
దోహా: ఆసియా టూర్ రెడ్–10 స్నూకర్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 0–5 (1–48, 8–61, 37–48, 41–71, 25–66) ఫ్రేమ్‌ల తేడాతో బ్రెండన్ ఒ డొనొగుయె (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయాడు.
బెస్ట్ ఆఫ్–9 ఫ్రేమ్స్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో వివిధ ఫార్మాట్‌లలో 19 సార్లు ప్రపంచ టైటిల్ గెలిచిన పంకజ్ ఒక్క ఫ్రేమ్‌ను కూడా గెలవకపోవడం గమనార్హం. మరో సెమీఫైనల్లో మొహమ్మద్ బిలాల్ (పాకిస్తాన్) 5–4 ఫ్రేమ్‌లతో చెయుంగ్ కా వాయ్ (హాంకాంగ్)పై విజయం సాధించి బ్రెండన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment