న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) 2,749 మంది ‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.30 వేలు చెల్లించింది. ఖేలో ఇండియా స్కాలర్‌షిప్‌లో భాగంగా ఏడాదికి రూ. 1.20 లక్షలు ఒక్కో అథ్లెట్‌కు చెల్లిస్తారు. 2020–21 సీజన్‌లో తొలి త్రైమాసికానికి ఆ మొత్తాన్ని అథ్లెట్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని ‘సాయ్’ తెలిపింది.
ఖేలో ఇండియా అథ్లెట్ల జాబితాలో మొత్తం 21 క్రీడాంశాలకు చెందిన 2,893 మంది ఉన్నారని, వీరిలో 2,749 మందికి చెల్లింపులు చేశామని, మిగతా 144 మందికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని సాయ్ అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేందుకు, వ్యక్తిగత, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రతి త్రైమాసికానికి రూ. 30 వేలు భత్యంగా చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment