
కొత్త సీజన్‌లో భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరోసారి మెరిసింది. జర్మనీలో జరిగిన కుర్ప్‌ఫాల్జ్ గాలా మీట్‌లో జ్యోతి ఒక స్వర్ణం, ఒక రజత పతకం నెగ్గింది.
100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 13.06 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని గెలిచింది. 200 మీటర్ల ఫైనల్లో జ్యోతి 23.83 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. రెండు వారాల క్రితం నెదర్లాండ్స్‌లో జరిగిన హ్యారీ షులి్టంగ్ గేమ్స్‌లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణంతో కొత్త సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.
ఇవి చదవండి: IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!