Jyothika Sri
-
నీరజ్ చోప్రా పైనే భారత్ ఆశలు
పారిస్: విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురుచూసే అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు నేడు తెర లేవనుంది. ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు దాటినా.. అసలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్ ఈవెంట్ నేటి నుంచి జరుగుతుంది. భారత అభిమానుల విషయానికొస్తే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే అందరి దృష్టి ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో భారత అథ్లెటిక్స్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్ మరోసారి అదే స్థాయి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతుండగా.. భారత్ నుంచి మొత్తం 29 మంది అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ‘టోక్యో’ క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అదే నిలకడ కొనసాగిస్తూ వస్తున్న నీరజ్ వరుసగా రెండో స్వర్ణం నెగ్గాలని తహతహలాడుతున్నాడు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్‌త్రో క్వాలిఫికేషన్ రౌండ్... రెండు రోజుల తర్వాత 8న ఫైనల్ జరగనుంది. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. రేస్ వాక్‌తో మొదలు.. అథ్లెటిక్స్‌లో భాగంగా తొలి రోజు మహిళల, పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి పురుషుల విభాగంలో అ„Š దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్‌జీత్ సింగ్ బిష్త్ పోటీలో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి ప్రియాంక గోస్వామి బరిలోకి దిగనుంది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్ సాబ్లేపై భారీ అంచనాలు ఉండగా... 4–400 మీటర్ల పురుషుల ఈవెంట్లో మన జట్టు పతక ఆశలు రేపుతోంది. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్‌లో అవినాశ్ జాతీయ రికార్డు బద్దలు కొట్టి 8 నిమిషాల 9.91 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంలో నిలిచాడు. హర్డిల్స్‌లో జ్యోతి...రిలేలో జ్యోతిక శ్రీ ఇక ఒలింపిక్స్ చరిత్రలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొంటున్న తొలి భారత అథ్లెట్‌గా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ గుర్తింపు పొందనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలే జట్టులో కీలక సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్తో పాటు 5000 మీటర్ల పరుగులో పాల్గొంటున్న పారుల్ చౌదరి, మహిళల జావెలిన్‌త్రోలో అన్ను రాణి, పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్ పాల్‌సింగ్ తూర్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావేల్, అబూబాకర్ నుంచి కూడా మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు. కొత్తగా రెపిచాజ్ రౌండ్.. రెజ్లింగ్, రోయింగ్ మాదిరిగానే ఈసారి నుంచి ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లోనూ రెపిచాజ్ విభాగాన్ని ప్రవేశ పెట్టనున్నారు. 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల పరుగు వరకు వ్యక్తిగత విభాగాల్లో దీన్ని అమలు చేయనున్నారు. హర్డిల్స్‌కు కూడా ఇది వర్తించనుంది. గతంలో హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అథ్లెట్లతో పాటు వేగవంతమైన టైమింగ్ నమోదు చేసుకున్న అథ్లెట్లు సెమీఫైనల్‌కు చేరేవారు. తాజా రెపిచాజ్ రౌండ్‌తో హీట్స్‌లో ముందు నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత సాధిస్తారు. మిగిలిన వాళ్లందరూ రెపిచాజ్ రౌండ్లో పాల్గొంటారు. అందులో సత్తా చాటితే సెమీఫైనల్‌కు చేరేందుకు రెండో అవకాశం దక్కనుంది. అసలేంటీ రెపిచాజ్ఫ్రెంచ్ భాషలో రెపిచాజ్.. అంటే రెండో అవకాశం అని అర్థం. నిజంగానే ఇది అథ్లెట్లకు సెకండ్ చాన్స్ వంటిదే. ‘పారిస్’ క్రీడల ద్వారా అథ్లెటిక్స్‌లో ఈ రౌండ్‌ను మొదటిసారి ప్రవేశ పెట్టనున్నారు. గతంలో మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రెజ్లింగ్ క్రీడల్లో మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు రన్నింగ్, హర్డిల్స్‌లో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు దీన్ని అమలు చేయనున్నారు. దీంతో తొలి హీట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయిన వారికి సెమీఫైనల్ చేరడానికి మరో అవకాశం దక్కనుంది.3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, 5000 మీటర్ల పరుగులో రెపిచాజ్ రౌండ్‌ను అనుమతించడం లేదు. ఈ ఈవెంట్లలో పాల్గొన్న అథ్లెట్లు తేరుకునేందుకు మరింత సమయం అవసరమవనుండటంతో.. 1500 మీటర్ల వరకే దీన్ని పరిమితం చేశారు. ఇక పురుషుల, మహిళల 10,000 మీటర్లు, మారథాన్స్‌లో కేవలం ఫైనల్ మాత్రమే నిర్వహించనున్నారు. మహిళల 4 X400 మీటర్ల రిలే దండి జ్యోతిక శ్రీతొలి రౌండ్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం 2:10 నుంచి ఫైనల్: ఆగస్టు 11 అర్ధరాత్రి గం. 12.44 నుంచి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ జ్యోతి యర్రాజీతొలి రౌండ్: ఆగస్టు 7 మధ్యాహ్నం గం. 1:45 నుంచి రెపిచాజ్ రౌండ్: ఆగస్టు 8 మధ్యాహ్నం గం. 2:05 నుంచి సెమీఫైనల్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం. 3:35 నుంచి ఫైనల్: రాత్రి గం. 11:05 నుంచిజావెలిన్ త్రో షెడ్యూల్ నీరజ్ చోప్రా,కిషోర్ జేనా క్వాలిఫయింగ్: ఆగస్టు 6 మధ్యాహ్నం గం. 1:50 నుంచి ఫైనల్: ఆగస్టు 8 రాత్రి గం. 11:55 నుంచి -
Dandi Jyothika Sri: గోదావరి తీరం నుంచి ఒలింపిక్స్ దాకా...
జ్యోతిక శ్రీ దండి భారతీయ క్రీడాకారిణి. మహిళల 400 మీ. పరుగులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ΄్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో 4 x 400 భారత మహిళల రిలే జట్టులో భాగంగా పాల్గొంటోంది. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. జ్యోతిక ఇప్పటి వరకు రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది.అయినా సరే... వెనుకంజ వేయనివ్వలేదు...మేం ఐరన్‌కి సంబంధించిన వర్క్స్ చేస్తాం. జ్యోతిక చిన్నప్పుడు స్థానికంగా జరిగే రన్నింగ్ పోటీలు చూసి, తనూ ఉత్సాహం చూపేది. తన ఆసక్తి చూసి, కోచ్ దగ్గర చేర్చాం. అలా క్రీడలవైపు ్రపోత్సహించాం. 2013లో స్థానికంగా జరిగే పోటీలో పాల్గొంది. అక్కణ్ణుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటూ వచ్చింది. పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలిచింది. వరల్డ్ కాంపిటిషన్స్కి స్కూల్ రోజుల్లోనే వెళ్లింది. టర్కీకి వెళ్లినప్పుడు లక్ష రూపాయలు తప్పనిసరి అన్నారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేశారు. ఇంటర్మీడియట్లో మంచి గ్రేడ్ వచ్చింది. చదువును కొనసాగిస్తూనే, ఉద్యోగం తెచ్చుకుంటాను అంది. కానీ, స్పోర్ట్స్‌లోనే ఉండమని, అదే మంచి భవిష్యత్తును ఇస్తుంది అని చె΄్పాను. విజయవాడలోని అకాడమిలో నాలుగేళ్లు, హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో రెండేళ్లు ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా తన పట్టుదల నన్ను వెనుకంజ వేయనివ్వలేదు. రెండేళ్లుగా ఇండియన్ క్యాంపులో ఉండటం వల్ల నాకు కొంచెం వెసులు బాటు వచ్చింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో తన సత్తా చాటడానికి వెళ్లింది. ఇన్నాళ్ల కృషికి తగిన ఫలితం నేడు చూస్తున్నాం. స్పోర్ట్స్‌లో రాణిస్తూనే డిగ్రీ చదువుతోంది. స్పిరిచ్యువల్ ఆర్ట్స్ వేస్తుంది.దేశానికి పతకం తీసుకురావాలనే లక్ష్య సాధన కోసమే కృషి చేస్తోంది. – దండి శ్రీనివాసరావు, జ్యోతిక శ్రీ తండ్రి, తణుకు, పశ్చిమగోదావరి జిల్లాపిల్లల లక్ష్యం కోసం...మాకు ఇద్దరు కూతుళ్లు. చిన్నప్పుడు జ్యోతిక పరుగు మొదలు పెట్టినప్పుడు ఊళ్లో మాకో బిల్డింగ్ ఉండేది. పిల్లల లక్ష్యాల కోసం ఆ బిల్డింగ్ అమ్మి ఖర్చుపెడుతూ వచ్చాం. పిల్లలే మాకు బిల్డింగ్ అనుకున్నాం. స్పోర్ట్స్ అంటే మంచి పోషకాహారం, ఫిట్నెస్, ట్రయినింగ్ ఉండాలి. ఖర్చు అని చూసుకోలేదు. – లక్ష్మీ నాగ వెంకటేశ్వరి, జ్యోతిక శ్రీ తల్లి -
స్వర్ణ పతకం నెగ్గిన జ్యోతిక శ్రీ
ఇండియన్ గ్రాండ్‌ప్రి–3 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ దండి జ్యోతిక శ్రీ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది. బెంగళూరులో బుధవారం జరిగిన ఈ మీట్లో జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల రేసులో విజేతగా నిలిచింది. జ్యోతిక శ్రీ 400 మీటర్లను అందరికంటే వేగంగా 51.53 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుభా వెంకటేశ్ (తమిళనాడు; 52.34 సెకన్లు) రెండో స్థానంలో, పూవమ్మ రాజు (కర్ణాటక; 52.62 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. -
జ్యోతిక శ్రీ బృందానికి స్వర్ణం..!
బ్యాంకాక్: ఆసియా రిలే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో అజ్మల్, దండి జ్యోతిక శ్రీ, అమోజ్ జేకబ్, శుభాలతో కూడిన భారత బృందం మిక్స్డ్ రిలే 4్ఠ400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది ఆసియా క్రీడల్లో 3 నిమిషాల 14.34 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు తెరమరుగైంది. భారత్‌కు బంగారు పతకం దక్కడంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతిక శ్రీ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో భారత బృందం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి చేరుకుంది. జూన్ 30వ తేదీలోపు భారత బృందం టాప్–16లోకి చేరితే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.ఇవి చదవండి: World Para Championships: శభాష్ దీప్తి.. -
పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
నసావు (బహామస్): వరల్డ్ అథ్లెటిక్స్ రిలే పోటీల్లో రాణించిన భారత పురుషుల, మహిళల 4 x 400 రిలే జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, రూపల్ చౌధరీ, పూవమ్మ, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల రిలే జట్టు రెండో హీట్‌లో 3 నిమిషాల 29.35 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని దక్కించుకొని పారిస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 4 400 మీటర్ల విభాగంలో భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత పొందడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో భారత జట్టు అర్హత పొందలేదు. మరోవైపు అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జేకబ్‌లతో కూడిన భారత పురుషుల 4 x 400 మీటర్ల రిలే జట్టు కూడా పారిస్ ఒలింపిక్స్ టికెట్‌ను దక్కించుకుంది. రెండో హీట్‌లో అనస్, అజ్మల్, అరోకియా, అమోజ్ బృందం 3 నిమిషాల 3.23 సెకన్లలో లక్ష్యానికి చేరి రెండో స్థానంతో ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌కు అర్హత పొందడం భారత పురుషుల రిలే జట్టుకిది నాలుగోసారి. టోక్యో ఒలింపిక్స్‌లో, ప్రపంచ చాంపియన్íÙప్లో భారత రిలే జట్టు పతకాలు సాధించకపోయినా కొత్త ఆసియా రికార్డులను నెలకొలి్పంది. వరల్డ్ రిలే పోటీల ద్వారా మొత్తం 70 జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. -
జ్యోతిక శ్రీకి స్వర్ణ పతకం
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది. బెంగళూరులో ఆదివారం ముగిసిన ఈ మీట్లో జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. జ్యోతిక శ్రీ అందరికంటే వేగంగా 53.26 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సిమర్జీత్ కౌర్ (పంజాబ్; 53.77 సెకన్లు) రజతం, కవిత (పీఎస్‌పీబీ; 54.15 సెకన్లు) కాంస్యం సాధించారు. 220 పాయింట్లతో రైల్వేస్ జట్టు ఓవరాల్ టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, జ్యోతిక శ్రీ
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ, దండి జ్యోతిక శ్రీ ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. జూలై 12 నుంచి 16 వరకు బ్యాంకాక్‌లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి మొత్తం 54 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్, 200 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజీ... మహిళల 4*400 మీటర్ల రిలే, 4*400 మీటర్ల మిక్స్డ్ రిలేలో జ్యోతిక శ్రీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బోపన్న జోడీ శుభారంభం సించ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లండన్‌లో గురువారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న ద్వయం 7–6 (10/8), 7–6 (7/5)తో జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
National U23 Athletics Championships: జ్యోతికశ్రీకి స్వర్ణం
తిరువనంతపురం: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణంతో మెరిసింది. సీనియర్ మహిళల 400 మీటర్ల పరుగులతో జ్యోతిక శ్రీ మొదటి స్థానంలో నిలిచింది. 53.26 సెకన్ల టైమింగ్‌తో రేస్ పూర్తి చేసి ఆమె విజేతగా నిలిచింది. ఈ ఈవెంట్లో ఐశ్వర్య (మహారాష్ట్ర – 53.49 సె.), కిరణ్ పహల్ (హరియాణా – 54.29 సె.) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. అండర్–20 విభాగంలో ప్రియా మోహన్ (కర్నాటక – 53.55 సె.) పసిడి పతకాన్ని గెలుచుకుంది. జాతీయ రికార్డు నమోదు... ఇదే చాంపియన్‌షిప్ అండర్–16 బాలికల విభాగం 400 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. బెంగాల్‌కు చెందిన రెజోనా మలిక్ హీనా 53.22 సెకన్లలో రేస్ పూర్తి చేసి స్వర్ణం సాధించడంతో పాటు కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో అంజనా థమ్కే (54.57 సె.) పేరిట ఉన్న రికార్డును హీనా బద్దలు కొట్టింది. ఈ ఈవెంట్లో మాన్సి భరేకర్ (మహారాష్ట్ర ), నేత్ర (తమిళనాడు) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. -
National Games 2022: జ్యోతి పసిడి పరుగు
గాంధీనగర్: జాతీయ క్రీడల్లో శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు పతకాలతో మెరిశారు. మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించగా... 400 మీటర్ల విభాగంలో దండి జ్యోతిక శ్రీ రజత పతకం సొంతం చేసుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు రజత పతకం దక్కించుకున్నాడు. మరోవైపు తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెల్చు కుంది. రోలర్ స్కేటింగ్ కపుల్ డ్యాన్స్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అనుపోజు కాంతిశ్రీ–చలంచర్ల జూహిత్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ద్వయం 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ స్కేటర్ ఏలూరి కృష్ణసాయి రాహుల్ –యాష్వి శిరీష్ షా జోడీ 90.8 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జ్యోతి యెర్రాజీ అదే ఉత్సాహంతో జాతీయ క్రీడల్లోనూ అదరగొట్టింది. 100 మీటర్ల రేసును జ్యోతి 11.51 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. అర్చన (తమిళనాడు; 11.55 సెకన్లు) రజతం, డియాండ్ర (మహారాష్ట్ర; 11.62 సెకన్లు) కాంస్యం సాధించారు. 400 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతిక శ్రీ 53.30 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. ఐశ్వర్య మిశ్రా (మహారాష్ట్ర; 52.62 సెకన్లు) స్వర్ణం, రూపల్ చౌదరీ (ఉత్తరప్రదేశ్; 53.41 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు మొత్తం 270 కేజీలు (స్నాచ్‌లో 124+క్లీన్ అండ్ జెర్క్‌లో 146) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 73 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ జె.కోటేశ్వర రావు 280 కేజీల బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. శుక్రవారం రాత్రి జరిగిన రోలర్ స్పోర్ట్స్ ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల సాయిసంహిత రజతం, భూపతిరాజు అన్మిష కాంస్య పతకం సాధించారు. -
కేరళ నుంచి పీటీ ఉష... కర్ణాటక నుంచి అశ్వనీ నాచప్ప...ఏపీ నుంచి దండి జ్యోతిక!
కేరళ నుంచి ఒక పీటీ ఉష... కర్ణాటక నుంచి ఒక అశ్వనీ నాచప్ప... అస్సాం నుంచి ఒక హిమదాస్... వారి అడుగు జాడల్లో మరో పరుగుల విజేత... ఏపీ నుంచి దండి జ్యోతిక. దేశంలో దండిగా పతకాలు సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద... బంగారంలా మెరిసింది. దండి జ్యోతిక శ్రీ పుట్టింది, పెరిగింది ఆంధ్రప్రదేశ్, పశి్చమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో. పదవ తరగతి వరకు ఆమె విద్యాభ్యాసం, క్రీడాకారిణిగా తొలినాటి సాధన కూడా తణుకులోనే. క్రీడాకారిణిగా ఎదగాలనే ఆకాంక్షను కొనసాగించిందామె. విజయవాడలో ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజుల్లో రన్నింగ్ ప్రాక్టీస్ కొనసాగించింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న జ్యోతిక తాజాగా టర్కీలో జూన్ నాలుగో తేదీ జరిగిన సెవెన్త్ ఇంటర్నేషనల్ స్ప్రింట్ అండ్ రిలే కప్ నాలుగు వందల మీటర్లలో స్వర్ణం సాధించి, విజేతగా ఇండియాలో అడుగుపెట్టింది. నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్íÙప్లో పాల్గొనడానికి టర్కీ నుంచి నేరుగా చెన్నైకి చేరిన జ్యోతిక సాక్షితో మాట్లాడింది. ట్రాక్ వదల్లేదు జ్యోతిక తండ్రి శ్రీనివాసరావు బాడీ బిల్డర్. క్రీడాకారుడు కావాలనే ఆయన కల నెరవేరలేదు. తండ్రి కల నెరవేరకపోవడానికి ఆయనకు తల్లిదండ్రులకు క్రీడల విలువ తెలియకపోవడం, ప్రోత్సాహం లేకపోవడమే ప్రధాన కారణం అంటోంది జ్యోతిక. తనలో క్రీడాకారిణిని చూసుకుని తండ్రి సంతోషపడుతున్నారని, నాన్నకు గర్వకారణంగా నిలవగలగడం తనకు ఆనందాన్నిస్తోందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాసు నుంచే ఆటల్లో చురుగ్గా ఉన్నాను. కానీ పోటీలకు వెళ్లింది నైన్త్ క్లాస్ నుంచే. నాలో స్పోర్ట్స్ పర్సన్ ఉన్నట్లు మొదటిసారి గుర్తించింది కూడా మా నాన్నగారే. తణుకులో ఉన్నప్పుడు స్కూల్ పీఈటీ మాస్టారు సీతారామయ్య గారితోపాటు నాన్న కూడా శిక్షణ ఇచ్చారు. టోర్నమెంట్లకు వెళ్లేటప్పుడు ప్రతిసారీ నాకు తోడు వస్తారు. నాతోపాటు పాల్గొనే వాళ్ల వివరాలతోపాటు, వాళ్లు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నారు, ఎంత సమయం ప్రాక్టీస్ చేస్తున్నారు వంటి వివరాలతోపాటు తనకు తెలిసిన మెళకువలు చెప్పి గైడ్ చేస్తుంటారు. బంధువులు, స్నేహితులు కలిసినప్పుడు ‘మీ నాన్నలాంటి నాన్న ఉండడం నీ అదృష్టం’ అంటుంటారు. వాళ్ల మాట నిజమే. టీవీ లేదు.. సినిమా లేదు! ఇంటర్లో ఉన్నప్పుడు సీనియర్ అథ్లెట్స్‌తో కలిసి ఒక ఇల్లు తీసుకుని ఉన్నాను. ఆ ఇంట్లో నో టీవీ. అందరమూ అథ్లెట్లమే కావడంతో ఎవరికీ టీవీ చూసే టైమ్ ఉండేది కాదు. కాలేజ్‌కి వెళ్లడం, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడమే లైఫ్. క్లాసు పుస్తకాలు తప్ప ఇతర సాహిత్య రచనలు చదవడం కూడా కుదరదు. ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ, సినిమాలు చూసింది కూడా లేదు. ఖాళీ సమయంలో పెన్సిల్ డ్రాయింగ్ వేస్తుంటాను. కోచ్ వినాయక్ ప్రసాద్ మా అథ్లెట్లందరికీ శిక్షణనిచ్చేవారు. టోర్నమెంట్ల సమయంలో మా అమ్మ వచ్చి భోజనం వండి పెట్టేది. నేనేమీ కేలరీల లెక్క చూసుకుంటూ తినడం అనేది జరగనే లేదు. శక్తినిచ్చే పోషకాహారం తీసుకోవడం వరకే. అభ్యంతరాలు తొలి మెడల్ వరకే ఆడపిల్లకు ఈ పరుగులేంటనే మాట చాలామంది అమ్మాయిలకు ఎదురైనట్లుగానే నాకూ తప్పలేదు. ఒకసారి మెడల్ వచి్చన తరవాత ఇక ప్రశంసలే. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ మెడల్స్ అందుకున్నాను. ఇన్నేళ్ల సాధన తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది. నేను 2016లో ఒకసారి టరీ్కకి వెళ్లాను. అది నా తొలి ఇంటర్నేషనల్ టోర్నమెంట్. అయితే అప్పుడు ఫైనల్స్‌కి చేరలేకపోయాను. ఆ తరవాత ఏడాది ఏషియన్ యూత్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానానికి పరిమితమయ్యాను. టర్కీ పోటీల్లో రెండవ ప్రయత్నంలో స్వర్ణం సాధ్యమైంది. హైదరాబాద్‌లో కోచ్ రమేశ్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. గత ఏడాది అక్టోబర్ నుంచి త్రివేండ్రంలో నేషనల్ క్యాంప్‌లో తీసుకున్న శిక్షణతోపాటు టర్కీలో రష్యన్ కోచ్ గలీనా మేడమ్ శిక్షణ నా విజయానికి బాగా దోహదం చేశాయి. నెల రోజులు టర్కీలో ఉండి శిక్షణ తీసుకున్న తర్వాత పోటీలో పాల్గొన్నాను. ఇక నా భవిష్యత్తు లక్ష్యాల విషయానికి వస్తే... ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించాలి. ఆ తర్వాత ఒలింపిక్స్‌ని లక్ష్యంగా తీసుకుంటాను. తణుకులో ఉన్నప్పుడు నాలుగు వందల మీటర్ల లక్ష్యాన్ని చేరడానికి 58 నుంచి 59 సెకన్లు పట్టేది. విజయవాడ లో ప్రాక్టీస్ టైమ్‌కి 54 నిమిషాలకు చేరాను. ఇప్పుడు 53.05 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేశాను. 52 సెకన్లకు చేరడానికి ప్రాక్టీస్‌ని కంటిన్యూ చేస్తున్నాను’’ అంటూ ప్రాక్టీస్‌కి టైమవుతోందని ముగించింది. – వాకా మంజులారెడ్డి టరీ్కకి వెళ్లడానికి ముందు గత ఏడాది అక్టోబర్ నుంచి త్రివేండ్రంలో నేషనల్ క్యాంప్‌లో తీసుకున్న శిక్షణతోపాటు టర్కీలో రష్యన్ కోచ్ గలీనా మేడమ్ శిక్షణ బాగా దోహదం చేశాయి. నెల రోజులు టర్కీలో ఉండి శిక్షణ తీసుకున్న తర్వాత పోటీలో పాల్గొన్నాను. – జ్యోతికశ్రీ, అథ్లెట్ -
వాలీబాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి! ఏపీ అథ్లెట్ జ్యోతికకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్–17 మహిళల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణకు చెందిన శాంత కుమారి చోటు సంపాదించింది. నేటి నుంచి ఈనెల 13 వరకు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ఈ టోర్నీ జరగనుంది. వనపర్తి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన శాంత కుమారి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. పసిడి పతకంతో జ్యోతిక(మధ్యలో ఉన్న వ్యక్తి) స్వర్ణం నెగ్గిన జ్యోతిక శ్రీ సాక్షి, హైదరాబాద్: టర్కీలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ దండి జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది. 400 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతిక 53.47 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన శుభ (54.17 సెకన్లు) రజతం, సుమ్మీ (54.47 సెకన్లు) కాంస్యం సాధించడంతో ఈ రేసులో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
జ్యోతిక పసిడి పరుగు.. రజతం గెలిచిన యశ్వంత్
న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణ పతకాన్ని సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన జ్యోతికశ్రీ 400 మీటర్ల దూరాన్ని 53.05 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ విభాగంలో వైజాగ్‌కు చెందిన లావేటి యశ్వంత్ రజతం గెల్చుకున్నాడు. కాగా యశ్వంత్ 14.25 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నక్కా రాజేశ్ 48.94 సెకన్లలో గమ్యానికి చేరి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య కాంస్య పతకం సొంతం చేసుకుంది. నిత్య 11.90 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 200 మీటర్ల విభాగంలో మాయావతి ఫైనల్‌కు చేరింది. చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్ -
జ్యోతికశ్రీకి కలెక్టర్ అభినందనలు
విజయవాడ : జూలై 12 నుంచి 15వ తేదీ వరకు కెన్యా దేశంలో నిర్వహించనున్న వరల్డ్ యూత్ చాంపియన్ షిప్లో 400 మీటర్ల పరుగు పందెంలో భారతదేశం తరుపున ఎంపికైన విజయవాడకు చెందిన దండి జ్యోతికశ్రీ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను కలిశారు. కలెక్టర్ ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచి దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గతంలో ఏషియన్ యూత్ చాంపియన్‌షిప్‌లో 4వ స్థానం సాధించిన జ్యోతికశ్రీ విజయవాడ నగరానికి చెందటం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆమె నగరంలో సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుందని జిల్లా క్రీడాల అధికారి బి.శ్రీనివాసరావు కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీఎస్డీఓతోపాటు కోచ్ డి.ఎన్.వి. వినాయక ప్రసాద్ ఉన్నారు. -
ఆసియా యూత్ అథ్లెటిక్స్‌కు జ్యోతిక శ్రీ
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇటీవలే జరిగిన జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతిక శ్రీ భారత జట్టులోకి ఎంపికైంది. బ్యాంకాక్‌లో వచ్చే నెల 20 నుంచి 23 వరకు జరిగే ఆసియా యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో జ్యోతిక శ్రీ బాలికల 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగుతుంది. మొత్తం 37 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు పాటియాలా, సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. -
ఆసియా జిమ్నాస్టిక్స్‌కు అరుణ
ఆసియా జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ అమ్మాయి బుద్దా అరుణా రెడ్డి చోటు సంపాదించింది. వచ్చే నెల 13 నుంచి 23 వరకు బ్యాంకాక్‌లో ఈ పోటీలు జరుగుతాయి. గత ఫిబ్రవరిలో ఆలిండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన 20 ఏళ్ల అరుణా రెడ్డి మూడు స్వర్ణాలు గెలిచింది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతిక శ్రీకి స్వర్ణం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తొలి స్వర్ణం లభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి డి. జ్యోతిక శ్రీ 400 మీటర్ల రేసులో పసిడి పతకాన్ని సాధించింది. ఆమె 56.7 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని సంపాదించింది.