ఆంధ్ర అమ్మాయిల జాతీయ రికార్డు
సాక్షి, గుంటూరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళల అండర్-19 సౌత్‌జోన్ లీగ్ టోర్నమెంట్‌లో ఆంధ్ర అమ్మాయిలు తొలి వికెట్ భాగస్వామ్యానికి జాతీయ రికార్డు సృష్టించారు. తమిళనాడుతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్లు ఎన్.అనూష (159 బంతుల్లో 168 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎం.దుర్గా (149 బంతుల్లో 100 నాటౌట్; 4 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. తొలి వికెట్‌కు అజేయంగా 50 ఓవర్లలో 302 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 32.3 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆంధ్ర జట్టు 229 పరుగుల ఆధిక్యం తో గెలిచింది. ఆంధ్ర బౌలర్లలో పద్మజ (3/17), భావన (2/11), శరణ్య (2/10) రాణించారు.
తొలి వికెట్‌కు 302 పరుగులు
Published Tue, Sep 22 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM
Advertisement
Advertisement