National Open Athletics Championship
-
National U23 Athletics Championships: జ్యోతికశ్రీకి స్వర్ణం
తిరువనంతపురం: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణంతో మెరిసింది. సీనియర్ మహిళల 400 మీటర్ల పరుగులతో జ్యోతిక శ్రీ మొదటి స్థానంలో నిలిచింది. 53.26 సెకన్ల టైమింగ్‌తో రేస్ పూర్తి చేసి ఆమె విజేతగా నిలిచింది. ఈ ఈవెంట్లో ఐశ్వర్య (మహారాష్ట్ర – 53.49 సె.), కిరణ్ పహల్ (హరియాణా – 54.29 సె.) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. అండర్–20 విభాగంలో ప్రియా మోహన్ (కర్నాటక – 53.55 సె.) పసిడి పతకాన్ని గెలుచుకుంది. జాతీయ రికార్డు నమోదు... ఇదే చాంపియన్‌షిప్ అండర్–16 బాలికల విభాగం 400 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. బెంగాల్‌కు చెందిన రెజోనా మలిక్ హీనా 53.22 సెకన్లలో రేస్ పూర్తి చేసి స్వర్ణం సాధించడంతో పాటు కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో అంజనా థమ్కే (54.57 సె.) పేరిట ఉన్న రికార్డును హీనా బద్దలు కొట్టింది. ఈ ఈవెంట్లో మాన్సి భరేకర్ (మహారాష్ట్ర ), నేత్ర (తమిళనాడు) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. -
రన్నర్ రాంబాయి.. 105 నాట్అవుట్
వయసు సెంచరీ దాటిన తరువాత రెండు అడుగులు వేయాలంటే.. కర్ర, మంచం, కుర్చి, వాకర్ వంటివాటి సాయం తప్పక తీసుకోవాల్సిందే. అటువంటిది హరియాణాకు చెందిన 105 ఏళ్ల ‘రాంబాయి’ బామ్మ అత్యంత వేగంగా పరుగెత్తి జాతీయ రికార్డులను తిరగరాయడమేగాక, రెండు స్వర్ణపతకాలను అవలీలగా గెలుచుకుంది. శాకాహారం మాత్రమే తీసుకునే ఈ బామ్మ ఇంతటి లేటువయసులో ఎంతో చలాకీగా ఉంటూ యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. జూన్ 15న అథ్లెటిక్స్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వడోదరాలో నిర్వహించిన ప్రారంభ నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వంద మీటర్ల దూరాన్ని కేవలం 45.40 సెకన్లలో పరుగెత్తి స్వర్ణపతకాన్ని గెలుచుకుంది రాంబాయి. గతంలో 101 ఏళ్ల మన్ కౌర్ ఇదే వంద మీటర్ల దూరాన్ని 74 సెకన్లలో పూర్తిచేసి రికార్డు నెలకొల్పింది. కౌర్‌కంటే వేగంగా పరుగెత్తిన రాంబాయి ఈ రికార్డుని బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా ఆదివారం (జూన్19)న నిర్వహించిన రెండు వందల మీటర్ల పరుగు పందేన్ని ఒక నిమిషం 52.17 సెకనులలో పూర్తిచేసి మరో స్వర్ణపతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హరియాణాలోని చరికదాద్రీ జిల్లా కద్మా గ్రామంలో 1917లో పుట్టింది రాంబాయి బామ్మ. చిన్నప్పటి నుంచి రేసుల్లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. పరుగు పందెంలో పాల్గొనడానికి అవకాశం రావడంతో... గతేడాదిలో రన్నింగ్ సాధన మొదలు పెట్టి రేసులలో పాల్గొనడం ప్రారంభించింది. గతేడాది నవంబర్‌లో వారణాసిలో తొలిసారి పరుగు పందెంలో పాల్గొంది. అక్కడ రాంబాయి రన్నింగ్ బావుండడంతో..ఆ తరువాత కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో జరిగే పోటీల్లో పాల్గొని డజనకు పైగా పతకాలను గెలుచుకుంది. తాజాగా వడోదరలో వందేళ్లకు ౖపైబడిన వారికి నిర్వహించే పరుగు పందెంలో ఎంతో చలాకీగా పాల్గొని రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్న ఉత్సాహంతో.. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని విజేతగా నిలవాలని కలలు కంటూ పాస్‌పోర్టును సిద్ధం చేసుకుంటోంది ఈ సెంచరీ బామ్మ. రాంబాయి కుటుంబంలో ఆమె ఒక్కరే కాకుండా కొంతమంది కుటుంబ సభ్యులు సైతం వివిధ క్రీడల్లో పతకాలు సాధించిన వారే. రాంబాయి 62 ఏళ్ల కూతురు సంత్రా దేవి రిలే రేస్‌లో స్వర్ణ పతకం, కుమారులు ముఖ్తార్ సింగ్, వధు భటెరీలు రెండు వందల మీటర్ల రేస్‌లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పాలు పెరుగు... రాంబాయి శాకాహారి. అరకేజీ పెరుగు,అరలీటరు పాలు, పావుకేజీ వెన్న, జొన్న పిండితో చేసిన బ్రెడ్‌ను రోజువారి ఆహారంగా తీసుకుంటుంది. ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి రోజూ పొలంలో పనిచేయడానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తుంది. సొంత పొలంలో పండిన పంటనే ఆహారంగా తీసుకోవడం, క్రమం తప్పని నడకతో వయసు సెంచరి దాటినప్పటికీ.. యాక్టివ్‌గా ఉంటోంది. అవకాశం ఇవ్వలేదు... ‘నేను ఎప్పుడో పరుగెత్తాలని అనుకున్నాను. కానీ నాకెవరు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం నా మనవరాలు షర్మిలతో వచ్చి ఇక్కడ పాల్గొన్నాను. మా కుంటుబంలో ఎక్కువ మంది క్రీడారంగంలో రాణిస్తున్నారు. ఈ రోజు నేను కూడా వారి జాబితాలో చేరాను. షర్మిల కూడా పతకాలు గెలుచుకుంది. పాలు పెరుగు, చుర్మాలే నన్ను గెలిపించాయి. ఇవే నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాయి’ అని రాంబాయి చెప్పింది. -
తెలంగాణ అథ్లెట్లకు 8 పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్లు మెరిశారు. గుజరాత్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ అథ్లెట్లు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో దివ్య బొల్లారెడ్డి 400, 800 మీటర్ల కేటగిరీల్లో రజత పతకాలు గెలిచింది. దివ్య 400 మీటర్ల దూరాన్ని 1ని:14.91 సెకన్లలో... 800 మీటర్ల దూరాన్ని 3ని:02.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల ప్లస్ 35 వయో విభాగంలో అష్లి గోపీ 110 మీటర్ల హర్డిల్స్‌లో రజతం, ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 110 మీటర్ల హర్డిల్స్ రేసును గోపీ 21.02 సెకన్లలో ముగించి రెండో స్థానంలో... ట్రిపుల్ జంప్‌లో 9.88 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో కృతి కడాకియా 1500 మీటర్ల రేసును 6ని:51.56 సెకన్లలో ముగించి కాంస్యం గెల్చుకుంది. పురుషుల ప్లస్ 60 వయో విభా గం పోల్‌వాల్ట్‌లో బండారి భాస్కర్ రావు 1.60 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్యం... హైజంప్‌లో 1.05 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజతం నెగ్గాడు. పురుషుల ప్లస్ 60 వయో విభాగం హ్యామర్ త్రోలో మనోహర్ రావు (27.58 మీటర్లు) స్వర్ణం గెలిచాడు. -
National Open Athletics: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ శ్రీనివాస్‌కు కాంస్యం
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చివరిరోజు ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్ రేసును శ్రీనివాస్ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు. అమ్లాన్ బొర్గోహైన్ (అస్సాం; 20.75 సెకన్లు) స్వర్ణం సాధించగా... నితిన్ (తమిళనాడు; 21.06 సెకన్లు) రజతం గెల్చుకున్నాడు. 200 మీటర్ల రేసు విజేతలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి పతకాలను ప్రదానం చేశారు. ‘ద్రోణాచార్య’ అవార్డీ నాగపురి రమేశ్ వద్ద శ్రీనివాస్ శిక్షణ తీసుకుంటున్నాడు. 13 స్వర్ణాలు, 10 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 36 పతకాలు నెగ్గిన రైల్వేస్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చదవండి: Virat Kohli: ఐపీఎల్ కెప్టెన్సీపై కోహ్లి కీలక నిర్ణయం -
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్: హర్మిలన్ బైన్స్ ‘డబుల్’
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో పంజాబ్‌కు చెందిన హర్మిలన్ కౌర్ బైన్స్ ‘డబుల్’ నమోదు చేసింది. ఇప్పటికే 1500 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన 23 ఏళ్ల హర్మిలన్ శనివారం జరిగిన 800 మీటర్ల విభాగంలోనూ పసిడి పతకం సొంతం చేసుకుంది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో హర్మిలన్ 2ని:03.82 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. మహిళల ట్రిపుల్ జంప్‌లో బి.ఐశ్వర్య (రైల్వేస్) చాంపియన్‌గా నిలిచింది. లాంగ్‌జంప్‌లోనూ స్వర్ణం సాధించిన ఐశ్వర్య ట్రిపుల్ జంప్‌లో 13.55 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని సంపాదించింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్ ఫైనల్ చేరాడు. పోటీల చివరిరోజు ఆదివారం 10 విభాగాల్లో ఫైనల్స్ జరుగుతాయి. -
National Open Athletics: పారుల్ డబుల్ ధమాకా
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: రైల్వేస్ అథ్లెట్ పారుల్ చౌదరి(Parul Chaudhary) డబుల్ ధమాకా సాధించింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆమె రెండో స్వర్ణం సాధించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె తాజాగా మహిళల 3000 మీ. స్టీపుల్‌చేజ్‌లోనూ విజేతగా నిలిచింది. పోటీల ప్రారంభ రోజే పారుల్ 5000 మీటర్ల పరుగులో కూడా బంగారు పతకం సాధించింది. శుక్రవారం జరిగిన మూడు వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో పారుల్ చౌదరికి మహారాష్ట్ర అథ్లెట్ కోమల్ చంద్రకాంత్ జగ్దలే గట్టిపోటీ ఇచి్చంది. చివరకు 0.02 సెకన్ల అతి స్వల్ప తేడాతో పారుల్ (9ని.51.01 సె) పసిడి పతకం పట్టేసింది. కోమల్ 9 ని.51.03సెకన్ల టైమింగ్‌తో రజతంతో సరిపెట్టుకొంది. ఈ ఈవెంట్లో ప్రీతి (రైల్వేస్; 10 ని.22.45 సె.) కాంస్యం గెలిచింది. పోటీల మూడో రోజు కూడా రైల్వేస్ అథ్లెట్ల హవానే కొనసాగింది. ఐదు ఈవెంట్లలో రైల్వేస్ అథ్లెట్లు బంగారు పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌లో సందేశ్, షాట్‌పుట్‌లో కరణ్వీర్ సింగ్, మహిళల లాంగ్‌జంప్‌లో ఐశ్వర్య, హర్డిల్స్‌లో కనిమొని బంగారు పతకాలు సాధించారు. నిరాశ పరిచిన నందిని... తెలంగాణ అమ్మాయి అగసర నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో నిరాశపరిచింది. ఇటీవల నైరోబి (కెన్యా)లో జరిగిన ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో సెమీస్ చేరిన నందిని... ఆశ్చర్యకరంగా జాతీయ ఓపెన్ పోటీల్లో విఫలమైంది. శుక్రవారం జరిగిన మహిళల వంద మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో ఆమె 14.30 సెకన్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది. ఇందులో కనిమొని (రైల్వేస్; 13.54 సె.) విజేతగా నిలువగా, అపర్ణ రాయ్ (కేరళ; 13.58 సె.), కె.నందిని (తమిళనాడు; 13.90 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మిక్స్డ్ 4్ఠ400 మీ.రిలేలో తెలంగాణ బృందం అసలు పరుగునే పూర్తి చేయలేకపోయింది. -
స్ప్రింట్ ఫైనల్లో నిత్య, నరేశ్
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ స్ప్రింట్‌లో తెలంగాణ అమ్మాయి గంధి నిత్య స్ప్రింట్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా నిర్మించిన సింథటిక్ ట్రాక్‌పై బుధవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎక్కువగా పలు ఈవెంట్లకు సంబంధించి క్వాలిఫయింగ్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా మహిళల 100 మీ. పరుగు పందెం హీట్స్‌లో నిత్య నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల వంద మీటర్ల స్ప్రింట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కె. నరేశ్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్స్‌లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ ఫైనల్స్‌కు అర్హత పొందింది. హీట్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు రైల్వేస్ అథ్లెట్ల హవా నడిచింది. మొదటి రోజు మూడు మెడల్ ఈవెంట్లలో నలుగురు రైల్వేస్ అథ్లెట్లు పతకాలు గెలుపొందారు. 5000 మీటర్ల పరుగు పందెంలో పురుషుల కేటగిరీలో అభిõÙక్ పాల్, మహిళల ఈవెంట్లో పారుల్ చౌదరీ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో అభిõÙక్ (రైల్వేస్) పోటీని అందరికంటే ముందుగా 14 నిమిషాల 16.35 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం నెగ్గాడు. సర్వీసెస్‌కు చెందిన ధర్మేందర్ (14ని.17.20 సె.), అజయ్ కుమార్ (14 ని.20.98 సె.) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి 15 ని.59.69 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం గెలిచింది. ఇందులో మహారాష్ట్ర అమ్మాయిలు కోమల్ జగ్దలే (16ని. 01.43 సె.), సంజీవని బాబర్ (16 ని.19.18 సె.) రజతం, కాంస్యం గెలుపొందారు. మహిళల పోల్‌వాల్ట్ ఫైనల్లో పవిత్ర (తమిళనాడు; 3.90 మీ.) బంగారు పతకం సాధించింది. మరియా (రైల్వేస్; 3.80 మీ.) రజతం, కృష్ణ రచన్ (రైల్వేస్ 3.60 మీ.) కాంస్యం నెగ్గారు. మంత్రి చేతుల మీదుగా... మునుపెన్నడూ లేనివిధంగా చారిత్రక ఓరుగల్లులో జాతీయ క్రీడా పోటీలు జరుగుతుండడం గొప్ప విశేషం అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి లాంఛనంగా పోటీలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి జాతీయస్థాయి పోటీలకు హనుమకొండ నోచుకోలేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
షాట్‌పుట్‌లో తజీందర్ జాతీయ రికార్డు
రాంచీ: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ లో తజీందర్ పాల్ సింగ్ తూర్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజీందర్ ఇనుప గుండును 20.92 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. 20.75 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఈ నెలాఖర్లో చైనాలో జరిగే ప్రపంచ మిలిటరీ గేమ్స్‌లో పాల్గొనబోతున్న తజీందర్ ఆ ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 21.10 మీటర్లను అందుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తజీందర్ 20.43 మీటర్లతో 18వ స్థానంలో నిలిచాడు. -
100 మీ.లో ద్యుతీ చంద్ కొత్త జాతీయ రికార్డు
రాంచీ: భారత మహిళా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ లో ఈ ఒడిశా అథ్లెట్ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్ ఫైనల్ రేసును 11.25 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ రేసులో ద్యుతీ చంద్ 11.22 సెకన్లలో గమ్యానికి చేరింది. ఈ క్రమంలో 11.26 సెకన్లతో సంయుక్తంగా తన పేరిట (ఏప్రిల్, 2019లో), రచితా మిస్త్రీ (జూలై, 2000లో) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. -
ద్యుతీ ‘డబుల్’
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ కోల్‌కతా : జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒడిశాకు చెందిన వివాదాస్పద మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ మరో రెండు స్వర్ణ పతకాలను సాధించింది. ఇప్పటికే 100 మీటర్ల విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఆమె, శనివారం జరిగిన 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. రైల్వేస్ తరఫున పోటీపడుతున్న ద్యుతీ 200 మీటర్ల రేసును 23.69 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత తన సహచరులు హిమశ్రీ రాయ్, శర్బాని నందా, మెర్లిన్ జోసెఫ్‌లతో కలిసి 4ఁ100 మీటర్ల విభాగంలో రైల్వేస్‌కు అగ్రస్థానాన్ని అందించింది. మరోవైపు ఆసియా చాంపియన్ టింటూ లూకా మహిళల 800 మీటర్ల రేసును 2ని:00.56 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుం ది. అంతేకాకుండా 2ని:01.06 సెకన్లతో 1997లో రోసా కుట్టీ నెలకొల్పిన మీట్ రికార్డును టింటూ లూకా తిరగరాసింది. శనివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్ 267 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది. -
ద్యుతీ చంద్‌కు స్వర్ణం
కోల్‌కతా : వివాదాస్పద అథ్లెట్ ద్యుతీ చంద్ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. రైల్వేస్ తరఫున 100మీ. బరిలోకి దిగిన ద్యుతీ 11.68 సెకన్ల టైమింగ్‌తో సత్తా చాటుకుంది. పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా నిషేధం ఎదుర్కొన్న 19 ఏళ్ల ఈ ఒడిషా స్ప్రింటర్‌పై స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ గత జూలైలో వేటును ఎత్తేసింది. అలాగే లలితా బాబర్ (3000మీ. స్టీపుల్‌చేజ్), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్) తమ విభాగాల్లో మీట్ రికార్డులు నెలకొల్పుతూ స్వర్ణాలు సాధించారు. ఇప్పటిదాకా ఈ చాంపియన్‌షిప్‌లో తొమ్మిది స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, రెండు కాం స్యాలతో ఓఎన్జీసీ అగ్రస్థానంలో ఉంది.