
న్యూఢిల్లీ: అనుభవజ్ఞురాలైన డిఫెండర్ సునీత లక్రాను భారత మహిళల హాకీ సారథిగా నియమించారు. ఆమె సారథ్యంలోని జట్టును ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేశారు. ఈ నెల 13 నుంచి దక్షిణకొరియాలోని డాంగే నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్‌కు ఈ టోర్నీలో విశ్రాంతినిచ్చారు. గోల్‌కీపర్ సవితను వైస్ కెప్టెన్‌గా నియమించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఆసియా చాంపియన్స్‌లో భారత్ ఫైనల్లో చైనాను ఓడించి టైటిల్ గెలిచింది. గతేడాది జరిగిన ఆసియా కప్‌లోనూ చైనాపై గెలిచి విజేతగా నిలిచింది.
జట్టు: సునీత లక్రా (కెప్టెన్), దీపిక, దీప్‌గ్రేస్ ఏక్కా, గుర్జీత్ కౌర్, సుమన్ దేవి తౌడమ్, మోనిక, నమిత టొప్పొ, నిక్కి ప్రధాన్, నేహ గోయల్, లిలిమా మింజ్, నవజ్యోత్ కౌర్, ఉదిత, వందన కటారియా, లాల్రెంసియామి, నవనీత్ కౌర్, అనూప బార్ల, సవిత, స్వాతి.
Comments
Please login to add a commentAdd a comment