national record
-
5 వేల మీటర్లలో గుల్వీర్ సింగ్ కొత్త జాతీయ రికార్డు
యోగిబో అథ్లెటిక్స్ చాలెంజ్ కప్ టోర్నీలో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. జపాన్ లో శనివారం జరిగిన ఈ రేసులో 26 ఏళ్ల గుల్వీర్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా 13 నిమిషాల 18.92 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో పోర్ట్లాండ్ ట్రాక్ ఫెస్టివల్లో గుల్వీర్ ఈ సమయాన్ని నమోదు చేశాడు. -
5 వేల మీటర్లలో గుల్వీర్ సింగ్ కొత్త జాతీయ రికార్డు
యోగిబో అథ్లెటిక్స్ చాలెంజ్ కప్ టోర్నీలో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. జపాన్ లో శనివారం జరిగిన ఈ రేసులో 26 ఏళ్ల గుల్వీర్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా 13 నిమిషాల 18.92 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో పోర్ట్లాండ్ ట్రాక్ ఫెస్టివల్లో గుల్వీర్ ఈ సమయాన్ని నమోదు చేశాడు. -
హైజంప్‌లో పూజా సింగ్ జాతీయ రికార్డు
అంతకుముందు భారత యువ అథ్లెట్ పూజా సింగ్ హైజంప్‌లో జాతీయ రికార్డు తిరగరాసింది. 17 ఏళ్ల పూజ 1.83 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పూజ తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును (1.82 మీటర్లు) బద్దలు కొట్టింది. హరియాణాకు చెందిన తాపీ మేస్త్రీ కూతురైన పూజ క్వాలిఫయింగ్ రౌండ్లో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. సరైన సౌకర్యాలు లేకుండానే అండర్–14 స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణం నెగ్గిన పూజ... ఆ తర్వాత 2022 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో అండర్–16, అండర్–18 పోటీల్లో పసిడి పతకాలు కైవసం చేసుకుంది. -
20 కిలోమీటర్ల నడకలో అక్ష్ దీప్ జాతీయ రికార్డు
చండీగఢ్: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ అథ్లెట్ అక్ష్ దీప్ సింగ్ మంగళవారం జరిగిన పోటీల్లో 20 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట 19 నిమిషాల 38 సెకన్లలో నడిచి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఒక గంట 19 నిమిషాల 55 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అక్ష్ దీప్ బద్దలు కొట్టాడు. సూరజ్ పన్వర్ (1గం:19ని.44 సెకన్లు; ఉత్తరాఖండ్) రెండో స్థానంలో, సెరి్వన్ సెబాస్టియన్ (1గం:20.03 సెకన్లు; తమిళనాడు) మూడో స్థానంలో, అర్‡్షప్రీత్ సింగ్ (1గం:20ని.04 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ (1గం:20.10 సెకన్లు) సమయాన్ని అధిగమించారు. దాంతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత వాకర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. నిబంధనల ప్రకారం ఒలింపిక్స్‌లో రేస్ వాకింగ్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ముగ్గురికి మాత్రమే పోటీపడే వీలుంది. దాంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య జూన్‌లో ట్రయల్స్ నిర్వహించి ఆరుగురి నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తుంది. -
‘పరుగుల అవ్వ’.. వయసు 95.. పోలాండ్‌లో పరుగుకు రెడీ
భగవాని దేవిని అందరూ ‘పరుగుల అవ్వ’ అంటారు. వయసు 95కు చేరినా ఆమె ఉత్సాహంగా పరుగు తీస్తోంది.. మెడల్స్ సాధిస్తోంది. 35 ఏళ్లు దాటిన వారి కోసం నిర్వహించే ‘వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్’ కోసం ఇప్పుడు ఆమె పోలాండ్‌లో ఉంది. ‘గోల్డ్ మెడల్ తెస్తాను ఉండండి’ అంటోంది. వంద మీటర్ల దూరాన్ని మీరు ఎన్ని సెకన్లలో పరిగెడతారు? హుసేన్ బోల్ట్ 9.58 సెకన్లలో పరిగెత్తాడు. టీనేజ్ పిల్లలు చురుగ్గా ఉంటే పదిహేను సెకన్లలో పరిగెడతారు. ఇరవై ఏళ్లు దాటిన వారు ఇరవై సెకన్లు తీసుకోక తప్పదు. మరి 90 దాటిన వారు? ఫిన్లాండ్లో గత ఏడాది జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో భగవాని దేవి (94) వంద మీటర్లను కేవలం 24.74 సెకన్లలో పరిగెత్తింది. అది మన నేషనల్ రికార్డ్. ఆ రికార్డ్‌తో గోల్డ్ మెడల్ సాధించింది భగవాని దేవి. ఇప్పుడు ఆమెకు తొంభై ఐదు ఏళ్లు. మార్చి 25 నుంచి 31 వరకు పోలాండ్లోని టోరౌలో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు విమానంలో బయలుదేరింది. పోయిన సంవత్సరం ఫిన్లాండ్కు పది గంటలు ప్రయాణించడం ఆమెకు కష్టమైంది. అందుకే ఈసారి స్పాన్సరర్లు ఆమెకు బిజినెస్ క్లాస్ బుక్ చేసి మరీ పంపించారు. ఆమె మెడల్ కొట్టకుండా వెనక్కు రాదని వాళ్ల గట్టి నమ్మకం. హర్యానా దాదీ భగవాని దేవిది హర్యానాలోని ఖేడ్కా అనే గ్రామం. పన్నెండు ఏళ్లకు పెళ్లయితే ముప్పై ఏళ్లు వచ్చేసరికల్లా వితంతువు అయ్యింది. పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చనిపోగా మిగిలిన ఒక్క కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా సేద్యం చేసి కొడుకును పెంచింది భగవాని దేవి. చదువుకున్న కొడుకు ఢిల్లి మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగిగా మారడంతో ఢిల్లీ చేరుకుంది. ఆ తర్వాత నానమ్మ (దాదీ) అయ్యింది. ముగ్గురు మనవల్లో వికాస్ డాగర్ క్రీడల్లో గుర్తింపు సంపాదించాడు. అతడే తన దాదీలో ఆటగత్తె ఉందని గ్రహించాడు. ‘ఒకరోజు నేను షాట్ పుట్ ఇంటికి తెచ్చాను. నువ్వు విసురుతావా నానమ్మా అని అడిగితే మొహమాట పడింది. కాని మరుసటి రోజు ఉదయం ఆమె దానిని విసరిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని తెలిపాడు వికాస్. ఆ తర్వాత అతడే తన దాదీకి కోచ్‌గా మారి ఆమెను అథ్లెట్‌ను చేశాడు. ‘చిన్నప్పుడు కబడ్డీ ఆడటం తప్ప నాకు వేరే ఏం గుర్తు లేదు’ అని నవ్వుతుంది భగవాని దేవి. బైపాస్ ఆపరేషన్ జరిగినా భగవాని దేవికి 2007లో బైపాస్ ఆపరేషన్ జరిగింది. అయినా సరే ఆమె పూర్తి ఆరోగ్యంగా, చురుగ్గా ఉంది. పరిగెడితే అలసిపోదు. వేరే ఏ ఇబ్బందులు లేవు. అందువల్ల త్వరలోనే ఆమె వయోజనులకు పెట్టే పోటీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. కాని గత ఏడాది ఫిన్లాండ్లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఆమెకు విశేష గుర్తింపు వచ్చింది. ‘నాకు ఏదైనా అవుతుందని భయపడవద్దు. దేశం కోసం పరుగెట్టి ప్రాణం విడిచినా నాకు సంతోషమే’ అని చెప్పి బయలుదేరిందామె పోయినసారి. ఈసారి కూడా ఆ స్ఫూర్తి చెక్కుచెదరలేదు. సెంచరీ వయసులోనూ పరిగెడతాను’ అంటుంది భగవాని దేవి. -
స్కీట్‌లో గనీమత్ జాతీయ రికార్డు సమం
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్లో మహిళల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ గనీమత్ సెఖోన్ జాతీయ రికార్డును సమం చేసింది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల గనీమత్ క్వాలిఫయింగ్‌లో 125 పాయింట్లకుగాను 120 పాయింట్లు స్కోరు చేసింది. అయితే ఆమె ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. షూట్ ఆఫ్‌లో గనీమత్ గురి తప్పి టాప్–8లో నిలువలేకపోయింది. భారత్‌కే చెందిన దర్శన రాథోడ్ 117 పాయింట్లతో 25వ స్థానంలో, మహేశ్వరి చౌహాన్ 116 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచారు. -
Asian Indoor Athletics Championship: జ్యోతి మళ్లీ జాతీయ రికార్డు
అస్తానా (కజకిస్తాన్): భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఈ ఏడాది నాలుగోసారి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 60 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో విశాఖపట్నం అమ్మాయి జ్యోతి 8.16 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో గతవారం 8.17 సెకన్లతో ఫ్రాన్స్‌లో జరిగిన మీట్లో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. -
Elite Indoor Track Miramas: జాతీయ రికార్డుతో జ్యోతికి రజతం
సాక్షి, హైదరాబాద్: మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ 60 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించింది. అంతేకాకుండా 60 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మీట్లో విశాఖపట్నంకు చెందిన జ్యోతి ఫైనల్ రేసును 8.17 సెకన్లలో ముగించింది. సైప్రస్ అథ్లెట్ డాఫ్నీ జార్జియు కూడా 8.17 సెకన్లలోనే రేసును ముగించింది. అయితే రియాక్షన్ టైమ్ ఆధారంగా డాఫ్నీ (0.145 సెకన్లు) స్వర్ణ పతకం దక్కించుకోగా... జ్యోతి (0.175 సెకన్లు) ఖాతాలో రజతం చేరింది. అంతకుముందు హీట్స్‌లో జ్యోతి 8.18 సెకన్లతో జాతీయ రికార్డును సృష్టించగా... ఫైనల్లో తన రికార్డును ఆమె మరోసారి సవరించింది. -
3000 మీ. స్టీపుల్‌చేజ్‌లో పారుల్ జాతీయ రికార్డు
భారత అథ్లెట్ పారుల్ చౌదరీ 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. లాస్‌ఏంజెలిస్‌లో జరిగిన సౌండ్ రన్నింగ్ మీట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల పారుల్ ఈ ఘనత సాధించింది. పారుల్ 3వేల మీటర్లను 8ని:57.19 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తమిళనాడు అథ్లెట్ సురియా (9ని: 04.5 సెకన్లు; 2016లో) సాధించిన జాతీయ రికార్డును పారుల్ బద్దలు కొట్టింది. ఈనెలలో అమెరికాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె బరిలోకి దిగనుంది. -
అవినాశ్ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు
రబట్ (మొరాకో): వరుసగా కొత్త జాతీయ రికార్డులతో సత్తా చాటుతున్న భారత అథ్లెట్ అవినాశ్ సబ్లే మరో అరుదైన ఘనతను సాధించాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా గుర్తింపు ఉన్న డైమండ్ లీగ్‌లో అతను ఐదో స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అతను 8 నిమిషాల 12.48 సెకన్లలో గమ్యం చేరాడు. ఇది భారత్ తరఫున కొత్త జాతీయ రికార్డు. గత మార్చిలో తానే నమోదు చేసిన 8 నిమిషాల 16.21 సెకన్ల టైమింగ్‌ను దాదాపు మూడు సెకన్ల తేడాతో అవినాశ్ సవరించాడు. ఏకంగా ఎనిమిదిసార్లు అతను తన జాతీయ రికార్డులనే బద్దలు కొడుతూ కొత్త రికార్డులు నెలకొల్పడం విశేషం. గత నెలలో 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసిన అవినాశ్... 30 ఏళ్లనాటి బహదూర్ ప్రసాద్ రికార్డు (13 నిమిషాల 29.70 సెకన్లు)ను తుడిచేశాడు. తాజా ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత సూఫినాయ్ బకాలి (7 నిమిషాల 58.28 సెకన్లు)కి స్వర్ణం దక్కింది. చదవండి: Rafael Nadal: ‘సెల్యూట్ ఫరెవర్’.. నాదల్‌పై సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు -
జ్యోతి ‘రికార్డు’ పరుగు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటుకుంటున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ రెండు వారాల వ్యవధిలో రెండోసారి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇంగ్లండ్‌లోని లాగ్బరవ్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో వైజాగ్‌కు చెందిన 22 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసును 13.11 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈనెల 10న సైప్రస్ అంతర్జాతీయ మీట్లో 13.23 సెకన్లతో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జ్యోతి తాజా ప్రదర్శనతో ఆమె కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా అర్హత సాధించింది. భువనేశ్వర్‌లోని రిలయెన్స్ ఫౌండేషన్ ఒడిశా అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో జేమ్స్ హిలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. 2002లో అనురాధా బిస్వాల్ 13.38 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును గత నెలలో ఫెడరేషన్ కప్ సందర్భంగా జ్యోతి (13.09 సెకన్లు) సవరించింది. అయితే రేసు జరిగిన సమయంలో మైదానంలో గాలి వేగం నిబంధనలకు లోబడి లేకపోవడంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) జ్యోతి రికార్డును గుర్తించలేదు. 2020లో కర్ణాటకలో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్లో జ్యోతి 13.03 సెకన్ల సమయాన్ని నమోదు చేసింది. అయితే యూనివర్సిటీ మీట్లో జ్యోతికి డోపింగ్ టెస్టు చేయకపోవడంతోపాటు ఏఎఫ్ఐ సాంకేతిక అధికారులెవరూ హాజరుకాకపోవడంతో అప్పుడు కూడా జ్యోతి రికార్డును గుర్తించలేదు. అయితే మూడో ప్రయత్నంలో జ్యోతి శ్రమ వృథా కాలేదు. సైప్రస్ మీట్లో జ్యోతి నమోదు చేసిన సమయానికి గుర్తింపు లభించింది. దాంతో 20 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డు బద్దలయింది. -
200 మీటర్ల విభాగంలో సరికొత్త రికార్డు..
Federation Cup Athletics- జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ మీట్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. కాలికట్లో జరుగుతున్న ఈ టోర్నీలో అస్సాం అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 200 మీటర్ల ఫైనల్ రేసును 20.52 సెకన్లలో ముగించి స్వర్ణం సాధించాడు. నాలుగేళ్ల క్రితం మొహమ్మద్ అనస్ (కేరళ) 20.63 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అమ్లాన్ బద్దలు కొట్టాడు. ఆకాశ్ (ఉత్తర ప్రదేశ్; 20.89 సెకన్లు) రజతం, అజ్మల్ (కేరళ; 20.92 సెకన్లు) కాంస్యం నెగ్గారు. చదవండి: Pat Cummins: ఎంట్రీతోనే అదరగొట్టిన కమిన్స్.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు -
అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ..!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సెప్టెంబర్ 30న భారత మార్కెట్లలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్లను కొనుగోలుదారులు ఎగబడి బుకింగ్ చేసుకున్నారు. కేవలం ఒక గంటలోపు 25 వేల మంది మహీంద్రా XUV700ను బుక్ చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డును మహీంద్రా ఎక్స్‌యూవీ రికార్డును నమోదుచేసింది. చదవండి: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...! మహీంద్రా ఎక్స్‌యూవీ మరో రికార్డు...! తాజాగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 మరో జాతీయ రికార్డును నెలకొల్పింది. చెన్నై సమీపంలోని కొత్త ఎస్యూవీ ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్‌ఎస్‌పీటీ) లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ కొత్త జాతీయ రికార్డును సృష్టించింది.ఈ ఛాలెంజ్‌లోకి నాలుగు XUV700 SUV లు ఈవెంట్లో ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది. మహీంద్రా XUV700 నాలుగు వేరియంట్లలో డీజిల్ మాన్యువల్ వేరియంట్ 4384.73 కిమీలతో , డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ 4256.12 కిమీ, పెట్రోల్ మాన్యువల్ 4232.01 కిమీ చేయగా, పెట్రోల్ ఆటోమేటిక్ 4155.65 కి.మీమేర ప్రయాణించి రికార్డును సృష్టించాయి. ఈ వాహనాలు సగటున 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో నడిచాయి. చదవండి: 9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..! -
Harmilan Kaur: మహిళల 1500 మీటర్ల రేసులో 19 ఏళ్ల రికార్డు బద్దలు
ఢిల్లీ: మహిళల 1500 మీటర్ల రేసులో పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల హర్మిలన్ కౌర్ బైన్స్ 19 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. హర్మిలన్ 4ని:05.39 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2002 ఆసియా క్రీడల్లో 4ని:06.03 సెకన్లతో సునీతా రాణి నెలకొల్పిన రికార్డును హర్మిలన్ తిరగరాసింది. గత ఏడాదిన్నర కాలంలో హర్మిలన్ ఎనిమిది జాతీయస్థాయి రేసుల్లో పాల్గొనగా అన్నింటా విజేతగా నిలువడం విశేషం. తెలంగాణ మహిళల బృందానికి కాంస్యం జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ బృందం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జీవంజి దీప్తి, నిత్య, మాయావతి నకిరేకంటి, అగసార నందినిలతో కూడిన తెలంగాణ రిలే జట్టు 47.18 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. రైల్వేస్‌కు స్వర్ణం, తమిళనాడుకు రజతం లభించాయి. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలంగాణకు చెందిన అగసార నందిని ఫైనల్‌కు చేరింది. -
Tajinder Toor: ఒలింపిక్స్‌కు తజిందర్ అర్హత
పాటియాలా: ఇండియన్ గ్రాండ్‌ప్రి–4 అథ్లెటిక్స్ మీట్లో మూడు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజిందర్ పాల్ సింగ్ తూర్ కొత్త జాతీయ రికార్డు, ఆసియా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ మీట్లో పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల తజిందర్ ఇనుప గుండును 21.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 21.10 మీటర్లను అతను అధిగమించాడు. 20.92 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తజిందర్ సవరిం చాడు. తజిందర్ ధాటికి 12 ఏళ్ల ఆసియా రికార్డు కూడా తుడిచి పెట్టుకుపోయింది. 21.13 మీటర్లతో 2009లో సుల్తాన్ అబ్దులుమ్ అల్ హెబ్షీ (సౌదీ అరేబియా) సాధించిన ఆసియా రికార్డును తజిందర్ బద్దలు కొట్టాడు. ద్యుతీ చంద్ కూడా... మహిళల 100 మీటర్ల విభాగంలో ఒడిశా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కూడా కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. ఆమె 11.17 సెకన్లలో రేసును ముగిం చి 11.21 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. 4్ఠ100 మీటర్ల రిలేలో ద్యుతీ చంద్, హిమా దాస్, ధనలక్ష్మి, అర్చనలతో కూడిన భారత ‘ఎ’ జట్టు 43.37 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 43.42 సెకన్ల తో 2016లో మెర్లిన్, జ్యోతి, శ్రావణి ద్యుతీ బృం దం చేసిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ రికార్డే కానీ... మహిళల డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ సింగ్ కూడా కొత్త జాతీయ రికార్డు ప్రదర్శనను నమోదు చేసింది. కమల్‌ప్రీత్ డిస్క్‌ను 66.59 మీటర్ల దూరం విసిరింది. గత మార్చిలో ఫెడరేషన్ కప్‌లో కమల్‌ప్రీత్ 65.06 మీటర్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. అయితే కమల్‌ప్రీత్ తాజా ప్రదర్శనను జాతీయ రికార్డుగా గుర్తించడం లేదు. రికార్డుగా గుర్తించాలంటే నిబంధనల ప్రకారం ఒక కేటగిరీలో కనీసం ముగ్గురు బరిలో ఉండాలి. సోమవారం జరిగిన మీట్లో కమల్‌ప్రీత్ కేటగిరీలో ఆమె ఒక్కరే పాల్గొన్నారు. -
షాట్‌పుట్‌లో తజీందర్ జాతీయ రికార్డు
రాంచీ: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ లో తజీందర్ పాల్ సింగ్ తూర్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజీందర్ ఇనుప గుండును 20.92 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. 20.75 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఈ నెలాఖర్లో చైనాలో జరిగే ప్రపంచ మిలిటరీ గేమ్స్‌లో పాల్గొనబోతున్న తజీందర్ ఆ ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 21.10 మీటర్లను అందుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తజీందర్ 20.43 మీటర్లతో 18వ స్థానంలో నిలిచాడు. -
37 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు
భువనేశ్వర్: మూడున్నర దశాబ్దాలకుపైగా చెక్కు చెదరకుండా ఉన్న జాతీయ అథ్లెటిక్స్ రికార్డు శుక్రవారం బద్దలైంది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో సర్వీసెస్ తరఫున బరిలో దిగిన అవినాశ్ ఈ రికార్డును తిరగరాశాడు. 1981 టోక్యో అథ్లెటిక్స్ మీట్లో గోపాల్ సైనీ (8ని.30.88 సెకన్లు) నెలకొల్పిన రికార్డును తాజాగా ఈ 24 ఏళ్ల అథ్లెట్ సవరించాడు. అవినాశ్ 8 నిమిషాల 29.80 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. రాకేశ్ కుమార్ స్వామి 8ని. 47.31 సెకన్లలో... దుర్గా బహదూర్ 8ని. 48.29 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
ముగ్గురూ ముగ్గురే.. సూపర్ రికార్డు
ఆడపిల్లలకు రక్షణ అందించడంతో పాటు, వారికి విద్యావశ్యకతను చాటిచెప్పుటకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పథకం బేటీ బచావో, బేటీ పడావో. ఈ పథకానికి మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోంది. నలుగురు కూతుర్లలో ముగ్గురు కూతుర్లు ఒకేసారి డాక్టరేట్ పట్టా తీసుకొని వారి తల్లిదండ్రులకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటును కానుకగా ఇచ్చారు. రెవా జిల్లాలో అడ్వకేట్ విజయ్ శంకర్ మిశ్రా, గిరిజా మిశ్రాలకు నలుగురు కూతుళ్లు. వారిలో ముగ్గురు కూతుర్లు ఒకేసారి 2014లో అవదేష్ ప్రతాప్ సింగ్(ఏపీఎస్) యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టాలు తీసుకున్నారు. బేటీ బచావో, బేటీ పడావోకు ఈ అక్కాచెల్లెళ్లు ఆదర్శంగా నిలుస్తున్నట్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు పేర్కొంది. వారితో పాటు వారి తల్లిదండ్రుల ఫోటోలను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల 2017 ఎడిషన్‌లో ప్రముఖంగా ప్రచురించనున్నట్టు.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా లేఖను అందుకున్నారు. పెద్ద కూతురు అర్చనా(36).. భారతీయ సాంప్రదాయాల్లో అమ్మాయిల పాత్రపై పరిశోధన నిర్వహించి చరిత్రలో పీహెచ్డీ తీసుకోగా.. అంజనా(33), అన్షు(30) ఇద్దరూ పర్యావరణ శాస్త్రంలో డాక్టరేట్ పొందినట్టు తండ్రి మిశ్రా పేర్కొన్నారు. ఈ ముగ్గురూ ఒకేసారి పీహెచ్డీ పట్టాలు పొందడం విశేషం. ఆడపిల్లల్ని చదివించడానికే వెనుకాడుతున్న వారికి ఈ తల్లిదండ్రులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని, బేటీ బచావో, బేటీ పడావో స్లోగన్‌కు నిలువెత్తు నిదర్శంగా అభివర్ణిస్తూ పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రిజర్వేషన్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోవడంతో కాలేజీ లెక్చరర్స్‌గా చేరినట్టు తండ్రి తెలిపారు. ప్రస్తుతం న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్లు పొందిన అర్చనా, అన్షు జ్యుడిషియల్ సర్వీసు ఎగ్జామ్‌కు సన్నద్ధమవుతున్నారని, అదేవిధంగా అంజనా న్యూఢిల్లీలో సివిల్ సర్వీసు ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుందని తండ్రి పేర్కొన్నారు. -
4 X100 మీ. రిలేలో జాతీయ రికార్డు
న్యూఢిల్లీ: బీజింగ్ వరల్డ్ చాలెంజ్ అథ్లెటిక్స్ మీట్లో భారత రిలే మహిళల జట్టు 4ఁ100 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పింది. చైనాలోని బీజింగ్‌లో బుధవారం జరిగిన ఈ మీట్లో ద్యుతీచంద్, శ్రాబని నంద, హెచ్ఎం జ్యోతి, మెర్లిన్ జోసెఫ్‌లతో కూడిన భారత బృందం 44.03 సెకన్లలో గమ్యానికి చేరుకొని నాలుగో స్థానాన్ని సంపాదించింది. ఈ క్రమంలో ద్యుతీచంద్ జట్టు 1998లో సరస్వతి, రచిత మిస్త్రీ, షైలా, పీటీ ఉష బృందం 44.43 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ రికార్డు నెలకొల్పిన మహిళల రిలే జట్టుకు తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరించారు. -
తొలి వికెట్‌కు 302 పరుగులు
ఆంధ్ర అమ్మాయిల జాతీయ రికార్డు సాక్షి, గుంటూరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళల అండర్-19 సౌత్‌జోన్ లీగ్ టోర్నమెంట్లో ఆంధ్ర అమ్మాయిలు తొలి వికెట్ భాగస్వామ్యానికి జాతీయ రికార్డు సృష్టించారు. తమిళనాడుతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్లు ఎన్.అనూష (159 బంతుల్లో 168 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎం.దుర్గా (149 బంతుల్లో 100 నాటౌట్; 4 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. తొలి వికెట్‌కు అజేయంగా 50 ఓవర్లలో 302 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 32.3 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆంధ్ర జట్టు 229 పరుగుల ఆధిక్యం తో గెలిచింది. ఆంధ్ర బౌలర్లలో పద్మజ (3/17), భావన (2/11), శరణ్య (2/10) రాణించారు. -
మూడు రోజుల్లో ‘బాహుబలి’కి రూ.160 కోట్లు
బళ్లారి: బాహుబలి చిత్రం విడుదలైన మూడురోజుల్లోనే రూ.160 కోట్లు వసూలు చేసి జాతీయ రికార్డు సృష్టించిందని చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వెల్లడించారు. ఇదంతా ప్రేక్షక దేవుళ్లు చూపిన అభిమానంతోనే సాధ్యమైందన్నారు. సోమవారంరాత్రి నగరంలోని రాధిక థియేటర్లో సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, నిర్మాత సాయి కొర్రపాటిలతో కలిసి చిత్రాన్ని వీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షుకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని టెన్షన్‌గా ఉండేదని, ఇప్పుడదంతా పోయిందని పేర్కొన్నారు. బాహుబలి రెండో పార్ట్ షూటింగ్ 50 శాతం పూర్తయిందని, త్వరలో మిగతా భాగం పూర్తి చేసి ఏడాదిలోపు విడుదల చేస్తామన్నారు. -
తన రికార్డు తానే బద్ధలు
న్యూఢిల్లీ: తన రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నాడు ప్రముఖ హ్యామర్ త్రో క్రీడాకారుడు కమల్ ప్రీత్ సింగ్. టస్కాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఈ అథ్లెట్ క్రీడాకారుడు 72.86 మీటర్ల దూరం హ్యామర్‌ను విసిరి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఆసియాలోనే మూడో వ్యక్తి గా రికార్డు నమోదుచేశాడు. గడిచిన రెండు నెలల్లోనే ఇలా జాతీయ స్థాయి రికార్డును బద్ధలు కొట్టేయడం ఇది రెండో సారి. ఇదిలా ఉండగా, జూన్ 3 నుంచి 7 వరకు చైనాలో జరిగే ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కోసం కమల్ ఎంపిక కాకపోవడం గమనార్హం. పంజాబ్‌కు చెందిన కమల్ ప్రీత్ సింగ్ పేరిట గతంలో 70.38, 70.37 మీటర్ల రికార్డు ఉండగా ఈసారి 72.86 మీటర్లు హ్యామర్ ను విసిరి రికార్డు బద్ధలు కొట్టాడు. -
పాస్‌పోర్ట్‌ల జారీలో జాతీయ రికార్డు
ఒక్క ఆగస్టులోనే హైదరాబాద్‌లో 84,852 పాస్‌పోర్ట్‌ల జారీ సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం జాతీయ రికార్డు నెలకొల్పింది. ఒక్క ఆగస్టు నెలలోనే రికార్డు స్థాయిలో 84,752 పాస్‌పోర్ట్‌లను జారీ చేసిన ఘనతను దక్కించుకుంది. దేశంలో 37 పాస్‌పోర్ట్ కార్యాలయాలంటే ఇప్పటివరకూ ఏ పాస్‌పోర్ట్ కార్యాలయం కూడా ఒకే నెలలో ఇన్ని పాస్‌పోర్ట్‌లను జారీ చేయలేదు. మార్చి నెలలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచే అత్యధికంగా 65,700 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. ఇప్పుడు 84,752 పాస్‌పోర్ట్‌లను జారీ చేసి తన రికార్డును తానే తిరగరాసుకుంది. ఎక్కువ పాస్‌పోర్ట్‌లను జారీ చేసేందుకు పాస్‌పోర్ట్ కార్యాలయ ఉద్యోగులు అదనపు గంటలు పనిచేశారని, సెలవు దినాలైన శని, ఆదివారాల్లోనూ పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ విభాగం అధికారి డా.ఎ.శిరీష్ తెలిపారు. జాతీయ రికార్డు సృష్టించినందుకు ఉద్యోగులను పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు అభినందించారు. దరఖాస్తుదారులకు మరింత మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది 7.5 లక్షలకుపైగా పాస్‌పోర్ట్‌ల జారీకి అవకాశముంది. ప్రస్తుతం ఈ పాస్‌పోర్ట్ కేంద్రం పరిధిలో 18 జిల్లాలున్నాయి. ఆరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. -
85 ఫోర్లు, 5 సిక్సర్లు.. 546 పరుగులు
ముంబై టీనేజ్ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా జాతీయ రికార్డు సృష్టించాడు. అంతర్ పాఠశాలల టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా 15 ఏళ్ల పృథ్వీ (85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546) రికార్డ్ బ్రేక్ చేశాడు. ప్రతిష్టాత్మక హారీస్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆజాద్ మైదాన్‌లో బుధవారం సెయింట్ ఫ్రాన్సిస్ డీ అస్సిసి బోరివలి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ రికార్డు ఇప్పటిదాకా టీమిండియా మాజీ ఓపెనర్ వసం జాఫర్ మేనల్లుడు ఆర్మన్ (498) పేరిట ఉంది. తాజాగా పృథ్వీ బద్దలు కొట్టాడు. మహారాష్ట్ర అండర్-16 జట్టుకు పృథ్వీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా వీరిద్దరూ రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ పాఠశాల విద్యార్థులు కావడం విశేషం. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ కూడా హారీస్ షీల్డ్ టోర్నీ ద్వారానే తొలుతు వెలుగులోకి వచ్చాడు. వినోద్ కాంబ్లీతో కలసి మాస్టర్ రికార్డు భాగస్వామ్యం (664) నెలకొల్పాడు.