
శాంత కుమారి, జ్యోతిక శ్రీ
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్–17 మహిళల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణకు చెందిన శాంత కుమారి చోటు సంపాదించింది. నేటి నుంచి ఈనెల 13 వరకు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో ఈ టోర్నీ జరగనుంది. వనపర్తి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన శాంత కుమారి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది.
పసిడి పతకంతో జ్యోతిక(మధ్యలో ఉన్న వ్యక్తి)
స్వర్ణం నెగ్గిన జ్యోతిక శ్రీ
సాక్షి, హైదరాబాద్: టర్కీలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ దండి జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది. 400 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతిక 53.47 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన శుభ (54.17 సెకన్లు) రజతం, సుమ్మీ (54.47 సెకన్లు) కాంస్యం సాధించడంతో ఈ రేసులో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు!
Comments
Please login to add a commentAdd a comment