Jyothi Yarraji
-
Olympics: జ్యోతికి మళ్లీ నిరాశ.. సెమీస్ చేరకుండానే..
ప్యారిస్ ఒలింపిక్స్-2024 అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది.ఫలితంగా జ్యోతి సెమీస్ ఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది.వెనుకంజలో గోల్ఫర్లు ప్యారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు. అంతిమ్‌పై నిషేధం.. ఖండించిన ఐఓఏభారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అంతిమ్ తొలి రౌండ్ బౌట్‌లోనే టర్కీ రెజ్లర్ యెట్గిల్ జెనెప్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) 19 ఏళ్ల అంతిమ్‌పై కఠిన నిర్ణయం తీసుకునే చాన్స్ కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే అంతిమ్‌పై నిషేధం విధించినట్లు వస్తున్న వార్తలను గురువారం ఐఓఏ ఖండించింది. -
Paris Olympics: భారత తొలి అథ్లెట్‌గా యర్రాజి జ్యోతి ఘనత
సాక్షి, విశాఖపట్నం: విశ్వక్రీడల్లో గర్జించేందుకు విశాఖ అథ్లెట్ యర్రాజి జ్యోతి సిద్ధమైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఒలింపిక్స్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నగరానికి చెందిన జ్యోతి గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది. జ్యోతి ఖాతాలో రెండు కామన్వెల్త్ పతకాలు కూడా ఉన్నాయి.అదే విధంగా.. ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించిన ఘనత యర్రాజి జ్యోతి సొంతం. ఇక వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ బెర్త్ దక్కించుకున్న యర్రాజి జ్యోతి..100 మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగనుంది. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడనున్న మొదటి భారత అథ్లెట్‌గా ఆమె రికార్డులకెక్కనుంది.కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి యర్రాజి జ్యోతితో పాటు దండి జ్యోతికశ్రీ(అథ్లెట్), రంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్(బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్(ఆర్చరీ), షేక్ అర్షద్(పారా సైక్లింగ్ చాంపియన్), కె.నారాయణ(పారా రోవర్) ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు.ఇక ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధు అందరిలోకెల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో క్రీడా ప్రమాణాలు పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి క్రీడాకారులను 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సన్మానించి ప్రోత్సాహకాలు అందించి అండగా నిలిచారు. -
National Inter State Senior Athletics Championships 2024: జ్యోతి, నందినిలకు స్వర్ణాలు
పంచ్‌కులా (హరియాణా): జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పతకాన్ని దక్కించుకుంది. నందిని ఓవరాల్‌గా 5806 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అంతర్జాతీయ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో షణ్ముగ 20.95 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందాడు. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం!
కొత్త సీజన్లో భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరోసారి మెరిసింది. జర్మనీలో జరిగిన కుర్ప్‌ఫాల్జ్ గాలా మీట్లో జ్యోతి ఒక స్వర్ణం, ఒక రజత పతకం నెగ్గింది.100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 13.06 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని గెలిచింది. 200 మీటర్ల ఫైనల్లో జ్యోతి 23.83 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. రెండు వారాల క్రితం నెదర్లాండ్స్‌లో జరిగిన హ్యారీ షులి్టంగ్ గేమ్స్‌లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణంతో కొత్త సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఇవి చదవండి: IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు! -
ఆంధ్ర ప్రదేశ్‌కు స్వర్ణం, కాంస్యం
పనాజీ: జాతీయ క్రీడల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు రెండు పతకాలతో మెరిశారు. మహిళల 4X100 మీటర్ల రిలే ఫైనల్లో చెలిమి ప్రత్యూష, భవానీ యాదవ్, మధుకావ్య, జ్యోతి యర్రాజీలతో కూడిన ఏపీ బృందం పోటీని 45.61 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. మహిళల జావెలిన్ త్రోలో బల్లెంను 52.55 మీటర్ల దూరం విసిరి ఏపీకి చెందిన రష్మీ శెట్టి కాంస్యం నెగ్గింది. -
జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడవది
పనాజీ: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. సోమవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ చాంపియన్‌గా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.22 సెకన్లలో అందరికంటే వేగంగా ఫైనల్ రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు తెలంగాణ ఖాతాలో 11వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి అగర్వాల్ రజత పతకం సాధించింది. -
జ్యోతి విజయం అపూర్వ ఘట్టం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆసియా క్రీడలు 2023 మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించిన జ్యోతి యార్రాజీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. జ్యోతి విజయం.. ఆంధ్రప్రదేశ్‌కి మరో అపూర్వ ఘట్టం అంటూ ట్వీట్ ద్వారా ప్రశంసలు గుప్పించారు. జ్యీతి అంకితభావం, కృషి.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశం గర్వించేలా చేసింది. ఈ అద్భుతమైన విజయం సాధించిన జ్యోతికి అభినందనలు. తెలుగు జెండా రెపరెపలాడుతోంది అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Another glorious moment for Andhra Pradesh! Congratulations to @JyothiYarraji on winning the Silver medal in Women's 100m hurdles at the Asian Games. Your dedication and hard work have made Andhra Pradesh and India proud. Kudos to you for this incredible achievement. The Telugu… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023 -
ఏషియన్ గేమ్స్‌లో హైడ్రామా.. రజతంతో సరిపెట్టుకున్న ఆంధ్ర అమ్మాయి
ఏషియన్ గేమ్స్ 2023లో ఇవాళ (అక్టోబర్ 1) హైడ్రామా చోటు చేసుకుంది. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్‌లో చైనా అథ్లెట్ వు యన్ని నిర్ణీత సమయానికంటే ముందే పరుగు ప్రారంభించి రెండో స్థానంలో నిలిచినప్పటికీ డిస్క్వాలిఫై అయ్యింది. తద్వారా ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీకి రజత పతకం దక్కింది. ఈ పోటీలో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన యర్రాజీ చైనా అథ్లెట్ చేసిన తప్పిదం కారణంగా లయ తప్పి రజతంతో సరిపెట్టుకుంది. చైనా అథ్లెట్ రేస్ ప్రారంభానికి ముందే పరుగు ప్రారంభించగా.. ఆమె పక్కనే ఉన్న జ్యోతి యార్రాజీ సైతం రేస్ అధికారికంగా ప్రారంభమైందని అనుకుని పరుగు మొదలుపెట్టింది. రేస్ పూర్తయిన అనంతరం అంపైర్లు పలు మార్లు రేస్ ఫుటేజ్‌లను పరిశీలించి, చైనా అథ్లెట్‌ను అనర్హురాలిగా ప్రకటించారు. ఈ విషయంలో జ్యోతి యర్రాజీ ఉద్దశపూర్వకంగా ఎలాంటి తప్పిదం చేయలేదని నిర్ధారించుకుని ఆమెకు రజతం ప్రకటించారు నిర్వహకులు. ఏదిఏమైనప్పటికీ చైనా అథ్లెట్ చేసిన తప్పిదం కారణంగా మన విశాఖ అమ్మాయి ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. యర్రాజీ సాధించిన పతకంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 52కు (13 స్వర్ణాలు, 20 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. -
Asian Athletics Championships: జ్యోతికి రజతం... జ్యోతికశ్రీకి కాంస్యం
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ తమ రెండో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 2017లో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యధికంగా 29 పతకాలతో అగ్రస్థానంలో నిలువగా... 1989, 1985 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 22 పతకాల చొప్పున సాధించింది. చివరిరోజు ఆదివారం భారత అథ్లెట్లు 13 పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు జ్యోతి యర్రాజీ రజతం, దండి జ్యోతికశ్రీ కాంస్య పతకం సాధించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన జ్యోతి యర్రాజీ 200 మీటర్ల విభాగంలో రజతం గెలిచింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 23.13 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో దండి జ్యోతికశ్రీ, హీనా మలిక్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్ బృందానికి కాంస్య పతకం దక్కింది. జ్యోతికశ్రీ బృందం 3 నిమిషాల 33.73 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో అమోజ్ జేకబ్, అజ్మల్, మిజో కురియన్, రాజేశ్‌లతో కూడిన భారత బృందం (3ని:01.80 సెకన్లు) రజతం సాధించింది. మహిళల షాట్‌పుట్ ఈవెంట్లో అభా ఖతువా (భారత్) ఇనుప గుండును 18.06 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం గెలిచింది. మహిళల 5000 మీటర్ల రేసులో పారుల్ చౌదరీ (15ని:52.35 సెకన్లు) రజతం, అంకిత (16ని:03.33 సెకన్లు) కాంస్యం నెగ్గారు. పురుషుల 5000 మీటర్ల విభాగంలో గుల్వీర్ సింగ్ (13ని:48.33 సెకన్లు) కాంస్యం సాధించాడు. పురుషుల జావెలిన్ త్రోలో డీపీ మనూ (81.01 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. పురుషుల 800 మీటర్లలో కిషన్ కుమార్ (1ని:45.88 సెకన్లు), మహిళల 800 మీటర్లలో కేఎం చందా (2ని:01.58 సెకన్లు) రజత పతకాలు నెగ్గారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో వికాశ్ సింగ్ (1గం:29ని:32 సెకన్లు) కాంస్యం, మహిళల 20 కిలోమీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి (1గం:34ని:24 సెకన్లు) రజతం గెలిచారు. -
జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన జ్యోతి యర్రాజీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. థాయిలాండ్ వేదికగా గురువారం జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ''వైజాగ్‌కు చెందిన జ్యోతి యర్రాజీకి నా శుభాకాంక్షలు. 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో అందరినీ గర్వపడేలా చేశారు.. కంగ్రాట్స్ జ్యోతి యర్రాజీ'' అంటూ ట్వీట్ చేశారు. ఇక థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. My congratulations and best wishes to our very own @JyothiYarraji from Vizag, on winning gold at the 25th Asian Athletics Championships held in Thailand. You’ve made us all very proud Jyothi! pic.twitter.com/mMvq0afPjG — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 చదవండి: జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, జ్యోతిక శ్రీ
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ, దండి జ్యోతిక శ్రీ ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. జూలై 12 నుంచి 16 వరకు బ్యాంకాక్‌లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి మొత్తం 54 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్, 200 మీటర్ల విభాగంలో జ్యోతి యర్రాజీ... మహిళల 4*400 మీటర్ల రిలే, 4*400 మీటర్ల మిక్స్డ్ రిలేలో జ్యోతిక శ్రీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బోపన్న జోడీ శుభారంభం సించ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లండన్‌లో గురువారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న ద్వయం 7–6 (10/8), 7–6 (7/5)తో జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
సత్తా చాటిన ఆంధ్ర అథ్లెట్స్.. స్వర్ణం నెగ్గిన జ్యోతి యర్రాజీ
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. మహిళల 100 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్‌లో మల్లాల అనూష గౌడ్ (13.24 మీటర్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 11.46 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శ్రాబణి నందా (ఒడిశా; 11.59 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్ (హరియాణా; 11.71 సెకన్లు) కాంస్య పతకం సాధించారు. తెలంగాణ అమ్మాయి నిత్య గాంధె (11.79 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నాలుగు ఈవెంట్లు (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు) ముగిశాక తెలంగాణకు చెందిన అగసార నందిని 3450 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. నేడు మిగిలిన మూడు ఈవెంట్లు (లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) పూర్తయ్యాక అత్యధిక పాయింట్లు సాధించిన అథ్లెట్ విజేతగా నిలుస్తుంది. -
అంతర్జాతీయ వేదికపై స్వర్ణంతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
కుర్ప్‌ఫాల్జ్ గాలా ఈవెంట్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మెరిసింది. జర్మనీలో జరిగిన ఈ మీట్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది. జ్యోతి 12.84 సెకన్లలో గమ్యానికి చేరి తన కెరీర్లో రెండో అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో జ్యోతికిదే తొలి అంతర్జాతీయ పతకం. గత ఏడాది జ్యోతి 12.82 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. -
200 మీటర్ల విభాగంలో జ్యోతికి స్వర్ణ పతకం
Federation Cup 2023: జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకం సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. జ్యోతి 200 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 23.42 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది. బుధవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ జ్యోతి బంగారు పతకం గెలిచింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇవి కూడా చదవండి: పరాజయంతో మొదలు... అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–4 గోల్స్‌తో పరాజయం పాలైంది. భారత్ తరఫున సంగీత (29వ ని.లో), షర్మిలా దేవి (40వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత ప్లేయర్ మోనిక తన కెరీర్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. సిరీస్‌లోని రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది. సెమీస్‌లో అవ్నీత్ కౌర్ షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అవ్నీత్ కౌర్... పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ జావ్కర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో అవ్నీత్ 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై, ప్రథమేశ్ 149–148తో చోయ్ యోంగీ (దక్షిణ కొరియా)పై నెగ్గారు. భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మూడో రౌండ్లోనే వెనుదిరిగింది. -
Federation Cup 2023: జ్యోతి ‘పసిడి’ పరుగు
రాంచీ: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి విజేతగా నిలిచింది. జ్యోతి అందరికంటే వేగంగా 12.89 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నిత్య రామరాజ్ (తమిళనాడు; 13.44 సెకన్లు) రజతం... సప్న కుమారి (జార్ఖండ్; 13.58 సెకన్లు) కాంస్యం గెలిచారు. తెలంగాణ అథ్లెట్ అగసార నందిని 13.65 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ లావెటి యశ్వంత్ కుమార్ 14.62 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. భారత ఆర్చరీ జట్లకు నిరాశ షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. రెండు విభాగాల్లో భారత జట్లు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాయి. మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 228–231 (57–58, 57–58, 57–59, 57–56)తో హజల్ బురున్, ఇపెక్ తొమ్రుక్, ఇర్మక్ యుక్సెల్లతో కూడిన తుర్కియే జట్టు చేతిలో ఓడిపోయింది. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె, రిషభ్ యాదవ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించగా... రెండో రౌండ్లో 236–228తో ఇండోనేసియా జట్టును ఓడించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 231–234తో మెక్సికో జట్టు చేతిలో పరాజయం పాలైంది. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర 656 పాయింట్లు స్కోరు చేసి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. -
Jyothi Yarraji: జ్యోతి యర్రాజీకి స్వర్ణం
బెంగళూరు: ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్లో ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. బెంగళూరులో సోమవారం జరిగిన ఈ మీట్లో జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి అందరికంటే వేగంగా 13.44 సెకన్లలో గమ్యానికి చేరింది. తెలంగాణకు చెందిన అగసార నందిని కాంస్య పతకం గెలిచింది. నందిని 13.85 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇది కూడా చదవండి: బోపన్న జోడీ శుభారంభం మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. మొనాకోలో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 6–3, 10–8తో రాఫెల్ మటోస్ (బ్రెజిల్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జంటపై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ ఎనిమిది ఏస్‌లు సంధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ)లతో బోపన్న, ఎబ్డెన్ తలపడతారు. చదవండి: IPL 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్‌కు ఊహించని షాక్! IPL 2023: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్! మీకు మా కోహ్లి చేతిలో ఉందిలే! ఏంటి రాహుల్ భయ్యా ఇది..? ఓహో టెస్లుల్లా ఆడుతున్నందుకేనా.. 17 కోట్లు! -
Asian Indoor Athletics Championships 2023: ‘రికార్డు’తో మెరిసిన జ్యోతి
అస్తానా (కజకిస్తాన్): కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లో గొప్ప విజయం సాధించింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి మహిళల 60 మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకం గెల్చుకుంది. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి ఫైనల్ రేసును 8.13 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈ విభాగంలో మళ్లీ కొత్త జాతీయ రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది 60 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డును నెలకొల్పడం ఇది ఐదోసారి కావడం విశేషం. శనివారం జరిగిన హీట్స్‌లో జ్యోతి 8.16 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించగా... రోజు వ్యవధిలోనే తన పేరిటే ఉన్న రికార్డును ఆమె సవరించడం విశేషం. ఫైనల్లో మాసుమి ఆకో (జపాన్; 8.01 సెకన్లు) అందరికంటే వేగంగా లక్ష్యాన్ని దాటి స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చెన్ జియామిన్ (చైనా; 8.15 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్ లో భారత్ ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తాజా ప్రదర్శనతో జ్యోతి 19 ఏళ్ల ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 60 మీటర్ల హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. 2008లో దోహా ఆతిథ్యమిచ్చిన ఆసియా ఈవెంట్లో భారత్‌కే చెందిన లీలావతి వీరప్పన్ 9.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. జ్యోతి రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. -
Asian Indoor Athletics Championship: జ్యోతి మళ్లీ జాతీయ రికార్డు
అస్తానా (కజకిస్తాన్): భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఈ ఏడాది నాలుగోసారి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 60 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో విశాఖపట్నం అమ్మాయి జ్యోతి 8.16 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో గతవారం 8.17 సెకన్లతో ఫ్రాన్స్‌లో జరిగిన మీట్లో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. -
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నీకి జ్యోతి
ఈనెల 10 నుంచి 12 వరకు కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగే ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీకి చోటు లభించింది. విశాఖపట్టణానికి చెందిన జ్యోతి 60 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్స్‌లో పోటీపడుతుంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అథ్లెటిక్స్ మీట్లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించింది. -
Elite Indoor Track Miramas: జాతీయ రికార్డుతో జ్యోతికి రజతం
సాక్షి, హైదరాబాద్: మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ 60 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించింది. అంతేకాకుండా 60 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మీట్లో విశాఖపట్నంకు చెందిన జ్యోతి ఫైనల్ రేసును 8.17 సెకన్లలో ముగించింది. సైప్రస్ అథ్లెట్ డాఫ్నీ జార్జియు కూడా 8.17 సెకన్లలోనే రేసును ముగించింది. అయితే రియాక్షన్ టైమ్ ఆధారంగా డాఫ్నీ (0.145 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకోగా... జ్యోతి (0.175 సెకన్లు) ఖాతాలో రజతం చేరింది. అంతకుముందు హీట్స్‌లో జ్యోతి 8.18 సెకన్లతో జాతీయ రికార్డును సృష్టించగా... ఫైనల్లో తన రికార్డును ఆమె మరోసారి సవరించింది. -
100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డు
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డును సృష్టించింది. బెంగళూరులో సోమవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును జ్యోతి 12.82 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. ఈ క్రమంలో 13.04 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. Railways's Jyothi Yarraji sets new NR in Karnataka! ⚡🏃♀️ 23-years old Jyothi bettered her own NR at the National Open Athletics C'ships. By clocking 12.82s (wind +.9 m/s), she becomes 1⃣st Indian Women to go sub 13.00s on the clock for 100m H event. Congratulations! 👏👏 pic.twitter.com/Miba6ro0Cl — SAI Media (@Media_SAI) October 17, 2022 -
జ్యోతి ఖాతాలో రెండో స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ మళ్లీ మెరిసింది. ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఈ వైజాగ్ అథ్లెట్ 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును జ్యోతి 12.79 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. తెలంగాణకు చెందిన అగసార నందిని 13.38 సెకన్లలో గమ్యానికి చేరి రజత పతకం సాధించింది. మహిళల జావెలిన్ త్రోలో రష్మీ శెట్టి ఆంధ్రప్రదేశ్‌కు రజత పతకం అందించింది. రష్మీ జావెలిన్‌ను 53.95 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో కొసరాజు శివదీప్–ముని అనంత్‌మణి (ఆంధ్రప్రదేశ్) జోడీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో శివదీప్–అనంత్‌మణి ద్వయం 7–5, 3–6, 6–10తో ప్రజ్వల్ దేవ్–ఆదిల్ (కర్ణాటక) జోడీ చేతిలో ఓడి కాంస్యం సొంతం చేసుకుంది. చదవండి: London Marathon: విషాదం నింపిన మారథాన్.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్ -
National Games 2022: జ్యోతి పసిడి పరుగు
గాంధీనగర్: జాతీయ క్రీడల్లో శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు పతకాలతో మెరిశారు. మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించగా... 400 మీటర్ల విభాగంలో దండి జ్యోతిక శ్రీ రజత పతకం సొంతం చేసుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు రజత పతకం దక్కించుకున్నాడు. మరోవైపు తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెల్చు కుంది. రోలర్ స్కేటింగ్ కపుల్ డ్యాన్స్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అనుపోజు కాంతిశ్రీ–చలంచర్ల జూహిత్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ద్వయం 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ స్కేటర్ ఏలూరి కృష్ణసాయి రాహుల్ –యాష్వి శిరీష్ షా జోడీ 90.8 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జ్యోతి యెర్రాజీ అదే ఉత్సాహంతో జాతీయ క్రీడల్లోనూ అదరగొట్టింది. 100 మీటర్ల రేసును జ్యోతి 11.51 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. అర్చన (తమిళనాడు; 11.55 సెకన్లు) రజతం, డియాండ్ర (మహారాష్ట్ర; 11.62 సెకన్లు) కాంస్యం సాధించారు. 400 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతిక శ్రీ 53.30 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. ఐశ్వర్య మిశ్రా (మహారాష్ట్ర; 52.62 సెకన్లు) స్వర్ణం, రూపల్ చౌదరీ (ఉత్తరప్రదేశ్; 53.41 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు మొత్తం 270 కేజీలు (స్నాచ్‌లో 124+క్లీన్ అండ్ జెర్క్‌లో 146) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 73 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ జె.కోటేశ్వర రావు 280 కేజీల బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. శుక్రవారం రాత్రి జరిగిన రోలర్ స్పోర్ట్స్ ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల సాయిసంహిత రజతం, భూపతిరాజు అన్మిష కాంస్య పతకం సాధించారు. -
‘కామన్వెల్త్’కు జ్యోతి
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగుతున్నాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో నీరజ్ స్వర్ణం సాధించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి తొలిసారి సీడబ్ల్యూజీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల వరుసగా మూడు జాతీయ రికార్డులతో జ్యోతి అద్భుత ఫామ్‌లో ఉంది. అన్నింటికి మించి హైజంప్‌లో జాతీయ రికార్డు సాధించడంతో పాటు సులువుగా క్వాలిఫయింగ్ మార్క్‌ను అందుకున్న తేజస్విన్ శం కర్ను ఏఎఫ్ఐ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత వారమే అతను యూఎస్‌లో ఎన్సీఏఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో 2.27 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించాడు. నిబంధనల ప్రకారం ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో తేజస్విన్ పాల్గొని ఉండాల్సి ఉందని... అతను ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండేందుకు కనీసం తమనుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే పక్కన పెట్టామని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సమరివాలా స్పష్టం చేశారు. -
‘అడ్డంకులు’ దాటిన ఆట
సైప్రస్, నెదర్లాండ్స్, బెల్జియం... మూడు వేర్వేరు దేశాల వేదికలు... మూడు చోట్లా జాతీయ రికార్డులు... 16 రోజుల వ్యవధిలో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజి సాధించిన ఘనత ఇది. దాదాపు ఏడాది క్రితం మోకాలి గాయంతో బాధపడుతూ కనీసం ఒక హర్డిల్‌ను కూడా దాటలేని పరిస్థితుల్లో ఆందోళన చెందిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, ఇప్పుడు రికార్డులను తిరగరాస్తోంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి ఇప్పుడు భారత అథ్లెటిక్స్‌లో కొత్త సంచలనం. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె తాజా ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విజయాలే లక్ష్యంగా శ్రమిస్తోంది. –సాక్షి క్రీడా విభాగం 13.23 సెకన్లు... 13.11 సెకన్లు... 13.04 సెకన్లు... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఇటీవల జ్యోతి వేగం ఇది! ఇరవై ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత ఆమె అంతటితో ఆగిపోలేదు. మరింత వేగంగా, మరింత బలంగా దూసుకుపోయింది. మరో రెండుసార్లు చెలరేగి తన రికార్డును తానే సవరించుకుంది. ‘పరుగులో వేగం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం ఏకాగ్రత, మానసిక దృఢత్వం కూడా జ్యోతి విజయాలకు కారణం. యూరోప్‌లో రేసు ప్రారంభానికి వాడే స్టార్టర్ గన్లు కొంత భిన్నంగా ఉంటాయి. సైప్రస్ రేస్‌లో ఆమెకు గన్ శబ్దం సరిగా వినిపించలేదు. దాంతో ఆరంభం ఆలస్యమైంది. అయినా సరే ఏకైక లక్ష్యంతో దూసుకుపోయి రికార్డు సాధించగలిగింది. మున్ముందూ ఆమె మరిన్ని ఘనతలు సాధిస్తుంది’ అని కోచ్ జేమ్స్ హిలియర్ జ్యోతి గురించి చేసిన వ్యాఖ్య ఆమె ఆట ఏమిటో చెబుతుంది. గాయం కారణంగా దాదాపు సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉన్నా, మళ్లీ ట్రాక్‌పైకి వచ్చి జ్యోతి సత్తా చాటగలిగింది. పరుగుపై ఆసక్తితో... జ్యోతి స్వస్థలం వైజాగ్. తండ్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పుడు స్కూల్ స్థాయిలో పరుగు పందాల్లో పాల్గొన్న ఆసక్తే ఆమెను ఇప్పుడు ప్రొఫెషనల్ అథ్లెట్‌గా మార్చింది. జూనియర్ స్థాయిలో తన అథ్లెటిక్ నైపుణ్యంతో ఆకట్టుకున్న జ్యోతి ఆటకు మరింత పదును పెట్టేందుకు సరైన వేదిక లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని అర్హత సాధించడంతో గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ఆమె శిక్షణ మొదలైంది. తొలిసారి అథ్లెట్స్ ‘స్పైక్స్’ను అక్కడే వేసుకునే అవకాశం లభించిన జ్యోతి... భారత కోచ్ నాగపురి రమేశ్ పర్యవేక్షణలో దాదాపు నాలుగేళ్ల పాటు సాధన చేసి హర్డిల్స్‌లో రాటుదేలింది. 2019 ఆగస్టులో లక్నోలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్ జ్యోతి కెరీర్లో తొలి సీనియర్ టోర్నీ. మొదటి ప్రయత్నంలోనే 13.91 సెకన్ల టైమింగ్‌తో హర్డిల్స్ విజేతగా నిలవడంతో ఆమె అందరి దృష్టిలో పడింది. జాతీయ స్థాయి విజయాల కారణంగా పటియాలా ‘సాయ్’ కేంద్రంలో భారత క్యాంప్‌లో జ్యోతికి అవకాశం లభించింది. రెండు సార్లు రికార్డు కొట్టినా... కెరీర్లో దూసుకుపోయే అవకాశం లభిస్తున్న తరుణంలో ‘కరోనా’ దెబ్బ జ్యోతిపై కూడా పడింది. ‘సాయ్’ కేంద్రాన్ని మూసివేయాల్సి రావడంతో సాధనకు ఆటంకం కలిగింది. కొంత కాలం ప్రాక్టీస్ కూడా ఆగిపోయింది. అయితే కీలక సమయంలో ఆమెకు మరో రూపంలో శిక్షణకు అవకాశం లభించింది. భువనేశ్వర్‌లో ఒడిషా ప్రభుత్వంతో కలిసి రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘హై పెర్ఫార్మెన్ సెంటర్’లో జ్యోతికి అవకాశం లభించింది. దీనిని ఆమె సమర్థంగా వాడుకుంది. అక్కడి హెడ్ కోచ్ జేమ్స్ హిలియర్ పర్యవేక్షణలో జ్యోతి పరుగు మరింత మెరుగైంది. ట్రాక్‌పైకి వచ్చి రెండు సార్లు జాతీయ రికార్డు టైమింగ్‌లు (13.03 సెకన్లు, 13.08 సెకన్లు) నమోదు చేసినా... సాంకేతిక కారణాల వల్ల వాటికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య గుర్తించలేదు. అయితే ఆమె నిరాశ చెందలేదు. ‘ట్రైనింగ్ కమ్ కాంపిటీషన్’ కోసం యూరోప్ వెళ్లిన 22 ఏళ్ల జ్యోతి ఏకంగా మూడు సార్లు రికార్డు బద్దలు కొట్టి తానేమిటో చూపించింది. జాతీయ రికార్డు టైమింగ్‌ను దృష్టిలో ఉంచుకొని నేనెప్పుడూ పరుగెత్తలేదు. పరుగు మొదలెట్టాక అమిత వేగంగా లక్ష్యాన్ని చేరడమే నా పని. అందుకే రెండుసార్లు రికార్డు నమోదు కాకపోవడం బ్యాడ్‌లక్‌గా భావించానే తప్ప బాధపడలేదు. ఇప్పుడు కెరీర్లో మంచి దశలో ఉన్నాను. అయితే ప్రతిష్టాత్మక ఈవెంట్లలో భారత్ తరఫున ఇంకా పతకాలు సాధించలేదు. ప్రస్తుతం ఆ సవాల్ నా ముందుంది. రాబోయే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు ఇప్పటికే అర్హత సాధించాను కాబట్టి వాటిలో పతకాలు సాధించడంపైనే దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నా. ఒలింపిక్ అర్హత టైమింగ్ 12.90 సెకన్లు. నేను నా ఆటను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. 12.60 సెకన్ల టైమింగ్ సాధించడమే నా లక్ష్యం. –‘సాక్షి’తో జ్యోతి యర్రాజి