ద్యుతీ ‘డబుల్’
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్
కోల్‌కతా : జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒడిశాకు చెందిన వివాదాస్పద మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ మరో రెండు స్వర్ణ పతకాలను సాధించింది. ఇప్పటికే 100 మీటర్ల విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఆమె, శనివారం జరిగిన 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. రైల్వేస్ తరఫున పోటీపడుతున్న ద్యుతీ 200 మీటర్ల రేసును 23.69 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత తన సహచరులు హిమశ్రీ రాయ్, శర్బాని నందా, మెర్లిన్ జోసెఫ్‌లతో కలిసి 4ఁ100 మీటర్ల విభాగంలో రైల్వేస్‌కు అగ్రస్థానాన్ని అందించింది.
మరోవైపు ఆసియా చాంపియన్ టింటూ లూకా మహిళల 800 మీటర్ల రేసును 2ని:00.56 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుం ది. అంతేకాకుండా 2ని:01.06 సెకన్లతో 1997లో రోసా కుట్టీ నెలకొల్పిన మీట్ రికార్డును టింటూ లూకా తిరగరాసింది. శనివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్ 267 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది.