Dandi Jyothika Sri: గోదావరి తీరం నుంచి ఒలింపిక్స్‌ దాకా... | Tanuku Athlete Dandi Jyothika Sri Inspirational Journey | Sakshi
Sakshi News home page

Dandi Jyothika Sri: గోదావరి తీరం నుంచి ఒలింపిక్స్‌ దాకా...

Published Sun, Jul 28 2024 6:39 AM | Last Updated on Sun, Jul 28 2024 11:21 AM

Tanuku Athlete Dandi Jyothika Sri Inspirational Journey

జ్యోతిక శ్రీ దండి భారతీయ క్రీడాకారిణి. మహిళల 400 మీ. పరుగులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ΄్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో 4 x 400 భారత మహిళల రిలే జట్టులో భాగంగా పాల్గొంటోంది. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. జ్యోతిక ఇప్పటి వరకు రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది.

అయినా సరే... వెనుకంజ వేయనివ్వలేదు...
మేం ఐరన్‌కి సంబంధించిన వర్క్స్‌ చేస్తాం. జ్యోతిక చిన్నప్పుడు స్థానికంగా జరిగే రన్నింగ్‌ పోటీలు చూసి, తనూ ఉత్సాహం చూపేది. తన ఆసక్తి చూసి, కోచ్‌ దగ్గర చేర్చాం. అలా క్రీడలవైపు ్రపోత్సహించాం. 2013లో స్థానికంగా జరిగే పోటీలో పాల్గొంది. అక్కణ్ణుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటూ వచ్చింది. పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలిచింది. వరల్డ్‌ కాంపిటిషన్స్‌కి స్కూల్‌ రోజుల్లోనే వెళ్లింది. టర్కీకి వెళ్లినప్పుడు లక్ష రూపాయలు తప్పనిసరి అన్నారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్‌ చేశారు. ఇంటర్మీడియట్‌లో మంచి గ్రేడ్‌ వచ్చింది. 

చదువును కొనసాగిస్తూనే, ఉద్యోగం తెచ్చుకుంటాను అంది. కానీ, స్పోర్ట్స్‌లోనే ఉండమని, అదే మంచి భవిష్యత్తును ఇస్తుంది అని చె΄్పాను. విజయవాడలోని అకాడమిలో నాలుగేళ్లు, హైదరాబాద్‌లోని స్పోర్ట్స్‌ అకాడమీలో రెండేళ్లు ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా తన పట్టుదల నన్ను వెనుకంజ వేయనివ్వలేదు. రెండేళ్లుగా ఇండియన్‌ క్యాంపులో ఉండటం వల్ల నాకు కొంచెం వెసులు బాటు వచ్చింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో తన సత్తా చాటడానికి వెళ్లింది. ఇన్నాళ్ల కృషికి తగిన ఫలితం నేడు చూస్తున్నాం. స్పోర్ట్స్‌లో రాణిస్తూనే డిగ్రీ చదువుతోంది. స్పిరిచ్యువల్‌ ఆర్ట్స్‌ వేస్తుంది.దేశానికి పతకం తీసుకురావాలనే లక్ష్య సాధన కోసమే కృషి చేస్తోంది. 
– దండి శ్రీనివాసరావు, జ్యోతిక శ్రీ తండ్రి, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా

పిల్లల లక్ష్యం కోసం...
మాకు ఇద్దరు కూతుళ్లు. చిన్నప్పుడు జ్యోతిక పరుగు మొదలు పెట్టినప్పుడు ఊళ్లో మాకో బిల్డింగ్‌ ఉండేది. పిల్లల లక్ష్యాల కోసం ఆ బిల్డింగ్‌ అమ్మి ఖర్చుపెడుతూ వచ్చాం. పిల్లలే మాకు బిల్డింగ్‌ అనుకున్నాం. స్పోర్ట్స్‌ అంటే మంచి పోషకాహారం, ఫిట్‌నెస్, ట్రయినింగ్‌ ఉండాలి. ఖర్చు అని చూసుకోలేదు. 
– లక్ష్మీ నాగ వెంకటేశ్వరి, జ్యోతిక శ్రీ తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement