తిరువనంతపురం: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణంతో మెరిసింది. సీనియర్ మహిళల 400 మీటర్ల పరుగులతో జ్యోతిక శ్రీ మొదటి స్థానంలో నిలిచింది. 53.26 సెకన్ల టైమింగ్‌తో రేస్ పూర్తి చేసి ఆమె విజేతగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో ఐశ్వర్య (మహారాష్ట్ర – 53.49 సె.), కిరణ్ పహల్ (హరియాణా – 54.29 సె.) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. అండర్–20 విభాగంలో ప్రియా మోహన్ (కర్నాటక – 53.55 సె.) పసిడి పతకాన్ని గెలుచుకుంది.
జాతీయ రికార్డు నమోదు...
ఇదే చాంపియన్‌షిప్ అండర్–16 బాలికల విభాగం 400 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. బెంగాల్‌కు చెందిన రెజోనా మలిక్ హీనా 53.22 సెకన్లలో రేస్ పూర్తి చేసి స్వర్ణం సాధించడంతో పాటు కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో అంజనా థమ్కే (54.57 సె.) పేరిట ఉన్న రికార్డును హీనా బద్దలు కొట్టింది. ఈ ఈవెంట్‌లో మాన్సి భరేకర్ (మహారాష్ట్ర ), నేత్ర (తమిళనాడు) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు.
National U23 Athletics Championships: జ్యోతికశ్రీకి స్వర్ణం
Published Tue, Mar 7 2023 5:42 AM | Last Updated on Tue, Mar 7 2023 5:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment