Asian Indoor Athletics Championship: జ్యోతి మళ్లీ జాతీయ రికార్డు | Asian Indoor Athletics Championship: Jyothi Yarraji breaks own 60m hurdles National Record | Sakshi
Sakshi News home page

Asian Indoor Athletics Championship: జ్యోతి మళ్లీ జాతీయ రికార్డు

Published Sun, Feb 12 2023 1:42 AM | Last Updated on Sun, Feb 12 2023 1:42 AM

Asian Indoor Athletics Championship: Jyothi Yarraji breaks own 60m hurdles National Record - Sakshi

అస్తానా (కజకిస్తాన్‌): భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఈ ఏడాది నాలుగోసారి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది.

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 60 మీటర్ల హర్డిల్స్‌ హీట్స్‌లో విశాఖపట్నం అమ్మాయి జ్యోతి 8.16 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో గతవారం 8.17 సెకన్లతో ఫ్రాన్స్‌లో జరిగిన మీట్‌లో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement