
మెల్‌బోర్న్: పోటీతత్వం మరింత మెరుగు పడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఆహ్వానించింది. ఈ రెండు దేశాల కోసం 300 అథ్లెట్ల కోటా కింద ఒక్కో దేశానికి 150 మంది చొప్పున పంపాలని ఓసీఏ కోరింది. అయితే ఓసీఏ ఆహ్వానాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీలు తిరస్కరించాయి. ఆసియా క్రీడల్లో తమ దేశాల క్రీడాకారులను పంపించలేమని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment