పంచ్‌కులా (హరియాణా): జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పతకాన్ని దక్కించుకుంది.
నందిని ఓవరాల్‌గా 5806 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అంతర్జాతీయ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో షణ్ముగ 20.95 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment