చాంగ్వాన్ (కొరియా): ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రైఫిల్ షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్ రజత పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత్‌కు రెండు ఒలింపిక్స్ కోటా బెర్త్‌లు దక్కాయి. ఇప్పటికే భారత షూటర్లు 8 బెర్తులు పొందారు. దీంతో వచ్చే ఏడాది పారిస్‌కు పయనమయ్యే షూటర్ల సంఖ్య పదికి చేరింది.
శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 24 ఏళ్ల అర్జున్ 251.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఫైనల్లో 15 ఏళ్ల తిలోత్తమ (252.3 పాయింట్లు) త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. కొరియన్ షూటర్ కోన్ ఎంజీ (252.4) 0.1 తేడాతో బంగారం గెలుచుకుంది. ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్‌లో అర్జున్, దివ్యాన్‡్ష, హృదయ్ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది.
తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యంతో సంతృప్తి చెందింది. సీనియర్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అనంత్‌జీత్ సింగ్, దర్శన రాథోడ్ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment