200 మీటర్ల విభాగంలో సరికొత్త రికార్డు.. | Federation Cup: Athlete Amlan Borgohain Breaks 200m National Record | Sakshi
Sakshi News home page

Amlan Borgohain: భళా అమ్లాన్‌.. 200 మీటర్ల విభాగంలో సరికొత్త రికార్డు

Published Thu, Apr 7 2022 8:19 AM | Last Updated on Thu, Apr 7 2022 8:38 AM

Federation Cup: Athlete Amlan Borgohain Breaks 200m National Record - Sakshi

Federation Cup Athletics- జాతీయ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో పురుషుల 200 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. కాలికట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అస్సాం అథ్లెట్‌ అమ్లాన్‌ బొర్గోహైన్‌ 200 మీటర్ల ఫైనల్‌ రేసును 20.52 సెకన్లలో ముగించి స్వర్ణం సాధించాడు.

నాలుగేళ్ల క్రితం మొహమ్మద్‌ అనస్‌ (కేరళ) 20.63 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అమ్లాన్‌ బద్దలు కొట్టాడు. ఆకాశ్‌ (ఉత్తర ప్రదేశ్‌; 20.89 సెకన్లు) రజతం, అజ్మల్‌ (కేరళ; 20.92 సెకన్లు) కాంస్యం నెగ్గారు. 

చదవండి: Pat Cummins: ఎంట్రీతోనే అదరగొట్టిన కమిన్స్‌.. ఐపీఎల్‌ చరిత్రలో కొత్త రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement