vanaparthy
-
TG: ‘సీఎస్’ వస్తే ఎవరూ ఉండకూడదా? పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో శుక్రవారం(నవంబర్22) ఎస్పీఎఫ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ఆరవ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు.తాను ఎమ్మెల్యేను అని చెప్పినా మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టారు.సీఎస్ వస్తె ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఈ సందర్భంగా పోలీసులను మేఘాారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడవం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఎస్పీఎఫ్‌పై పలు ఫిర్యాదులుండడం గమనార్హం. -
TS: అమెరికా వెళ్లిన కొద్ది రోజులకే కొడుకు మృతి.. కుటుంబంలో విషాదం
సాక్షి, వనపర్తి: ఎన్నో కలలతో కుమారుడిని అమెరికాలో చదివించడానికి పంపిన ఆ తల్లిదండ్రులకు పండగ పూట విషాదమే మిగిలింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంతో తిరిగి రావాలని అయ్యప్ప స్వామి వద్ద పూజ చేయించి మరీ కొడుకును పంపారు. వెళ్లిన 17 రోజులకే కొడుకు మృతిచెందాడన్న వార్త ఆ తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచింది. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు వెంకన్నకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కుమారుని పేరు దినేష్. ఇతను ఎమ్మెస్ చదవడానికిగాను డిసెంబర్ 28న అమెరికా వెళ్లాడు. అమెరికాలోని హార్ట్ఫోర్డ్ ష్ట్రంలో కనెక్టికట్‌లోని కాలేజీలో చదువుతున్నాడు. ఏమైందో తెలియదు కానీ శుక్రవారం రాత్రి తన రూమ్‌లో దినేష్‌తో పాటు శ్రీకాకుళానికి చెందిన మరో విద్యార్థి కూడా అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉన్నాడు. నిద్రలోనే కొడుకు మృతి చెందడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దినేష్ తండ్రి వెంకన్న ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. తన కొడుకుపై చదువుల కోసం అమెరికా వెళుతున్నందున అయ్యప్ప స్వామి దగ్గర పూజ చేయించి మరీ పంపారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో ప్రస్తుతం తీవ్ర విషాదం నెలకొంది. ఇదీచదవండి.. హుస్నాబాద్‌లో కారు బోల్తా యువకుడి మృతి -
వనపర్తి: చెరుకు లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు
-
వాలీబాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి! ఏపీ అథ్లెట్ జ్యోతికకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్–17 మహిళల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణకు చెందిన శాంత కుమారి చోటు సంపాదించింది. నేటి నుంచి ఈనెల 13 వరకు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ఈ టోర్నీ జరగనుంది. వనపర్తి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన శాంత కుమారి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. పసిడి పతకంతో జ్యోతిక(మధ్యలో ఉన్న వ్యక్తి) స్వర్ణం నెగ్గిన జ్యోతిక శ్రీ సాక్షి, హైదరాబాద్: టర్కీలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ దండి జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది. 400 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతిక 53.47 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన శుభ (54.17 సెకన్లు) రజతం, సుమ్మీ (54.47 సెకన్లు) కాంస్యం సాధించడంతో ఈ రేసులో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
చావులోనూ... చేయి వదలనని..
ఏనాడో కలిపిన ఏడడుగుల బంధాన్ని చివరిదాకా కాపాడుకున్నారు ఆ దంపతులు. కడదాకా అనురాగం, ఆప్యాయతలను కలిసి పంచుకున్న వారు మృత్యువులోనూ తోడు వస్తానని బాస చేసుకున్నట్టున్నారు. వనపర్తి జిల్లాలో భార్య మృతిని తట్టుకోలేక ఒక భర్త గుండె ఆగిపోగా, సిద్దిపేట జిల్లాలో భర్త మరణాన్ని తట్టుకోలేక కొంతసేపటికే ఓ భార్య కూడా తనువు చాలిం చింది. ఈ విషాద ఘటనలు అందరినీ కంటతడి పెట్టించాయి. పాన్‌గల్ (వనపర్తి): వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మల్లాయిపల్లిలో లక్ష్మీదేవమ్మ (75), కర్రెన్న (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. శివారులో ఉన్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. లక్ష్మీదేవమ్మ, కర్రెన్నలది అన్యోన్య దాంపత్యం. ఇదిలా ఉండగా, లక్ష్మీదేవమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందగా ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి భార్యపై బెంగతో కర్రెన్న గుండె కూడా ఆగిపోయింది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోవడం ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులనూ కలచివేసింది. మరో ఘటనలో.. వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరుకు చెందిన కొడపర్తి బాలయ్య (75), నాగవ్వ (65) దంపతులకు ఒక కుమారుడు. ముగ్గురు కుమార్తెలు. అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఆ దంపతులు ఒకరంటే మరొకరికి ప్రాణంలా ఉండేవారు. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాలయ్య అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేని నాగవ్వ తీవ్ర వేదనకు గురైంది. రాత్రి 12 గంటల సమయంలో ఆమె సైతం ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. విషాదాన్ని దిగమింగుకుంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఆ దంపతుల అంత్యక్రియలు ఒకే సమయంలో నిర్వహించారు. -
సరళాసాగర్ ప్రాజెక్ట్ కరకట్టకు గండి
-
నిలిచిన బాల్యవివాహాలు
► వేర్వేరుచోట్ల అడ్డుకున్న అధికారులు రంగాపూర్ (వనపర్తి) : ప్రభుత్వం ఒక పక్క బాల్యవివాహాలు చేయకూడదని అవగాహన కల్పిస్తుంటే మరోపక్క గ్రామాల్లో తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా చిన్నతనంలో పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. పెబ్బేరు మండలం రంగాపూర్‌లో బాల్యవివాహాం జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న అధికారులు బుధవారం గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నవయసులో పెళ్లి చేస్తే కలిగే నష్టాలను వివరించారు. కాదని వివాహాం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐలు నాగశేఖర్‌రెడ్డి, అభినవ్చత్ర్వేద్ హెచ్చరించారు. వారివెంట తహసీల్దార్ దత్తాత్రి ఉన్నారు. సింగోటంలో .. కొల్లాపూర్ రూరల్ : మండలంలోని సింగోటం గ్రామంలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గురువారం మైనర్‌కు వివాహం చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీనివాసరావు బుధవారం ఉదయం తన సిబ్బందితో గ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల స్టేషన్‌కు తీసుకెళ్లారు. చట్టవిరుద్ధ పనులు చేయకూడదని కౌన్సెలింగ్ ఇచ్చారు. వయసు పూర్తికాకముందే వివాహం చేస్తే చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో కిరాణా, పాన్ షాపులపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం సదరు షాపుల యజమానులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏ పక్షంలో ఉన్నా నిధులొస్తాయి: రావుల
వనపర్తి : చిత్తశుద్దితో పని చేస్తే అధికార, ప్రతిపక్షంలో ఎక్కడ ఉన్న ప్రజాప్రయోగ పనులకు నిధులు సాధించడం సులువేనని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికార పక్షంలోనే ఉంటే నిధులొస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావానే అపోహ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం వనపర్తిలోని బ్రహ్మణ సంస్కృతిక భవన నిర్మాణం, రూ. కోటి రూపాయాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం పనులను ఆయన పరిశీలించారు. బ్రహ్మణ సంస్కృతిక భవనానికి తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రూ.5 లక్షలు ఇచ్చానని రావుల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భవన నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానన్ని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి రాష్ట్రంలో అత్యధిక నిధులు తెచ్చిన పది నియోజకవర్గాల్లో వనపర్తి పేరుండటం ఇందుకు నిదర్శనమని రావుల పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ది కోసం తాను అవసరమైన ప్రతి చోట ఒక్క మెట్టు కిందికి దిగానని... అందువల్లే నియోజకవర్గం పది మెట్లు పైకి నిలబెట్టాగలిగామని అన్నారు. వనపర్తి ఆర్డీవో కొత్త భవనానికి రూ. 2 కోట్లు, ఐసీడీఎస్ భవనానికి రూ. 40 లక్షలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ. కోటి, సబ్ ట్రేజరీ కార్యాలయానికి రూ.కోటి, ఎంపీడీవో కార్యాలయాన్నికి రూ. రెండు కోట్ల చొప్పున తన హయంలో నిధలు విడుదలైన సంగతిని ఆయన వివరించారు. సబ్ ట్రేజరీ, మండల పరిషత్ తప్ప మిగతా ఏ కార్యాలయాల పనులు ప్రారంభం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను జిల్లా కలెక్టర్‌ను కలిసి పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తానన్నారు. డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంకు అనుబంధంగా రూ. కోటి రూపాయాలతో అన్ని వసతులు,సౌకర్యాలతో ఇండోర్ స్టేడియం పూర్తియిందని... ఇది క్రీడకారులకు ఉపయుక్తంగా ఉండనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, కౌన్సిలర్లు ఉంగ్లం తిరుమల్, పార్వతి, టీడీపీ నాయకులు నందిమల్ల అశోక్, గిరి, నందిమల్ల రమేష్, పి. రవి, షఫీ, బాలరాజు, దినేష్ , కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ వికాస బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో గ్రామీణ వికాస బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. శనివారం తెల్లవారుజామున దుండగులు చోరీకి యత్నించారు. బ్యాంకు కిటికీ పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. అయితే ఒక్కసారిగా సైరన్ మోగటంతో వారు పరారయ్యారు. కాగా బ్యాంక్ వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.