చండీగఢ్: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ అథ్లెట్ అక్ష్ దీప్ సింగ్ మంగళవారం జరిగిన పోటీల్లో 20 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట 19 నిమిషాల 38 సెకన్లలో నడిచి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఒక గంట 19 నిమిషాల 55 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అక్ష్ దీప్ బద్దలు కొట్టాడు.
సూరజ్ పన్వర్ (1గం:19ని.44 సెకన్లు; ఉత్తరాఖండ్) రెండో స్థానంలో, సెరి్వన్ సెబాస్టియన్ (1గం:20.03 సెకన్లు; తమిళనాడు) మూడో స్థానంలో, అర్‡్షప్రీత్ సింగ్ (1గం:20ని.04 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ (1గం:20.10 సెకన్లు) సమయాన్ని అధిగమించారు. దాంతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత వాకర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది.
నిబంధనల ప్రకారం ఒలింపిక్స్‌లో రేస్ వాకింగ్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ముగ్గురికి మాత్రమే పోటీపడే వీలుంది. దాంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య జూన్‌లో ట్రయల్స్ నిర్వహించి ఆరుగురి నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment