
చండీగఢ్: ఆసియా బిలియర్డ్స్ చాంపియన్ షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 3–5 (98–100, 102–23, 15–100, 9–100, 101–76, 0–101, 102–3, 11–101) ఫ్రేమ్‌ల తేడాతో ప్రపుర్ట్ చైతానసకున్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. మరో సెమీఫైనల్లో నే త్వా ఓ (మయన్మార్) 5–3తో చిట్ కో కో (మయన్మార్)పై గెలిచి టైటిల్ కోసం ప్రపుర్ట్‌తో పసిడి పతక పోరుకు సిద్ధమయ్యాడు.