యోగిబో అథ్లెటిక్స్ చాలెంజ్ కప్ టోర్నీలో భారత అథ్లెట్ గుల్‌వీర్ సింగ్ 5000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు.
జపాన్ లో శనివారం జరిగిన ఈ రేసులో 26 ఏళ్ల గుల్‌వీర్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా 13 నిమిషాల 18.92 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును గుల్‌వీర్ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో పోర్ట్‌లాండ్ ట్రాక్ ఫెస్టివల్‌లో గుల్‌వీర్ ఈ సమయాన్ని నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment