతా రంగరించి ప్రత్యర్థి ఆట కట్టించింది. తొలి రౌండ్ నుంచి ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. అయితే కచ్చితమైన పంచ్‌లు సంధించిన మేరీకోమ్ ఖాతాలోనే ఎక్కువ పాయింట్లు చేరాయి. ఎడమ వైపు నుంచి ఉత్తర కొరియా బాక్సర్ మేరీకోమ్‌పై దాడులు చేసినా ఈ మణిపూర్ బాక్సర్ సమర్థంగా అడ్డుకుంటూనే ఎదురుదాడి చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
ఆసియా చాంప్ సామియా
యాంగూన్ (మయన్మార్): అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై మరో భారత అమ్మాయి మెరిసింది. ఈసారి జూనియర్ విభాగంలో ఆసియాను జయించి మువ్వన్నెల పతాకం రెపరెపలాడించింది. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన సామియా ఇమాద్ ఫారుఖీ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన అండర్–15 మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సామియా (భారత్) 15–21, 21–17, 21–19తో విడ్జజా స్టెఫాని (ఇండోనేసియా)పై నెగ్గి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 14 ఏళ్ల సామియా తుదికంటా పట్టుదలగా పోరాడి విజేతగా నిలిచింది. ఇప్పటివరకు ఇదే విభాగం సింగిల్స్‌లో జాతీయ స్థాయిలో ఒక్క పతకాన్ని కూడా గెలవని సామియా ఏకంగా ఆసియా టైటిల్‌ను అందుకొని చరిత్ర సృష్టించింది. కఠినంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలిగేమ్ ఆరంభం నుంచే ఇండోనేసియా ప్రత్యర్థి స్టెఫాని 6–1తో ఆధిక్యం ప్రదర్శించింది. ఇదే జోరులో 21–15తో స్టెఫాని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో పుంజుకున్న సామియా 6–2తో ప్రత్యర్థిని వెనక్కి నెట్టింది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ 13–8తో జోరు ప్రదర్శించింది. ఈ దశలో తేరుకున్న స్టెఫాని వరుసగా 5 పాయింట్లు సాధించి 13–13తో స్కోరును సమం చేసింది. తర్వాత ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా దూకుడుగా ఆడిన సామియా 21–17తో రెండోగేమ్‌ను గెలిచి రేసులో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సామియా వెనుకబడింది. వెంటవెంటనే పాయింట్లు సాధిస్తూ స్టెఫాని 11–7తో ముందంజ వేసింది. ఈ దశలో సంయమనంతో ఆడిన సామియా 12–16తో కొంత తేరుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించి వరుసగా 4 పాయింట్లు సాధించి 16–16తో స్కోరు సమం చేసింది. ఈ దశలో ఇరువురూ హోరాహోరీగా పోరాడటంతో 18–18 వద్ద మళ్లీ స్కోరు సమమైంది. ఒత్తిడిని జయించిన సామియా వరుసగా రెండు పాయింట్లు సాధించి 20–18తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత స్టెఫాని ఒక పాయింట్ సాధించడంతో పోరు రసవత్తరంగా మారింది. చివరకు ఎలాంటి తడబాటు లేకుండా సామియా మరో పాయింట్ సాధించి 21–19తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ స్వర్ణంతో పాటు 3 కాంస్య పతకాలను సాధించింది. -
వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు ‘రియో’ బెర్త్‌లు
ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శన రెండు ఒలింపిక్ బెర్త్‌లను అందించింది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో భారత్‌కు ఒక్క పతకం రాకపోయినా... ఓవరాల్ నైపుణ్యంతో పురుషుల, మహిళల విభాగాల్లో ఒక్కో బెర్త్ లభించింది. -
శ్రీకాంత్... ఈసారైనా!
తొలి రౌండ్ మ్యాచ్‌పై ఉత్కంఠ నేటి నుంచి ఆసియా చాంపియన్‌షిప్ వుహాన్ (చైనా): వరుసగా నాలుగు టోర్నమెంట్లలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఐదో టోర్నమెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బుధవారం మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఇదే చివరి టోర్నీ కావడంతో పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలతోపాటు చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో కూడా శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. దాంతో ఈసారైనా అతను తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. ఇక మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా నెహ్వాల్... కుసుమస్తుతి (ఇండోనేసియా)తో సింధు తలపడనున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ బరిలో ఉన్నారు. -
భారత్‌కు కాంస్యం
సెమీస్‌లో 1-3తో ఇండోనేసియా చేతిలో ఓటమి ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో తమ పోరాటాన్ని ముగించింది. ఇండోనేసియాతో శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. ఈ పోటీల చరిత్రలో భారత్‌కు కాంస్యం దక్కడం ఇదే ప్రథమం. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 23-25, 21-9తో ప్రపంచ పదో ర్యాంకర్ టామీ సుగియార్తోను ఓడించి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. గతంలో సుగియార్తోతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకసారి మాత్రమే నెగ్గిన శ్రీకాంత్ ఈసారి పైచేయి సాధించాడు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో విజయావకాశం లభించినా కీలకదశలో తప్పిదాలు చేశాడు. దాంతో మ్యాచ్ మూడో గేమ్‌కు వెళ్లింది. ఈ గేమ్‌లో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం కనీసం పోటీనివ్వకుండానే చేతులెత్తేసింది. ప్రపంచ రెండో ర్యాంక్ జంట మొహమ్మద్ హసన్-హెంద్రా సెతియవాన్తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంక్‌లో ఉన్న సుమీత్-మనూ అత్రి జోడీ 11-21, 10-21తో పరాజయం పాలైంది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ నిరాశ పరిచాడు. ప్రపంచ 34వ ర్యాంకర్, ఇండోనేసియా భవిష్యత్ తార జిన్‌టింగ్ ఆంథోనీతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్ జయరామ్ 15-21, 20-22తో ఓడిపోయాడు. దాంతో ఇండోనేసియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో భారత జంట ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ పోరాడినా ఫలితం లేకపోయింది. ప్రపంచ 10వ ర్యాంక్ జోడీ అంగా ప్రతమా-రికీ కరాంద సువార్ది 21-13, 18-21, 21-15తో ప్రణవ్-అక్షయ్ జంటను ఓడించడంతో ఇండోనేసియా 3-1తో విజయాన్ని దక్కించుకొని ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో ఇండోనేసియా తలపడుతుంది. మహిళల ఫైనల్లో జపాన్‌తో చైనా ఢీకొంటుంది. -
సైనా సందేహమే!
ఇప్పటికీ తేల్చని స్టార్ షట్లర్ 15నుంచి ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయని జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయ పడ్డారు. శ్రీకాంత్‌తో పాటు అజయ్ జైరాం, హెచ్ఎస్ ప్రణయ్ ఇటీవల నిలకడగా రాణిస్తుండటం, సొంతగడ్డపై ఆడుతుండటం జట్టుకు కలిసొస్తుందని ఆయన అన్నారు. అయితే మహిళల విభాగంలో సింగిల్స్‌తో పాటు రెండో డబుల్స్ జోడీపై కూడా ఇంకా స్పష్టత లేదని ఆయన చెప్పారు. ముఖ్యంగా భారత నంబర్‌వన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో పాల్గొనటంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన వెల్లడించారు. ‘భారత జట్టు జాబితాలో సైనా పేరు ఉంది. అయితే ప్రస్తుతానికి ఆమెనుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆడతానని గానీ ఆడనని గానీ సైనా చెప్పలేదు. దీని ప్రభావం జట్టుపై ఎలా ఉంటుందనేది ఇప్పుడే అంచనాకు రాలేం. మహిళల రెండో డబుల్స్ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి, మనీషా జోడి గురించి ఆలోచన ఉంది కానీ వారికున్న అనుభవం తక్కువ. సైనా ఉంటే సైనా-సింధు కలిసి కూడా డబుల్స్ ఆడవచ్చు’ అని గోపీచంద్ స్పష్టం చేశారు. ఇటీవల టీమ్ ఈవెంట్లలో మన జట్టు బాగా ఆడుతున్న విషయాన్ని గుర్తు చేసిన కోచ్... యువ షట్లర్లు తమను తాము నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ నెల 15నుంచి 21 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ఆసియా చాంపియన్‌షిప్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 2009లో ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత హైదరాబాద్‌లో మరో పెద్ద స్థాయి టోర్నీ జరగడం ఇదే తొలిసారి. మరో వైపు గాయం కారణంగా పారుపల్లి కశ్యప్ టోర్నీకి దూరమయ్యాడు.