national athletics championship
-
జ్యోతిక శ్రీకి స్వర్ణ పతకం
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది. బెంగళూరులో ఆదివారం ముగిసిన ఈ మీట్లో జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. జ్యోతిక శ్రీ అందరికంటే వేగంగా 53.26 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సిమర్జీత్ కౌర్ (పంజాబ్; 53.77 సెకన్లు) రజతం, కవిత (పీఎస్‌పీబీ; 54.15 సెకన్లు) కాంస్యం సాధించారు. 220 పాయింట్లతో రైల్వేస్ జట్టు ఓవరాల్ టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డు
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డును సృష్టించింది. బెంగళూరులో సోమవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును జ్యోతి 12.82 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. ఈ క్రమంలో 13.04 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. Railways's Jyothi Yarraji sets new NR in Karnataka! ⚡🏃♀️ 23-years old Jyothi bettered her own NR at the National Open Athletics C'ships. By clocking 12.82s (wind +.9 m/s), she becomes 1⃣st Indian Women to go sub 13.00s on the clock for 100m H event. Congratulations! 👏👏 pic.twitter.com/Miba6ro0Cl — SAI Media (@Media_SAI) October 17, 2022 -
జ్యోతిక పసిడి పరుగు.. రజతం గెలిచిన యశ్వంత్
న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణ పతకాన్ని సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన జ్యోతికశ్రీ 400 మీటర్ల దూరాన్ని 53.05 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ విభాగంలో వైజాగ్‌కు చెందిన లావేటి యశ్వంత్ రజతం గెల్చుకున్నాడు. కాగా యశ్వంత్ 14.25 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నక్కా రాజేశ్ 48.94 సెకన్లలో గమ్యానికి చేరి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య కాంస్య పతకం సొంతం చేసుకుంది. నిత్య 11.90 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 200 మీటర్ల విభాగంలో మాయావతి ఫైనల్‌కు చేరింది. చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్ -
100 మీటర్ల రేసులో స్వర్ణం.. అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్
సాక్షి, వరంగల్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కె.నరేశ్ కుమార్ అదరగొట్టాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో నరేశ్ చాంపియన్‌గా అవతరించాడు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో నరేశ్ 100 మీటర్లను 10.30 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్వర్ణం సాధించే క్రమంలో నరేశ్ కొత్త మీట్ రికార్డు సాధించాడు. 2001లో 10.37 సెకన్లతో అనిల్ కుమార్ నెలకొల్పిన మీట్ రికార్డును నరేశ్ బద్దలు కొట్టాడు. అమ్లాన్ బొర్గోహైన్ (అస్సాం; 10.34 సెకన్లు) రజతం, హర్జీత్ సింగ్ (సర్వీసెస్; 10.34 సెకన్లు) కాంస్యం సాధించారు. ఇద్దరూ ఒకేసారి గమ్యం చేరినా ఫొటో ఫినిష్‌లో హర్జీత్కంటే ముందుగా అమ్లాన్ లక్ష్యాన్ని చేరినట్లు తేలింది. 100 మీటర్ల ఒకే రేసులో ముగ్గురు భారత్ అథ్లెట్స్ 10.35 సెకన్ల సమయం నమోదు చేయడం ఇదే ప్రథమం. అంతేకాకుండా నరేశ్ ప్రదర్శన 100 మీటర్ల విభాగంలో భారత్ నుంచి టాప్–5లో ఉండటం విశేషం. కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల నరేశ్‌కు జాతీయస్థాయిలో రెండేళ్లలో ఇది రెండో స్వర్ణ పతకం. గత ఏడాది కర్ణాటకలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రీడల్లో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన నరేశ్ పసిడి పతకం గెల్చుకున్నాడు. నరేశ్ ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని రేపల్లె సాధన డిగ్రీ కాలేజీలో బీఏ కోర్సు అభ్యసిస్తున్నాడు. -
కార్తీకకు కాంస్యం
సాక్షి, గుంటూరు: జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడోరోజు ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ ఖాతాలో పతకం చేరింది. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో జి. కార్తీక (ఏపీ) కాంస్య పతకాన్ని సాధించింది. ఆమె 12.51 మీ. దూరం జంప్ చేసి మూడో స్థానంలో నిలవగా, షీనా (12.78మీ., కేరళ), జోలిన్ లోబో (12.52మీ., కర్నాటక) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుచుకున్నారు. 20, 000 మీ. రేస్ వాక్ ఈవెంట్లో సౌమ్య విజేతగా నిలిచింది. ఆమె గంటా 42 నిమిషాల 23.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మహిళల పోల్‌వాల్ట్ ఈవెంట్లో ఖ్యాతి వఖారియా (కర్ణాటక) 3.70 మీ. జంప్ చేసి చాంపియన్‌గా నిలిచింది. జావెలిన్ త్రో విభాగంలో అన్నూరాణి (54.29మీ.), పూనమ్ రాణి (51.14మీ., హరియాణా), రష్మీ శెట్టి (47.76మీ., కర్నాటక) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. -
హ్యాట్సాఫ్ ‘అమ్మ’!
చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు అలీసా మొంటానో. వయసు 28 ఏళ్లు. అమెరికాకు చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్. యూఎస్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 800 మీ. విభాగంలో గత నాలుగేళ్లుగా ఆమె వరుసగా విజేతగా నిలుస్తోంది. ఈ సారి పోటీల సమయంలో ఆమె 34 వారాల నిండు గర్భవతి. కానీ ఈవెంట్లో పాల్గొనాలన్న ఆమె పట్టుదలకు ప్రెగ్నెన్సీ అడ్డు రాలేదు. భేషుగ్గా పాల్గొనవచ్చని డాక్టర్లు కూడా భరోసా ఇచ్చారు. దాంతో గురువారం శాక్రమెంటో (కాలిఫ్)లో నిర్వహించిన జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. గెలుపు సంగతి పక్కన పెడితే... మధ్యలో ఆమె ఆగిపోలేదు. 2 నిమిషాల 32.13 సెకన్లలో పరుగు పూర్తి చేయగలిగింది. ఫినిష్ లైన్ పూర్తి చేయగానే స్టేడియంలోని ప్రేక్షకులంతా ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. -
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ : నజీబ్‌కు కాంస్యం
రాంచీ: జాతీయ ఓపెన్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ అబ్దుల్ నజీబ్ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు. ఓఎన్జీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నజీబ్ ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల రేసును 10.67 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. అనిరుధ్ (ఎల్ఐసీ-10.46 సెకన్లు) స్వర్ణం సాధించగా... సత్య (తమిళనాడు-10.66 సెకన్లు) రజత పతకం సొంతం చేసుకున్నాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో మెర్లిన్ 13 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. సెమీఫైనల్ రేసును ఆమె 11.35 సెకన్లలో పూర్తి చేసి 11.38 సెకన్లతో 2000లో రచితా మిస్త్రీ నెలకొల్పిన జాతీయ రికార్డును తిరగరాసింది. అయితే ఫైనల్స్‌లో మాత్రం మెర్లిన్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సంతృప్తి పడింది.