సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో శుక్రవారం(నవంబర్22) ఎస్పీఎఫ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ఆరవ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు.తాను ఎమ్మెల్యేను అని చెప్పినా మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టారు.సీఎస్ వస్తె ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఈ సందర్భంగా పోలీసులను మేఘాారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడవం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఎస్పీఎఫ్‌పై పలు ఫిర్యాదులుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment