Sunita Lakra
-
‘గాయం వేధిస్తోంది.. మనసు బాధిస్తోంది’
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు సీనియర్ డిఫెండర్, మాజీ కెప్టెన్ సునీతా లక్రా అంతర్జాతీయ కెరీర్ గుడ్ బై చెప్పేశారు. మోకాలి గాయం కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్న లక్రా.. ఇక ఆడలేనంటూ వీడ్కోలు ప్రకటించారు. ఒకవైపు మనసు ఆడాలని తపిస్తున్నా గాయం వేధిస్తూ ఉండటంతో ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పడం లేదని పేర్కొంది. ఈ ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలనుకున్నానని, అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్న తరణంలో అర్థాంతరంగా వీడ్కోలు చెప్పడం కలిచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రోజు నాకు చాలా భావోద్వేగమైన రోజు. అంతర్జాతీయ హాకీకి ముగింపు పలుకుతున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలని భావించా. అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నా. నా మోకాలికి మరొకసారి సర్జరీ అవసరం అవుతుంది. దాంతో అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకోక తప్పడం లేదు. ఒకవైపు గాయం వేధిస్తోంది. మరొకవైపు ఆటకు గుడ్ బై చెప్పడంతో మనసు బాధిస్తోంది’ అని సునీతా లక్రా తెలిపారు. కాగా, గాయం నయమైన తర్వాత దేశవాళీ టోర్నీలు ఆడతానని పేర్కొన్నారు. దాంతో పాటు తన కెరీర్లో ఎదగడానికి దోహదం చేసిన నాల్కో తరఫున కూడా ఆడతానంటూ ప్రకటించారు. 2008 నుంచి భారత్‌కు లక్రా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. 2018లో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు ఆమె కెప్టెన్‌గా వ్యవహరించింది. 2018లో ఆసియా గేమ్స్‌లో లక్రా నేతృత్వంలో భారత మహిళల హాకీ జట్టు సిల్వర్ మెడల్ గెలిచింది. భారత్ తరఫున కెరీర్లో మొత్తం 139 మ్యాచ్‌లను లక్రా ఆడారు. -
సునీత లక్రాకు మహిళల హాకీ పగ్గాలు
న్యూఢిల్లీ: అనుభవజ్ఞురాలైన డిఫెండర్ సునీత లక్రాను భారత మహిళల హాకీ సారథిగా నియమించారు. ఆమె సారథ్యంలోని జట్టును ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేశారు. ఈ నెల 13 నుంచి దక్షిణకొరియాలోని డాంగే నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్‌కు ఈ టోర్నీలో విశ్రాంతినిచ్చారు. గోల్‌కీపర్ సవితను వైస్ కెప్టెన్‌గా నియమించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఆసియా చాంపియన్స్‌లో భారత్ ఫైనల్లో చైనాను ఓడించి టైటిల్ గెలిచింది. గతేడాది జరిగిన ఆసియా కప్‌లోనూ చైనాపై గెలిచి విజేతగా నిలిచింది. జట్టు: సునీత లక్రా (కెప్టెన్), దీపిక, దీప్గ్రేస్ ఏక్కా, గుర్జీత్ కౌర్, సుమన్ దేవి తౌడమ్, మోనిక, నమిత టొప్పొ, నిక్కి ప్రధాన్, నేహ గోయల్, లిలిమా మింజ్, నవజ్యోత్ కౌర్, ఉదిత, వందన కటారియా, లాల్రెంసియామి, నవనీత్ కౌర్, అనూప బార్ల, సవిత, స్వాతి. -
వందనకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ గా ఫార్వర్డ్ క్రీడాకారిణి వందన కటారియా నియమితురాలైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫికి 18 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్లేయర్ సునీత లక్రా వైస్ కెప్టెన్ గా ఎంపికైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫి ఈ నెల 29 నుంచి నవంబర్ 5 వరకు సింగపూర్ లో జరగనుంది. జపాన్, భారత్, చైనా, కొరియా, మలేసియా జట్లు ఈ టోర్నమెంట్ లో ఆడనున్నాయి. కెప్టెన్ గా ఎంపిక కావడం పట్ల వందన సంతోషం వ్యక్తం చేసింది. "ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. జట్టు బలాలు, బలహీనతల గురించి మాకు తెలుసు. సమిష్టిగా, వ్యక్తితంగా మా ఆటను మెరుగుపరుచుకుని సత్తా చాటాలని భావిస్తున్నామ'ని వందన చెప్పింది. శాయ్ ఆధ్వర్యంలో భోపాల్ లో ప్లేయర్స్ కు శిక్షణ శిబిరం నిర్వహిస్తామని చీఫ్ కోచ్ నీల్ హాగూడ్ తెలిపారు. మహిళల హాకీ జట్టు వందన కటారియా(కెప్టెన్), సునీత లక్రా(వైస్ కెప్టెన్), సవితా, రజనీ(గోల్ కీపర్స్), దీప గ్రేస్ ఎక్కా, రేణుకా యాదవ్, నమితా టోప్పో, రాణి రాంపాల్, నిక్కీ ప్రదాన్, నవజ్యోత్ కౌర్, మోనిక, పూనం రాణి, అనురాధ దేవి, ప్రీతి దూబే, పూనం బార్లా, హైనియలామ్ లాల్ రౌత్ ఫెలి