![Asian Athletics Championships: Jyothi Yarraji Jyothika Sri Selected - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/23/jyothi-yarraji.gif.webp?itok=KEYrHz1J)
జ్యోతి యర్రాజీ
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ, దండి జ్యోతిక శ్రీ ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. జూలై 12 నుంచి 16 వరకు బ్యాంకాక్‌లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి మొత్తం 54 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతారు.
మహిళల 100 మీటర్ల హర్డిల్స్, 200 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజీ... మహిళల 4*400 మీటర్ల రిలే, 4*400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో జ్యోతిక శ్రీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు.
బోపన్న జోడీ శుభారంభం
సించ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లండన్‌లో గురువారం జరిగిన తొలి రౌండ్‌లో బోపన్న ద్వయం 7–6 (10/8), 7–6 (7/5)తో జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment