
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారులు అథ్లెట్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. స్టేడియాన్ని కాపాడాలని ధర్నా చేపట్టారు. టిమ్స్ ఆసుపత్రి కోసం ఇప్పటికే 9 ఎకరాలు కేటాయించగా.. గచ్చిబౌలి స్టేడియంలోని మరో 5 ఎకరాలు టిమ్స్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక స్టేడియం గచ్చిబౌలి స్టేడియమని, దాన్ని కూడా హాస్పిటల్‌కు ఇవ్వడం అన్యాయం అంటూ ఆందోళన చేపట్టారు. ఆరోగ్యంగా ఉండాలంటే స్పోర్ట్స్ ఫిట్‌నెస్ తప్పనిసరి అని అథ్లెట్లు చెబుతున్నారు. సిధూ ఒలంపిక్ పథకం సాధించింది అంటే అది గచ్చిబౌలి స్టేడియం వల్లనే అని, అలాంటి స్టేడియం విచ్చినం చేయడం సరైనది కాదని అంటున్న ఆధ్లెట్స్ , వారి తల్లిద్రందుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment