జ్యోతిక శ్రీకి స్వర్ణ పతకం | National Athletics Championships: AP Dandi Jyothika Sri Won Gold 400m | Sakshi
Sakshi News home page

జ్యోతిక శ్రీకి స్వర్ణ పతకం

Published Mon, Oct 16 2023 11:34 AM | Last Updated on Mon, Oct 16 2023 11:37 AM

National Athletics Championships: AP Dandi Jyothika Sri Won Gold 400m - Sakshi

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది. బెంగళూరులో ఆదివారం ముగిసిన ఈ మీట్‌లో జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. జ్యోతిక శ్రీ అందరికంటే వేగంగా 53.26 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

సిమర్జీత్‌ కౌర్‌  (పంజాబ్‌; 53.77 సెకన్లు) రజతం, కవిత (పీఎస్‌పీబీ; 54.15 సెకన్లు) కాంస్యం సాధించారు. 220 పాయింట్లతో రైల్వేస్‌ జట్టు ఓవరాల్‌ టీమ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement