Athlets
-
ఏషియన్ గేమ్స్‌లో పతక విజేతలకు సీఎం జగన్ అభినందన
సాక్షి, తాడేపల్లి: చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత్, ఏపీకి చెందిన క్రీడాకారులు పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో పతకాలు సాధించిన విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ఏసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన విజేతలకు శుభాకాంక్షలు. ఆర్చర్ అటానుదాస్, బొమ్మదేవర ధీరజ్‌తోపాటు, రజత పతకం సాధించిన తుషార్ షెల్కేలకు అభినందనలు. మీ విజయాలతో ఏపీతోపాటు దేశమంతా గర్వపడుతోంది. బొమ్మదేవర ధీరజ్ ఒక మెరిసే నక్షత్రం అంటూ సీఎం జగన్ మెచ్చుకున్నారు. మన తెలుగు జెండా రెపరెపలాడుతోందన్నారు.’ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. My best wishes and congratulations to @ArcherAtanu, @BommadevaraD and Tushar Shelke for bringing home silver in the recurve men’s event at the #ASIANGAMES2023. Andhra Pradesh and all of India is incredibly proud of you! A special mention to our very own @BommadevaraD, a… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2023 -
వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు అనన్యశ్రీ
మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని మక్తల్‌కు చెందిన అనన్యశ్రీ వాలీబాల్‌లో విశేష ప్రతిభ కనబరుస్తుంది. 2019లో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా అథ్లెట్ పథకం కింద కేరళలోని పట్టణమిట్టలోగల వాలీబాల్ అకాడమీకి ఎంపికై శిక్షణ తీసుకుంటుంది. ఈమె తెలంగాణతో పాటు కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. తెలంగాణ నుంచి 2018 పంజాబ్‌లో జూనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. 2019లో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి, 2020 కడపలో జూనియర్ నేషనల్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. కేరళ రాష్ట్రం తరపున గతేడాది ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్‌లో 23వ జాతీయస్థాయి, మహారాష్ట్ర సాంగ్లి జిల్లా ఇస్లాంపూర్‌లో 24వ జాతీయస్థాయి యూత్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. కేరళలో సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ, మహారాష్ట్ర రాష్ట్రం కొల్హాపూర్‌లో సీనియర్ లీగ్ (హరియంట్ చసాక్) వాలీబాల్ టోర్నీలో పాల్గొంది. ఈ మూడు టోర్నీల్లో కేరళ జట్టు విన్నర్‌గా నిలిచింది. అస్సాం రాష్ట్రం గౌవహాటిలో ఈ ఏడాది ఫిబవరిలో 71వ ఉమెన్ సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు కేరళ రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ప్రాతినిథ్యం వహించింది. సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో కేరళ మహిళా జట్టు విజేతగా నిలవడంతో అనన్యశ్రీ బంగారు పతకం సాధించింది. పాండిచ్చేరిలో ఫెడరేషన్ కప్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా కేరళ రాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు.. అనన్యశ్రీ తొలిసారిగా విదేశీగడ్డపై వాలీబాల్ పోటీల్లో పాల్గొననుంది. చైనా దేశం చెంగ్డ్ నగరంలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు నిర్వహించే శ్రీవరల్డ్ యూనివర్సిటీ చాంపియన్షిప్శ్రీకు ఎంపికైంది. కేరళ యూనివర్సిటీ నుంచి చైనాకు వెళ్లే ఆలిండియా యూనివర్సిటీ వాలీబాల్ జట్టులో అనన్యశ్రీ చోటు దక్కించుకుంది. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఈనెల 19 నుంచి 24 వరకు నిర్వహించిన ప్రత్యేక కోచింగ్ క్యాంపులో పాల్గొంది. -
ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, జ్యోతిక శ్రీ
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ, దండి జ్యోతిక శ్రీ ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. జూలై 12 నుంచి 16 వరకు బ్యాంకాక్‌లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి మొత్తం 54 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్, 200 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజీ... మహిళల 4*400 మీటర్ల రిలే, 4*400 మీటర్ల మిక్స్డ్ రిలేలో జ్యోతిక శ్రీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బోపన్న జోడీ శుభారంభం సించ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లండన్‌లో గురువారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న ద్వయం 7–6 (10/8), 7–6 (7/5)తో జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
ఆసియా క్రీడల్లో ఆడలేమన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
మెల్బోర్న్: పోటీతత్వం మరింత మెరుగు పడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఆహ్వానించింది. ఈ రెండు దేశాల కోసం 300 అథ్లెట్ల కోటా కింద ఒక్కో దేశానికి 150 మంది చొప్పున పంపాలని ఓసీఏ కోరింది. అయితే ఓసీఏ ఆహ్వానాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీలు తిరస్కరించాయి. ఆసియా క్రీడల్లో తమ దేశాల క్రీడాకారులను పంపించలేమని తెలిపాయి. -
గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారులు అథ్లెట్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. స్టేడియాన్ని కాపాడాలని ధర్నా చేపట్టారు. టిమ్స్ ఆసుపత్రి కోసం ఇప్పటికే 9 ఎకరాలు కేటాయించగా.. గచ్చిబౌలి స్టేడియంలోని మరో 5 ఎకరాలు టిమ్స్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక స్టేడియం గచ్చిబౌలి స్టేడియమని, దాన్ని కూడా హాస్పిటల్‌కు ఇవ్వడం అన్యాయం అంటూ ఆందోళన చేపట్టారు. ఆరోగ్యంగా ఉండాలంటే స్పోర్ట్స్ ఫిట్నెస్ తప్పనిసరి అని అథ్లెట్లు చెబుతున్నారు. సిధూ ఒలంపిక్ పథకం సాధించింది అంటే అది గచ్చిబౌలి స్టేడియం వల్లనే అని, అలాంటి స్టేడియం విచ్చినం చేయడం సరైనది కాదని అంటున్న ఆధ్లెట్స్ , వారి తల్లిద్రందుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మెడల్స్ మెడలో పడ్డాక అలా ఎందుకు చేస్తారో తెలుసా..?
టోక్యో: ఒలింపిక్స్‌లో విజేతలు పతకాలు తమ మెడలో పడ్డాక వాటిని కొరుకుతూ, చిరునవ్వులు చిందిస్తూ కెమెరాలకు పోజులిస్తుంటారు. ముఖ్యంగా గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులైతే తప్పనిసరిగా ఈ పోజ్‌లో కనపడతారు. స్విమ్మింగ్ రికార్డు బ్రేకర్ మైఖేల్ ఫెల్ప్స్ నుంచి జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్... ఇలా స్వర్ణ పతక విజేతలంతా ఈ విధంగా తమ మెడల్స్‌ను కొరికినవారే. వాటిని ఎందుకు కొరుకుతారనే అనుమానం అభిమానులకు కలగక మానదు. అయితే, విజేతలు ఇలా చేయడానికి గల కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికి గాను చాలా కాలంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ చెప్పిన దాని ప్రకారం.. పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజులివ్వరని, ఫొటో గ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్‌ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారని అభిప్రాయపడ్డారు. ఇలా మెడల్స్ కొరకడంపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. గోల్డ్ మెడల్ గెలుచుకున్న అథ్లెట్ మెడల్ ను కొరుకుతున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేసి..'ఇవి తినే మెడల్స్ కావని అధికారికంగా ప్రకటిస్తున్నాం. ఈ మెడల్స్ జపాన్ ప్రజలు విరాళంగా ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసి తయారు చేశాం. అందుకే వాటిని కొరకవద్దని చెబుతున్నాం. అయినా వాటిని కొరకాలనుకుంటే నాలుకతో టేస్ట్ చేసి చూడండి.'అంటూ ట్వీట్ చేశారు. దీనికి #UnitedByEmotion అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. -
22 కోట్ల జనాభా ఉంటే ఒలింపిక్స్‌లో పాల్గొనేది 10 మందేనా..
కరాచీ: ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ నుంచి కేవలం 10 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొనడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ ఫైరయ్యాడు. విశ్వ వేదికపై పాక్ దుస్థితికి కారణమైన పాలకులను ఎండగడుతూ.. ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ల ఫోటోను ప్రస్తుత ఒలింపిక్స్ పాల్గొన్న అథ్లెట్ల ఫొటోను ఒకే ఫ్రేమ్‌లో చేరుస్తూ.. ట్విటర్లో షేర్ చేశాడు. 22 కోట్ల జనాభా గల దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేది కేవలం 10 మంది ఆటగాళ్లేనా అంటూ పాక్ పాలకులపై మండిపడ్డాడు. విశ్వక్రీడల్లో పాక్ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతిఒక్కరికీ ఇది సిగ్గుచేటని పాక్ పాలకులను ఉద్దేశిస్తూ చురకలంటించాడు. This is actually sad. Just 10 athletes from a country of 220 million people. To everyone who is responsible for Pakistan's such decline in sports , SHAME ON YOU! pic.twitter.com/4qkqC1cj7N — Imran Nazir (@realimrannazir4) July 24, 2021 పాక్‌లో ప్రతిభకు కొదవలేదని, అయితే క్రీడల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే బాధ్యతగల నాయకులే లేరని విమర్శించాడు. దేశంలోని చాలా మంది ప్రముఖులు క్రీడా సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ, ఎంతమంది ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించాడు. ఆర్థిక సహకారం అవసరం ఉన్న అథ్లెట్ల వివరాలిస్తే.. ఎంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారని నిలదీశాడు. తమ దేశ దుస్థితికి పాలకులతో పాటు బాధ్యత గల ప్రముఖులు కూడా కారణమని పాక్ పరువును బజారుకు ఈడ్చాడు. కాగా, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ తరఫున 21 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌కు అత్యధికంగా పాక్ తరఫున 62 మంది అర్హత సాధించారు. పాక్ ఖాతాలో ఇప్పటి వరకు 10 పతకాలు ఉన్నాయి. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలున్నాయి. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత పాక్ ఒక్క పతకం కూడా గెలవలేదు. ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న పాక్ పురుషుల హాకీ జట్టు సాధించిన కాంస్యమే పాక్ ముద్దాడిన చిట్టచివరి ఒలింపిక్ పతకం. దాదాపు 30 సంవత్సరాలుగా పాక్ పతకం గెలవలేదు. ఈసారి కూడా ఆశలు లేవు. కాగా, 1999-2012 మధ్య పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇమ్రాన్ నాజీర్.. హార్డ్ హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో 14 బంతుల్లో అర్ధ శతకం సాధించిన రికార్డు అతని పేరిట ఉంది. పాక్ తరఫున అతను 8 టెస్టులు, 79 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్టులో 427, వన్డేల్లో 1895, టీ20ల్లో 500 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 4 సెంచరీలు, 13 అర్ధ శతకాలు చేశాడు. -
Tokyo Olympics 2021: స్వర్ణం గెలవండి.. ఆరు కోట్లు పొందండి
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొనే ఒడిశా అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రోత్సహకాలు ప్రకటించారు. జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు. బంగారు పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు, రజతం సాధిస్తే రూ. 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ . 2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ రూ.15లక్షలు చొప్పున నగదు ఇస్తామని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. విశ్వక్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి కల అని, పతకం గెలవడం ద్వారా ఆ కల సాకారమవుతుందని అన్నారు. తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ద్యుతి చంద్, ప్రమోద్ భగత్, దీప్ గ్రేస్ ఎక్కా, నమిత టొప్పో, వీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌లకు సీఎం అభినందనలు తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ నెల 17న భారత తొలి బృందం బయల్దేరనుంది. 14నే ఈ బృందాన్ని పంపాలని భారత ఒలింపిక్ సంఘం భావించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో 17వ తేదీన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది. ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజులు క్రీడాకారులందరూ క్వారంటైన్లో ఉండాలి. మిగతా క్రీడాకారులు మరో రెండు రోజుల తర్వాత టోక్యోకు వెళ్తారు. మరోవైపు ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న భారత షూటింగ్ జట్టు 16న టోక్యోకు బయల్దేరనుంది. మొత్తంగా భారత్ నుంచి 120కి పైగా అథ్లెట్లు విశ్వక్రీడలకు వెళ్లనున్నారు. -
ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై మోదీ సమీక్ష
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని.. మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల శుభాకాంక్షలతో పాటు, దీవెనలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలో, క్రీడా కారులందరికి వ్యాక్సినేషన్‌తో పాటు, సరైన శిక్షణ , ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఒక్కో క్రీడాకారుడి ప్రతిభతో మరో వంద మంది స్ఫూర్తిని పొందుతారని అన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గోనే క్రీడాకారుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో దేశమంతా వారివెంటే నిలుస్తుందని అన్నారు. టోక్యోలో జరగబోయే ఈ క్రీడల్లో మన దేశం నుంచి 11 క్రీడా విభాగాలలో మొత్తం 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారని తెలిపారు. అయితే, జూన్ చివరి నాటికి మరో 25 మంది వివిధ క్రీడలకు అర్హత సాధించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు మరో 50 రోజుల గడువు మిగిలి ఉందన్న సంగతి తెలిసిందే. -
అథ్లెట్ల భోజనంలో వెంట్రుకలు, గోళ్లు...
న్యూఢిల్లీ : పాటియాలాలోని నేతాజీ సుభాష్ జాతీయ క్రీడాసంస్థ (ఎన్ఎస్–ఎన్ఐఎస్) డొల్లతనం బయటపడింది. ఇటీవలే అక్కడి సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో పాటు ఇద్దరు బాక్సర్లు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ వార్తలు రాగా... తాజాగా అథ్లెట్లకు అందించే ఆహారం మరీ నాసిరకంగా ఉన్నట్లు తెలిసింది. భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో పాటు ఇతర అథ్లెట్లు ఆహారం నాణ్యతపై, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. తనకు అందించిన ఆహారంలో వెంట్రుకలు, గోళ్లు ఉండటంతో హిమదాస్ ఈ అంశాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వాటి ఫోటోలను కెమెరాతో చిత్రీకరించిన హిమ ఆ దృశ్యాలను ఎన్ఐఎస్ పాలక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిందంట. (నా మనసు చెబుతోంది అది కుట్రేనని...) ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కిరణ్ రిజుజు వెంటనే భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను మందలించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ‘ఎన్ఐఎస్ భోజనశాలలో అపరిశుభ్రత, ఆహారం నాసిరకంగా ఉండటంపై అథ్లెట్లు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకున్నాం. అథ్లెట్లు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం. ఆటగాళ్ల అవసరాలకు అనుగుణంగా వారికి అందించాల్సిన ఆహారం నాణ్యత, పరిమాణంపై సూచనలు జారీ చేశాం. ఇప్పుడు వారికి అందుతున్న ఆహారం పట్ల అథ్లెట్లు కూడా సంతోషంగా ఉన్నారు’ అని ‘సాయ్’ పేర్కొంది. (ఫ్రెంచ్ ఓపెన్‌కూ యాష్లే బార్టీ దూరం) -
‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు రూ. 30 వేలు: సాయ్
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) 2,749 మంది ‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.30 వేలు చెల్లించింది. ఖేలో ఇండియా స్కాలర్షిప్లో భాగంగా ఏడాదికి రూ. 1.20 లక్షలు ఒక్కో అథ్లెట్‌కు చెల్లిస్తారు. 2020–21 సీజన్లో తొలి త్రైమాసికానికి ఆ మొత్తాన్ని అథ్లెట్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని ‘సాయ్’ తెలిపింది. ఖేలో ఇండియా అథ్లెట్ల జాబితాలో మొత్తం 21 క్రీడాంశాలకు చెందిన 2,893 మంది ఉన్నారని, వీరిలో 2,749 మందికి చెల్లింపులు చేశామని, మిగతా 144 మందికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని సాయ్ అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేందుకు, వ్యక్తిగత, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రతి త్రైమాసికానికి రూ. 30 వేలు భత్యంగా చెల్లిస్తారు. -
ఆపరేషన్ ‘గాండీవ’
ఒంగోలు టౌన్ : దేశంలో వంద కోట్లకు పైగా జనాభా ఉన్నా పూర్తి స్థాయిలో ఒలింపిక్స్ ఆటల్లో రాణించేవారు అతి తక్కువ మందే. అదే సమయంలో అథ్లెట్స్‌కు కొదువే లేదు. కానీ ఇలాంటి వారి ప్రతిభ గ్రామాలు, పట్టణాలు దాటి బయటకు రావడంలేదు. వారు అక్కడికే పరిమితం అవుతున్నారు. దీంతో ఇలాంటి క్రీడాకారులను గుర్తించి వారిలోని ప్రతిభకు మరింత పదును పెట్టి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేవారిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ సంసిద్ధం అయింది. ప్రాజెక్టు గాండీవ పేరుతో పాఠశాలల స్థాయిలోనే క్రీడా ప్రతిభాన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌లో పథకాలు సాధించడమే లక్ష్యంగా నిర్వహించనున్న ఆపరేషన్ గాండీవను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో అథ్లెటిక్స్ను గుర్తించి వారికి అంతర్జాతీయ శిక్షకుల వద్ద తర్ఫీదు పొందిన పీఈటీలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని వివిధ రకాల క్రీడాంశాల్లో రాటుదేలేలా చేయడం ప్రాజెక్టు గాండీవ ముఖ్యోద్దేశం. ప్రాజెక్టు గాండీవ కింద ఎంపికైన విద్యార్థులకు బలవర్థకరమైన ఆహారాన్ని అందిస్తూ, ప్రత్యేక శిక్షణకు అవసరమైన క్రీడా పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 303 పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రాజెక్టు గాండీవ అమలుకోసం రాష్ట్రంలో 303 పాఠశాలలను ఇటీవల గుర్తించారు. ఇందులో కనీస క్రీడా వసతులైన 200 మీటర్ల ట్రాక్, ఇతర ఆటల మైదానాలు కలిగిన 100 విద్యాలయాలను గుర్తించి వాటిని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కి అనుసంధానం చేయనుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10 సంవత్సరాలు పైబడిన బాల బాలికలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులైన 70 నుంచి 90 మంది వరకు క్రీడాకారులను గుర్తిస్తారు. వారిని జిల్లా కేంద్రంలో జరిగే ప్రతిభ అన్వేషణ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి పంపించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో.. ప్రాజెక్టు గాండీవకు సంబంధించిన క్రీడా ప్రతిభాన్వేషణకు జిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించిన అనంతరం జిల్లా స్థాయి కమిటీ వారిలోని ప్రతిభను గుర్తించి 90 మంది వరకు ఎంపిక చేయనుంది. వారికి జిల్లాలో గుర్తించిన పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరుసగా ఐదురోజులపాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దానికితోడు పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు బడి పిలుస్తోంది కార్యక్రమంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిమగ్నమై ఉన్నారు. మరో రెండు రోజులపాటు బడి పిలుస్తోంది కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత పాఠశాలలు పూర్తి స్థాయిలో యథావిధిగా నడవనున్నాయి. విస్తృతంగా ప్రచారం ప్రాజెక్టు గాండీవకు సంబంధించి విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభాన్వేషణకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆం«ధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం గురించి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అవగాహన కలిగిచేందుకు అన్ని పాఠశాలల్లో ఉదయం పూట నిర్వహించే అసెంబ్లీలో సంబంధిత ప్రధానోపాధ్యాయుడు లేదా ఫిజికల్ లిట్రసీ టీచర్ లేదా టీచర్లతో ప్రకటన చేయించాలని సూచించింది. తద్వారా ఆసక్తి కలిగిన విద్యార్థులు తమలో దాగి ఉన్న క్రీడను వెలికి తీసుకువచ్చేందుకు, దానికి పదును పెట్టేందుకు దోహదపడుతోందని భావించింది. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత తరగతుల నిర్వహణ అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరుసగా ఐదురోజులపాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమవారం నుండి పాఠశాలలు యథావిధిగా కొనసాగనుండటంతో ప్రాజెక్టు గాండీవకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆదేశించింది. -
క్రీడారత్నాలు..
పేదింటి విద్యార్థులు పలు క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. సంక్షేమ హాస్టళ్లలో వసతి పొందుతూ.. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఉన్న కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు సాధించారు. నిరంతరం సాధన చేస్తూ.. దేశజట్టుకు పాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సాక్షి, నల్లగొండ : పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన దగ్యాల సాయికిరణ్ నల్లగొండలోని బీసీ వసతిగృహంలో ఉంటూ స్థానిక బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడల్లో ఉన్న ఆసక్తితో కబడ్డీలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనభర్చి పలు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఎప్పటికైనా దేశం తరపున కబడ్డీ పోటీల్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. సాయికిరణ్ పాల్గొన్నపోటీలు.. 2016 డిసెంబర్లో నల్లగొండలో జరిగిన ఎస్జీఎఫ్ 62వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2015–16లో గుజరాత్లో జరిగిన 61వ ఎస్జీఎఫ్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున ఆడాడు. 2015లో ఖమ్మంలోని సత్తుపల్లిలో ఒకటో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలిపాడు. 2015లో ఆదిలాబాద్ డిస్టిక్ట్ సబ్ జూనియర్ అండర్–16 కబడ్డీ పోటీల్లో పాల్గొని జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలిపాడు. 2016లో వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టును మొదటిస్థానంలో నిలిపాడు. 2017 జనవరిలో మంచిర్యాల జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ అండర్–16 విభాగంలో పాల్గొని జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలిపాడు. సబ్ జూనియర్ అండర్–16 కబడ్డీ పోటీలకు ఆలిండియా స్పోర్డ్స్ అథారిటీ జట్టుకు ఎంపికయ్యాడు. కబడ్డీలో రాణిస్తున్న మధు నల్లగొండ టూటౌన్ : పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన తరి మధు నల్లగొండలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ స్థానిక ఎస్సీ వసతి గృహంలో ఉంటున్నాడు. కబడ్డీ మీద మక్కువతో పలు పోటీల్లో రాణించి.. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. కబడ్డీతో పాటు వెయిట్ లిఫ్టింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దేశం తరపున ఆడాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నాడు. మధు పాల్గొన్న పోటీలు.. 2016 డిసెంబర్లో నల్లగొండలో నిర్వహించిన 62వ ఎస్జీఎఫ్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు తరుపున పాల్గొన్నాడు. 2013–14 విజయనగరం జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–14 విభాగంలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014–15లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–14లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు.. 2014–15లో ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పైకా పోటీల్లో జిల్లా జట్టు నుంచి పాల్గొని మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. 2015–16లో ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకోవడంలో కీలకపాత్ర వహించాడు. 2016 డిసెంబర్లో వరంగల్‌లో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–17 కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. 2015–16లో ఖమ్మంలో జరిగిన 55 కేజీల వెయిటింగ్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో మెడల్ సాధించాడు. ఫుట్‌బాల్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన సాయిచంద్రసిద్దార్థ నల్లగొండకు చెందిన బొమ్మపాల సాయిచంద్రసిద్దార్థ ఫుట్‌బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ చాటుతున్నాడు. 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఫుట్‌బాల్ అకాడమీకి ఎంపికైన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. పలు జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించాడు. సిద్దార్థ పాల్గొన్న పోటీలు.. 2015లో ఛత్తీస్‌గడ్‌లో జరిగిన జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరపున పాల్గొన్నాడు. 2016 జమ్ముకాశ్మీర్‌లో నిర్వహించిన అండర్–19 జాతీయస్థాయి ఫుట్‌బాట్ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి పాల్గొన్నాడు. ఇటీవల కేరళలో జరిగిన సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ పోటీల్లో పలు రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో తన ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్, సిల్వర్మెడల్ గెలుపొందాడు. జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ పేదింటి పిల్లలు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎదగడం ఎంతో గర్వకారణం. రోజూ వీరి కోసం ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాను. వేసవికాలంలో కూడా 30 మంది విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తూ క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నాం. తమ పాఠశాల నుంచే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు నలుగురు విద్యార్థులు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు పట్టుదలతో సాధన చేస్తున్నారు. – బొమ్మపాల గిరిబాబు, కబడ్డీ కోచ్, పీఈటీ, బొట్టుగూడ -
సౌత్ ఏషియన్ బాక్సింగ్ అథ్లెటిక్స్‌కు ఎనిమిది మంది ఎంపిక
మామిడికుదురు : నేపాల్‌లోని భూటాన్‌లో ఈనెల 29 నుంచి 30 వరకు జరిగే సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీలకు ఆరుగురు, అథ్లెటిక్స్‌కు ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. హర్యానాలో ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగిన రూరల్ నేషనల్ బాక్సింగ్, తమిళనాడులోని కాంచీపురంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకోవడం ద్వారా వీరిని ఏషియన్ పోటీలకు ఎంపిక చేశారని అంతర్జాతీయ బాక్సింగ్ రిఫరీ చిట్టూరి చంద్రశేఖర్, అథ్లెటిక్స్ కోచ్ వి.పృధ్వీరాజ్ శుక్రవారం తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో గెద్దాడ గ్రామానికి చెందిన సీహెచ్ యోగితాకుమారి, చిట్టూరి సాయివరలక్ష్మి, పి.గన్నవరం మండలం బెల్లంపూడికి చెందిన చీకురుమిల్లి హాసిని, సఖినేటిపల్లికి చెందిన నల్లి రాకేష్, మలికిపురానికి చెందిన అల్లూరి మనోజ్‌వర్మ, తాటిపాకకు చెందిన గుబ్బల గణేష్‌బాబు ఏషియన్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ ఆరుగులు విద్యార్థులు హర్యానాలో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు గెలుపొందారన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో జరిగిన నేషనల్ రూరల్ అథ్లెటిక్స్‌లో నగరం గ్రామానికి చెందిన చిట్టూరి యువశంకర్ అండర్–17 విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు రన్నింగ్, అండర్–14 విభాగంలో నాగాబత్తుల లితిన్ 100 మీటర్ల రన్నింగ్ పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకోవడం ద్వారా ఏషియన్ అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను స్థానికులు అభినందించారు. -
27మంది రష్యా క్రీడాకారుల్లో మెల్డోనియం
మాస్కో: ఈ ఏడాది తమ దేశ క్రీడాకారులకు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో 27మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైందని రష్యా క్రీడాశాఖమంత్రి విటలీ ముట్కో తెలిపారు. వీరి శరీరాల్లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (డబ్ల్యూఏడీఏ) నిషేధించిన మెల్డోనియం నమునాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని తెలిపారు. 'ప్రపంచ వ్యాప్తంగా 127మంది ఇప్పటికీ మెల్డోనియం ఉపయోగిస్తున్నారని తేలగా వారిలో రష్యాకు చెందిన వారు 27 మంది ఉన్నారు. బహుషా.. ఈ సంఖ్య మారొచ్చు' అని ఆయన చెప్పారు. అయితే, వారి వివరాలు చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. -
'వద్దు.. వద్దు.. మేం విచారిస్తూనే ఉన్నాం'
నైరోబి: తమ దేశ అథ్లెట్లపై వచ్చిన డోపింగ్ ఆరోపణలపై కెన్యా భద్రతా అధికారులు విచారణ వేగవంతం చేశారు. విచారణ పూర్తై వారు తప్పు చేసినట్లు తేలితే అది దేశానికి చెడ్డ పేరు తెస్తుందని వారు భావిస్తున్నారు. డోపింగ్ మహమ్మారిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని గతంలో తాము విధించిన గడువులోగా కెన్యా స్పందించకపోవడంతో ప్రపంచ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ(వాడా) ఈ కేసును తన స్వతంత్ర క్రమశిక్షణ కమిటీకి బదిలీ చేస్తానని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్పందించిన కెన్యా ఆ అవసరం లేదని, ఇప్పటికే తమ పోలీసులు కీలక ఆధారాలను పరిశీలిస్తున్నారని, త్వరలో అనుమానితులను అరెస్టు చేస్తారని వాడాకు వివరించారు. డోపింగ్ నిజమని తేలితే రష్యా వలె కెన్యాపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ అలా జరగబోదని వాడా తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తన క్రమశిక్షణ కమిటీ చేతిలోకి వెళ్లిందని పేర్కొంది. గతంలో కెన్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.